Ranji Trophy : ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో 92ఏళ్ల రికార్డును బద్ధలు కొట్టిన ముంబై టీం

రంజీ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్‌లో నాలుగో రోజు 725పరుగుల తేడాతో ఉత్తరాఖండ్‌ను ముంబై జట్టు చిత్తుగా ఓడించింది. తద్వారా సెమీస్‌లోకి దూసుకెళ్లింది. ఇక భారీ విజయంతో ఫస్ట్‌క్లాస్ క్రికెట్ చరిత్రలో అత్యధిక పరుగుల తేడాతో గెలిచిన జట్టుగా ముంబై ప్రపంచ రికార్డు నమోదు చేసింది. అంతకుముందు 92ఏళ్ల క్రితం క్వీన్స్‌లాండ్ జట్టును 685పరుగుల తేడాతో ఓడించిన న్యూ సౌత్ వేల్స్ పేరిట ఈ రికార్డు ఉంది. తాజాగా ముంబై గెలుపుతో 92ఏళ్ల ఆ రికార్డ్ బద్ధలయింది. ఇకపోతే రంజీ ట్రోఫీలో 1953-54లో ఒడిశాను 540పరుగుల తేడాతో ఓడించిన బెంగాల్ ఇప్పటివరకు అత్యధిక పరుగుల తేడాతో గెలుపొందిన జట్టుగా కొనసాగుతుండగా.. తాజాగా ముంబై విజయంతో ఆ రికార్డ్ బద్ధలైంది.

ఇటీవలే 129ఏళ్ల నాటి రికార్డు బద్ధలు
ఇకపోతే ఈ రంజీట్రోఫీలో ఆస్ట్రేలియన్ ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 129ఏళ్ల క్రితం నాటి రికార్డును బెంగాల్ అధిగమించిన సంగతి తెలిసిందే. టాప్-9లో ఉన్న బ్యాటర్లందరూ ఒక ఇన్నింగ్స్‌లో 50+ పరుగులు చేయడం ద్వారా ఆ రికార్డ్ నమోదైంది. ఈ మ్యాచ్‌లో బెంగాల్ ఓపెనర్లు అభిషేక్ రామన్ (61), అభిమన్యు ఈశ్వరన్ (65) 132 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేయగా.. ఘరామి (186), మజుందార్ (117)లు తర్వాత సెంచరీలతో ఆకట్టుకున్నారు. ఇక వెటరన్ బ్యాటర్ మనోజ్ తివారీ 173 బంతుల్లో 73 పరుగులు చేయగా.. వికెట్ కీపర్-బ్యాటర్ అభిషేక్ పోరెల్ (68), షాబాజ్ అహ్మద్ (78), సయన్ మొండల్ (53*), ఆకాశ్ దీప్ (53*) హాఫ్ సెంచరీలు బాదడంతో ఈ రికార్డ్ నమోదైంది.

సెమీఫైనల్లో ఉత్తరప్రదేశ్‌తో అమీతుమీ
ఈ ప్రతిష్టాత్మక దేశవాళీ పోటీ అయిన రంజీ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్లో ముంబై జట్టు తాజా విజయంతో సెమీఫైనల్లో ఉత్తరప్రదేశ్‌తో తలపడనుంది. 41సార్లు రంజీ ట్రోఫీ విజేతలయిన ముంబై జట్టు.. ఈ దఫా కూడా మొదటి మ్యాచ్ నుండి తమ ఆధిపత్యం చెలాయించింది. ఇక రెండో ఇన్నింగ్స్‌ను 261/3 వద్ద డిక్లేర్ చేసి.. ఉత్తరాఖండ్‌కు 794పరుగుల అసంభవమైన లక్ష్యాన్ని ముంబై నిర్దేశించగా.. కేవలం 69పరుగులకే ఉత్తరాఖాండ్ ఆలౌట్ అయింది. దీంతో ముంబై 725పరుగుల భారీ తేడాతో గెలుపొందింది.

ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా సువేద్ పార్కర్
ముంబై తరఫున అరంగేట్రం చేసిన ఆటగాడు సువేద్ పార్కర్ (252) ఈ మ్యాచ్‌లో డబుల్ సెంచరీతో ఆకట్టుకోవడంతో ముంబై తొలి ఇన్నింగ్స్‌లో 647/8పరుగుల వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. ఇక ఫస్ట్ ఇన్నింగ్స్‌లో ఉత్తరాఖండ్ 114పరుగులకే చాప చుట్టేసింది. షామ్స్ ముల్తానీ 5వికెట్ల హాల్ సాధించి ఉత్తరాఖండ్ పని పట్టాడు. ఇక రెండో ఇన్నింగ్స్‌లో 794పరుగుల భారీ లక్ష్యాన్ని ఉత్తరాఖండ్ ముందుంచిన ముంబై.. తమ బౌలర్లతో గడగడలాడింది. రెండో ఇన్నింగ్స్‌లో ముంబై బౌలర్లు ధావల్ కులకర్ణి (3/11), షామ్స్ ములానీ (3/15), తనుష్ కోటియన్ (3/13) దెబ్బకు ఉత్తరాఖండ్ 69పరుగులకే చాప చుట్టేసింది. ఈ మ్యాచ్‌లో డబుల్ సెంచరీ వీరుడు సువేద్ పార్కర్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications