Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Ranji Trophy: భారీ సెంచ‌రీతో మ‌నీష్ పాండే విధ్వంసం! 10 సిక్సుల‌తో వీర విహారం.. ఫుల్ హ్యాపీగా ల‌క్నో

Ranji Trophy: Manish Pandey scored a huge century. 156 runs: 12 hours, 10 sixes. First day Karnataka score: 392-5

రంజీ ట్రోఫీలో క‌ర్ణాట‌క కెప్టెన్ మ‌నీష్ పాండే విశ్వరూపం చూపించాడు. టెస్టు మ్యాచ్‌లోనూ టీ20 ఫార్మాట్ త‌ర‌హా బ్యాటింగ్‌తో వీర విహారం చేశాడు. బౌండ‌రీల‌తో ధనా ధన్ ఇన్నింగ్స్‌తో విధ్వంసం సృష్టించాడు. ఏకంగా భారీ సెంచ‌రీతో విధ్వంసం సృష్టించాడు. అత‌ని ఇన్నింగ్స్‌లో 12 ఫోర్లు, 10 సిక్సులు ఉన్నాయంటేనే అత‌ని విధ్వంసం ఏ స్థాయిలో కొన‌సాగిందో అర్థం చేసుకోవ‌చ్చు. టెస్టు మ్యాచ్‌లోనూ టీ20 త‌ర‌హాలో ఏకంగా 128 స్ట్రైక్‌రేట్‌తో బ్యాటింగ్ చేయ‌డం గ‌మ‌నార్హం. మ‌నీష్ పాండే సృష్టించిన ఈ విధ్వంసంతో క‌ర్ణాట‌క జ‌ట్టు క‌న్న ఐపీఎల్‌లో అత‌న్ని కొనుగోలు చేసిన ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ ఎక్కువ ఆనందంగా ఉంది.

బౌండ‌రీల వ‌ర‌ద‌

బౌండ‌రీల వ‌ర‌ద‌

ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు వ‌చ్చిన మ‌నీష్ పాండే ఆరంభం నుంచే ధాటిగా ఆడాడు. వ‌రుస‌గా ఫోర్లు, సిక్సుల‌తో స్కోర్ బోర్డును ప‌రుగులు పెట్టించాడు. ఈ క్ర‌మంలో 9 ఫోర్లు, 6 సిక్సుల‌తో 83 బంతుల్లోనే సెంచ‌రీ పూర్తి చేశాడు. అనంత‌రం కూడా త‌న దూకుడును ఏ మాత్రం ఆప‌ని మ‌నీష్ పాండే 10 ఫోర్లు, 11 సిక్సుల‌తో 115 బంతుల్లోనే 150 ప‌రుగులు పూర్తి చేశాడు. మొత్తంగా 12 ఫోర్లు, 10 సిక్సుల‌తో 121 బంతుల్లోనే 156 ప‌రుగులు చేశాడు. త‌న ఇన్నింగ్స్‌లో మ‌నీష్ పాండే బౌండ‌రీల వ‌ర‌ద పారించాడ‌ని చెప్పుకోవాలి. ఈ క్ర‌మంలో కేవీ సిద్ధార్థ్‌తో క‌లిసి నాలుగో వికెట్‌కు పాండే ఏకంగా 267 పరుగుల భారీ భాగ‌స్వామ్యాన్ని నెలకొల్పాడు.

సిద్ధార్థ్ సెంచ‌రీ

సిద్ధార్థ్ సెంచ‌రీ

మ‌నీష్ పాండేకు తోడుగా కేవీ సిద్ధార్థ్ కూడా సెంచ‌రీతో రాణించాడు. తొలి రోజు ఆట ముగిసే స‌మ‌యానికి మొత్తంగా 221 బంతులు ఎదుర్కొని 140 ప‌రుగుల‌తో అజేయంగా నిలిచాడు. సిద్ధార్థ్ ఇన్నింగ్స్‌లో 17 ఫోర్లు, 2 సిక్సులు ఉన్నాయి. మ‌నీష్ పాండే, కేవీ సిద్ధార్థ్ సెంచ‌రీల‌తో చెల‌రేగ‌డంతో తొలి రోజు ఆట ముగిసే స‌మయానికి క‌ర్ణాట‌క 5 వికెట్ల న‌ష్టానికి 392 ప‌రుగుల భారీ స్కోర్ సాధించింది. క్రీజులో కేవీ సిద్ధార్థ్‌, ఎస్ గోపాల్ ఉన్నారు.

ఫుల్ హ్యాపీగా ల‌క్నో

ఫుల్ హ్యాపీగా ల‌క్నో

మ‌నీష్ పాండే సృష్టించిన ఈ విధ్వంసంతో ఐపీఎల్ ఫ్రాంచైజీ ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ ఫుల్ హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఈ సారి మెగా వేలంలో మ‌నీష్ పాండేను ల‌క్నో 4 కోట్ల 60 ల‌క్ష‌ల రూపాయ‌ల‌కు కొనుగోలు చేసింది. తాజాగా రంజీ ట్రోఫీలోనే మ‌నీష్ పాండే టీ20 త‌ర‌హాలో చెల‌రేగ‌డంతో, ఇక ఐపీఎల్‌లోనూ స‌త్తా చాటుతాడ‌ని ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ పాండేపై భారీ అంచ‌నాలు పెట్టుకుంది.

తొలి రోజు సెంచ‌రీల మోత‌

తొలి రోజు సెంచ‌రీల మోత‌

నేటి నుంచి మొద‌లైన రంజీ ట్రోఫీ 2022లో తొలి రోజు సెంచ‌రీల మోత మోగింద‌ని చెప్పుకోవాలి. నేడు చాలా మంది బ్యాట‌ర్లు సెంచ‌రీలు సాధించారు. సెంచ‌రీలు చేసిన వారిలో మ‌నీష్ పాండే, కేవీ సిద్ధార్థ్‌, అజింక్య ర‌హానే, సర్ఫ‌రాజ్‌ఖాన్, య‌ష్ ధూల్‌ ఉన్నారు.

Story first published: Thursday, February 17, 2022, 18:06 [IST]
Other articles published on Feb 17, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+