Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Siraj RanjiTrophy: 18 ఓవర్లు, 7 మెయిడెన్లు.. సిరాజసం చూపించాడా?

18 ఓవర్లు, 7 మెయిడెన్లు.. 47 పరుగులు.. 1 వికెట్.. టీమిండియాకు దూరమైన ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ ప్రస్తుతం జరుగుతోన్న రంజీ ట్రోఫీలో తాజాగా చేసిన ప్రదర్శన ఇది. హైదరాబాద్ తరపున బరిలోకి దిగిన అతడు.. తాజాగా విదర్భతో జరుగుతోన్న మ్యాచ్ లో గొప్పగా ప్రదర్శన చేయలేకపోయినప్పటికీ.. పొదుపుగా బౌలింగ్ చేస్తూ పర్వాలేదనిపించాడు.

నాగ్‌పుర్‌ వేదికగా జరుగుతోన్న ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన విదర్భ జట్టు తొలి ఇన్నింగ్స్ లో 55.5 ఓవర్లో కేవలం 190 పరుగులకే ఆలౌటైంది. ఇందులో మహ్మద్ సిరాజ్ తీసింది ఒక్కటే వికెట్ అయినా.. ప్రత్యర్థి జట్టుపై ఒత్తిడిని తీసుకొస్తూ.. అత్యంత పొదుపుగా బౌలింగ్‌ చేశాడు. తన ఎకానమీ స్పెల్స్ తో ఇతర హైదరాబాద్ బౌలర్లు వికెట్లు తీసేలా సహకరించాడు. కెప్టెన్‌ సి.వి.మిలింద్‌ (2/46), రక్షణ్‌రెడ్డి (3/29), అనికేత్‌రెడ్డి (3/54) వికెట్లు తీశారు. దీంతో విదర్భ ఎక్కువ పరుగులు చేయలేకపోయింది.

Ranji trophy Mohammed Siraj performance 1 47 from 18 overs for Hyderabad against Vidarbha After Champions Trophy Exclusion

వాస్తవానికి ఆస్ట్రేలియా టూర్ నుంచి వచ్చిన మహ్మద్ సిరాజ్ కు ఇంగ్లండ్‌తో టీ20, వన్డే సిరీస్‌, ఛాంపియన్స్ ట్రోఫీ కోసం భారత జట్టులో చోటు దక్కలేదు. సిరాజ్ పాత బంతితో ప్రభావం చూపలేకపోతున్నడాని అన్నాడు. ఈ నేపథ్యంలో పాత బంతితో ప్రాక్టీస్ చేసిన సిరాజ్.. ఇప్పుడు తాజాగా రంజీ ట్రోఫీలో తనవంతుగా చెప్పుకోదగ్గ ప్రదర్శనే చేశాడని క్రికెట్ అభిమానులు అంటున్నారు.

మొత్తంగా తొలి రోజు ఆటలో విదర్భపై 18 ఓవర్లు వేసిన సిరాజ్.. అందులో 7 మెయిడిన్ ఓవర్లు వేశాడు. 2.60 ఎకానమీ రేటుతో బౌలింగ్ చేశాడు. తన తొలి 15 ఓవరల్లో ఒక్క వికెట్‌ కూడా తీయలేకపోయినా.. చివరి స్పెల్‌లో వికెట్ దక్కించుకన్నాడు. లోయర్ మిడిలార్డర్ లో 46 బంతుల్లో 65 పరుగులు చేసి క్రీజులో కొనసాగుతోన్న హర్ష్ దుబెను ఔట్ చేశాడు.

ఇక ఈ మ్యాచ్ లో విదర్భ తొలి ఇన్నింగ్స్ లో హర్ష్‌ దూబే (65) హాఫ్ సెంచరీతో జట్టును ఆదుకున్నాడు. తొలిరోజు ఆట ముగిసే సరికి హైదరాబాద్‌ తొలి ఇన్నింగ్స్‌లో 2 వికెట్ల నష్టానికి 90 పరుగులు సాధించింది. తన్మయ్‌ అగర్వాల్‌ (53 బ్యాటింగ్‌; 86 బంతుల్లో 7×4) అజేయ హాఫ్ సెంచరీతో మెరిశాడు.

Story first published: Friday, January 31, 2025, 11:29 [IST]
Other articles published on Jan 31, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+