
ముంబై యువ ప్లేయర్ యశస్వి జైశ్వాల్ రంజీ ట్రోఫీ - 2022లో సత్తా చాటుతున్నాడు. ఇక ఉత్తర ప్రదేశ్‌తో జరుగుతున్న రంజీ ట్రోఫీ సెమీఫైనల్లో తొలి, రెండో ఇన్నింగ్స్‌ల్లో జైశ్వాల్ సెంచరీలతో మెరిసాడు. తొలి ఇన్నింగ్స్‌లో కరెక్ట్‌గా 100పరుగులు చేసిన జైశ్వాల్.. రెండో ఇన్నింగ్స్‌లో (181పరుగులు, 372బంతుల్లో 23ఫోర్లు, 1సిక్సర్) అద్భుతంగా ఆడాడు. ఇక ఉత్తరాఖండ్‌తో జరిగిన క్వార్టర్ ఫైనల్ రెండో ఇన్నింగ్స్‌లో కూడా జైశ్వాల్ సెంచరీ చేయడంతో వరుసగా మూడు సెంచరీలు చేసిన ప్లేయర్‌గా నిలిచాడు. ఇకపోతే ఈ మ్యాచ్‌లో ముంబై గెలుపు దాదాపు ఖాయమైంది. ముంబై తొలి ఇన్నింగ్స్‌లో 393పరుగులకు ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్‌లో జైశ్వాల్ సెంచరీతో పాటు హర్దిక్ తమోర్ (115) సెంచరీ, సామ్స్ ములానీ (50) హాఫ్ సెంచరీలతో మెరిశారు. ఇక ఫస్ట్ ఇన్నింగ్స్‌లో ఉత్తరప్రదేశ్ కేవలం 180పరుగులకే కుప్పకూలింది.
ముంబై బౌలర్లలో తుషార్ దేశ్‌పాడే, మోహిత్ అవస్తీ, తనుష్ కోటియన్ చెరో మూడు వికెట్లు తీసి ఉత్తరప్రదేశ్ పతనాన్ని శాసించారు. ఇక 213పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ మొదలెట్టిన ముంబై నాలుగో రోజు ఆట ముగిసేసమయానికి 140ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 449 పరుగులు చేసింది. ముంబై ఇన్నింగ్స్‌లో జైశ్వాల్(181), ఆర్మన్ జాఫర్(127) సెంచరీలతో ఆకట్టుకున్నారు. ప్రస్తుతం 662 పరుగుల ఆధిక్యాన్ని సాధించింది.
స్కోరు సమ్మరీ
ముంబై తొలి ఇన్నింగ్స్ - 393,
ఉత్తరప్రదేశ్ తొలి ఇన్నింగ్స్ - 180
ముంబై రెండో ఇన్నింగ్స్ - (449- 4 నాలుగో రోజు ఆట ముగిసే టైంకు)