అసోం, త్రిపురలో మ్యాచ్‌లు సస్పెన్షన్: రంజీ క్రికెట్‌ను తాకిన పౌరసత్వ సవరణ బిల్లు నిరసన సెగ

హైదరాబాద్: పౌరసత్వ సవరణ బిల్లు సెగ రంజీ మ్యాచ్‌లకు కూడా తాకింది. పార్లమెంట్‌లో పౌరసత్వ సవరణ బిల్లు ఆమోదం పొందడంతో ఈశాన్య రాష్ట్రాలపై అసోం, త్రిపురలో ఆందోళనలు చెలరేగాయి. ఇందులో భాగంగా ఆందోళనకారుల నిరసనల నేపథ్యంలో ఈ ప్రాంతంలో కర్ఫ్యూ విధించారు.
దీని కారణంగా గౌహతి, త్రిపుర రాజధాని అగర్తాలాలో రంజీ ట్రోఫీ ఆట నాలుగవ రోజు గురువారం నిలిపి వేయబడింది. ఈ విషయాన్ని బీసీసీఐ జీఎమ్ క్రికెట్ ఆపరేషన్స్ సాబా కరీమ్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ "రాష్ట్ర అసోసియేషన్లకు మ్యాచ్ నిర్వహించొద్దని సలహా ఇచ్చాం" అని అన్నారు.

ఆటగాళ్లను హోటల్‌లోనే
"ఆటగాళ్లను హోటల్‌లోనే ఉండమని కోరాం. క్రీడాకారుల భద్రతే మాకు చాలా ముఖ్యం. గేమ్ తిరిగి ఆడతారా లేదా పాయింట్లు ఇరు జట్లకు సమానంగా ఇవ్వాలా అనేది తర్వాత ఆలోచిస్తాం" అని సాబా కరీమ్ చెప్పుకొచ్చారు. రంజీ సీజన్ 2019-20లో భాగంగా అసోం జట్టు సర్వీసెస్ స్పోర్ట్స్ కంట్రోల్ బోర్డ్ జట్టుతో తలపడుతుండగా... అగర్తలాలో త్రిపుర-జార్ఖండ్ జట్లు తలపడుతున్నాయి.

పొరుగు దేశాల్లో
పొరుగు దేశాల్లోని శరణార్థులకు పౌరసత్వం కల్పించే దిశగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ పౌరసత్వ సవరణ బిల్లుకు బుధవారం పార్లమెంట్ ఉభయ సభల్లోనూ ఆమోదం లభించిన సంగతి తెలిసిందే. అయితే, ఈ బిల్లును వ్యతిరేకిస్తూ అసోంలో ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. అసోం రాష్ట్రం యుద్ధభూమిలా మారింది. ఈ బిల్లుకు నిరసనగా బుధవారం వేలాది మంది ప్రజలు స్వచ్ఛందంగా రోడ్లపైకి వచ్చి ప్లకార్డులతో ప్రదర్శనలు నిర్వహించారు.

అసోం, త్రిపురల్లో నిరసన జ్వాలలు
ముఖ్యంగా అసోం, త్రిపురల్లో నిరసన జ్వాలలు తారాస్థాయికి చేరాయి. రోడ్లు, రైల్వే ట్రాకులపై టైర్లను వేసి నిప్పంటించారు. ఈ నేపథ్యంలో ఆందోళనలను అడ్డుకునేందుకు అసోంలో నిన్న రాత్రి నుంచి నిరవధిక కర్ఫ్యూ విధించారు. అయితే కర్ఫ్యూ నిబంధనలను ఉల్లంఘించి గురువారం ఉదయం ప్రజలు రోడ్లపైకి చేరి నిరసనలు చేపట్టారు. దీంతో ఆర్మీ ఫ్లాగ్ మార్చ్ నిర్వహించింది.
ప్రధాని మోడీ ట్విట్టర్‌లో ఇలా
ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ తన ట్విట్టర్‌లో "అసోం సోదర, సోదరీమణులకు హామీ ఇస్తున్నానని, క్యాబ్‌తో ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీ హక్కులను, విశిష్ట గుర్తింపును, మీ అద్భుత సంస్కృతిని ఎవరూ ఏమీ చేయలేరు. అసోం సంస్కృతీ, సాంప్రదాయాలు కలకాలం వర్థిల్లుతాయి. రాజ్యాంగంలోని క్లాజ్ 6 ప్రకారం అసోం ప్రజల రాజకీయ, భాష, సాంస్కృతిక, భూమి హక్కులను సంరక్షించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉంది" అంటూ ట్వీట్లు చేశారు.

గువహటి ఎయిర్ పోర్టులో చిక్కుకున్న సీఎం
పౌరసత్వ సవరణ బిల్లుపై నిరసనల నేపథ్యంలో అసోం సీఎం సోనోవాల్ గువాహటి ఎయిర్‌పోర్ట్‌లోనే చిక్కుకున్నారు. భారీ ఆందోళనల నేపథ్యంలో బయటకు వెళ్లడం మంచిది కాదని పోలీసులు చెప్పడంతో ఆయన విమానాశ్రయంలోనే ఉండిపోవాల్సి వచ్చింది. అటు దిబ్రుగఢ్ జిల్లాలోనూ కర్ఫ్యూ విధించారు. అయినప్పటికీ ఆందోళనకారులు బయటకు వచ్చి నిరసనలకు పాల్పడ్డారు. అసోం ముఖ్యమంత్రి శర్వానంద సోనోవాల్ ఇంటిపై ఆందోళనకారులు రాళ్లు రువ్వారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications