'పృథ్వీషా' డబుల్ సెంచరీ.. వినయ్ కుమార్ ఖాతాలో 400 వికెట్లు!!

వడోదర: భారత యువ సంచనలం పృథ్వీ షా విశ్వరూపం ప్రదర్శించాడు. డోపింగ్ వ్యవహారంలో ఎనిమిది నెలల సస్పెన్షన్ అనంతరం బరిలోకి దిగిన ఈ ముంబై ఆటగాడు తొలి రంజీ మ్యాచ్‌లోనే డబుల్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. రంజీ ట్రోఫీలో భాగంగా బరోడాతో జరుగుతున్న మ్యాచ్‌లో పృథ్వీ షా (179 బంతుల్లో 202, 19ఫోర్లు, 7 సిక్సర్లు) ద్విశతకం సాధించాడు. తొలి ఇన్నింగ్స్‌లో 66 పరుగులు చేసిన షా.. రెండో ఇన్నింగ్స్‌లో ధాటిగా ఆడుతూ ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించాడు.

పృథ్వీషా విశ్వరూపం:
షా 84 బంతుల్లోనే శతకాన్ని పూర్తి చేశాడు. అదే జోరులో చిరస్మరణీయ ద్విశతకం చేశాడు. షాతో పాటు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (102 నాటౌట్) సెంచరీ చేయడంతో ముంబై రెండో ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లకు 409 పరుగులు చేసి డిక్లేర్డ్ చేసింది. బరోడా ముందు 533 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. లక్ష్య ఛేదనలో బరోడా మూడో రోజు ఆటముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో 74/3తో నిలిచింది. తొలి ఇన్నింగ్స్‌ల్లో ముంబై 431 పరుగులు చేయగా.. బరోడా 307 పరుగులు చేసింది.

వినయ్ కుమార్@400:
బిహార్‌తో జరిగిన మ్యాచ్‌లో పుదుచ్చేరి 10 వికెట్ల తేడాతో గెలిచింది. పుదుచ్చేరి తరపున ఆడుతున్న టీమిండియా మాజీ బౌలర్ వినయ్ కుమార్ రెండో ఇన్నింగ్స్‌లో 4 వికెట్లు తీయడంతో.. రంజీల్లో 400 వికెట్లు పడగొట్టిన రెండో పేస్ బౌలర్‌గా రికార్డుల్లోకి ఎక్కాడు. పంకజ్ సింగ్ (409 వికెట్లు) ముందున్నాడు. ఓవరాల్‌గా రంజీ ట్రోఫీ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన రికార్డు లెఫ్టార్మ్ స్పిన్నర్ రాజిందర్ గోయల్ (637 వికెట్లు) పేరిట ఉంది.

పుంజుకున్న హైదరాబాద్:
ఉప్పల్ స్టేడియంలో గుజరాత్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కెప్టెన్ తన్మయ్ అగర్వాల్ (170 బంతుల్లో 96) రాణించడంతో హైదరాబాద్ పుంజుకుంది. రెండో ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లకు 239 పరుగులు చేసిన హైదరాబాద్ జట్టు 159 పరుగుల ఆధిక్యంలో ఉంది. క్రీజులో సుమంత్ (13), త్యాగరాజన్ (10) ఉన్నారు. మూడో రోజైన బుధవారం ఓవర్‌నైట్ స్కోరుకు 18 పరుగులు జోడించి 313 పరుగులకు గుజరాత్ ఆలౌట్ అయింది. 80 పరుగుల వెనుకంజతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన హైదరాబాద్‌కు ఓపెనర్లు శుభారంభాన్నిచ్చారు. ఆ తర్వాతి బావనక సందీప్ (41) సాయంతో తన్మయ్ రాణించాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications