Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఢిల్లీకి డేంజర్ లేదంటున్న గంభీర్, కర్ణాటకను నిలబెట్టిన కరుణ్ నాయర్

Ranji Trophy: Karnataka On Top After Karun Nair Hits Ton Against Vidarbha

హైదరాబాద్ : సెంచరీల మోత టెస్ట్ మ్యాచ్ ల్లోనే కాదు. వన్డేలకు పాకింది. ఇక అక్కడ నుంచి రంజీ ట్రోఫీలకు చేరింది. ఢిల్లీ జట్టులో ఉన్న గౌతమ్ గంభీర్, కునాల్ చండేలా, కర్ణాటక వైస్ కెప్టెన్ కరుణ్ నాయర్ శతకాలతో మెరిపించి అజేయంగా దూసుకుపోతున్నారు.

గంభీర్‌, చండేలా సెంచరీల మోత
రంజీ ట్రోఫీల్లో భాగంగా ఢిల్లీ జట్టుకు బెంగాల్ జట్టుకు సోమవారం మ్యాచ్ జరిగింది. మ్యాచ్ ముగిసే సమయానికి గౌతమ్‌ గంభీర్‌ (127), కునాల్‌ చండేలా (113) సెంచరీలతో అదరగొట్టారు. బెంగాల్‌తో రంజీ సెమీస్‌ మ్యాచ్‌లో ఢిల్లీ భారీస్కోరు దిశగా సాగు తోంది.
బెంగాల్‌ బౌలింగ్‌ను ఢిల్లీ సమర్థంగా ఎదుర్కొంటుంది. రెండోరోజు ఆటముగిసేరికి తొలి ఇన్నింగ్స్‌లో 3 వికెట్ల నష్టానికి 271 పరుగులు చేసింది. ఫస్ట్‌ ఇన్నింగ్స్‌లో ఢిల్లీ బ్యాటింగ్‌కు దిగింది. ఓపెనర్లు చండేలా, గంభీర్‌ శుభారంభాన్ని అందించారు. ఎంతో అలవోకగా బ్యాటింగ్‌ చేసిన గంభీర్‌ 42వ సెంచరీని సాధించాడు.

బెంగాల్ అంతకుముందు ఓవర్‌ నైట్‌ స్కోరు 269/7తో తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగించింది. తర్వాత మరో 17 పరుగులు మాత్రమే జత చేసి మిగతా మూడు వికెట్లు చేజార్చుకుంది. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో బెంగాల్‌ 286 పరుగులకే పరిమితమైంది.

అజేయంగా దూసుకుపోతున్న కరుణ్ నాయర్:
కరుణ్‌ నాయర్‌ (148 ) అజేయ శతకంతో రాణించాడు. సోమవారం జరిగిన రంజీ ట్రోఫీ మ్యాచ్‌లో విదర్భతో కర్ణాటక జట్టు తలపడింది. ఓవర్‌ నైట్‌ స్కోరు 36/3తో రెండో రోజైన సోమవారం ఆటను కర్ణాటక కొనసాగించింది. చీకటి పడుతుండటంతో ఆట నిలిచిపోయే సమయానికి 294/8 స్కోరును కల్గి ఉంది. నాయర్‌తోపాటు కెప్టెన్‌ వినయ్‌ కుమార్‌ (20) క్రీజులో ఉన్నారు. విదర్భ తొలి ఇన్నింగ్స్‌ స్కోరు 185కు కర్ణాటక 109 పరుగుల ఆధిక్యం సాధించింది.

ముందు రోజు ఆటలో తడబడిన కర్ణాటక.. రెండోరోజు నింపాదిగా ఆడింది. ఓవర్‌నైట్‌ బ్యాట్స్‌మెన్‌ నాయర్‌, చిదంబరం గౌతమ్‌ (73) విదర్భ బౌలింగ్‌ను అలవోకగా ఎదుర్కొంటూ స్కోరు బోర్డును నడిపించారు. వీరిద్దరూ నాలుగో వికెట్‌కు 139 పరుగులు జోడించారు. అయితే అర్ధ శతకం సాధించిన గౌతమ్‌ను ఉమేష్‌ యాదవ్‌ (2/71) అవుట్‌ చేసి బ్రేక్‌ ఇచ్చాడు. ఇక గుర్బానీ లోయర్‌ ఆర్డర్‌ పనిబట్టాడు. బిన్నీ (4), గోపాల్‌ (7), కృష్ణప్ప గౌతమ్‌ (1)ను అవుట్‌ చేసిన గుర్బానీ (5/90) సీజన్‌లో మరోసారి ఐదు వికెట్లు సాధించాడు. వైస్ కెప్టెన్ మాత్రం అజేయమైన బ్యాటింగ్‌తో దూసుకుపోతున్నాడు.

బెంగాల్‌తో రంజీ ట్రోఫీ సెమీఫైనల్లో గౌతమ్‌ గంభీర్‌ (127; 216 బంతుల్లో 21×4) సెంచరీతో మెరిశాడు. అతనితో పాటు మరో ఓపెనర్‌ కునాల్‌ చందేలా (113; 192 బంతుల్లో 18×4, 1×6) శతకం సాధించడంతో సోమవారం రెండోరోజు ఆట చివరికి దిల్లీ తొలి ఇన్నింగ్స్‌లో 3 వికెట్లకు 271 పరుగులు చేసింది. సెంచరీ చేసిన తర్వాత కూడా జోరుగానే ఆడిన గౌతి.. ఆట చివర్లో ఔటయ్యాడు. అంతకుముందు ఓవర్‌నైట్‌ స్కోరు 269/7తో తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించిన బెంగాల్‌.. మరో 17 పరుగులు జోడించి 286 పరుగులకు ఆలౌటైంది.

ఈడెన్‌గార్డెన్స్‌లో విదర్భతో జరుగుతున్న సెమీస్‌లో కర్ణాటక స్టార్‌ కరుణ్‌ నాయర్‌ (148 బ్యాటింగ్‌; 261 బంతుల్లో 20×4, 1×6) అజేయ శతకంతో సత్తా చాటాడు. ఓవర్‌నైట్‌ స్కోరు 36/3తో తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగించిన కర్ణాటకను నాయర్‌ ఆదుకున్నాడు. గౌతమ్‌ (73) అండతో అతను జట్టును మెరుగైన స్థితికి చేర్చాడు. ఆట ఆఖరికి ఆ జట్టు 8 వికెట్లకు 294 పరుగులు చేసింది. నాయర్‌, కెప్టెన్‌ వినయ్‌ కుమార్‌ (20) తోడుగా క్రీజులో ఉన్నాడు. విదర్భ తొలి ఇన్నింగ్స్‌లో 185 పరుగులకే ఆలౌటైన సంగతి తెలిసిందే.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Tuesday, December 19, 2017, 10:28 [IST]
Other articles published on Dec 19, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+