Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Ranji ShardulThakur: శార్దూల్ ఠాకూర్ సక్సెస్ వెనుక బేకరీ గర్ల్.. ఆమె ఎవరంటే?

ప్రతి మగాడి విజయం వెనక ఓ మహిళ ఉంటుంది అంటారు. అతడికి కష్టసుఖాల్లో తోడుంటూ, ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ ముందుకు నడిపిస్తుంటారు. ఇప్పటికే ఆయా రంగాల్లో ఉన్నతస్థానాలకు ఎదిగిన పలువురు ప్రముఖుల జీవితాల్లో అలాంటి స్ఫూర్తిదాయక మహిళల గురించి మనం వినే ఉంటాం. అలా తన జీవితంలోనూ అన్నివేళలా అండగా నిలిచిన మహిళ తన ఓ బేకరీ గర్ల్ అని అంటున్నాడు శార్దూల్ ఠాకూర్.

ప్రస్తుతం రంజీ ట్రోఫీ ఆడుతోన్న శార్దూల్ ఠాకూర్ క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాడు. ముఖ్యంగా ఐపీఎల్ 2025 మెగా వేలంలో అన్ సోల్డ్ గా మిగిలిన అతడు ప్రస్తుతం సూపర్ ఫామ్ కనబరుస్తూ దూసుకెళ్తున్నాడు. తనపై వచ్చిన విమర్శలను అటు బ్యాట్ తో, ఇటు బాల్ తో సమాధానమిస్తున్నాడు. మొత్తంగా తన ఆల్ రౌండ్ ప్రదర్శనతో ప్రస్తుతం రంజీలో అదరగొడుతున్నాడు.

Ranji trophy hattrick sensation Shardul Thakur s success secret is his wife Mithali earns crores by selling cakes

ప్రస్తుతం మేఘాలయతో జరుగుతోన్నమ్యాచ్ లో ముందుగా అందరి దృష్టంతా రోహిత్ శర్మ, యశస్వి జైశ్వాల్, శ్రేయస్ అయ్యర్ పైనే ఉంది. కానీ మ్యాచ్ కొనసాగేకొద్దీ తన ప్రదర్శనతో అందరీ దృష్టిని తనవైపు తిప్పేసుకున్నాడు శార్దూల్ ఠాకూర్. ముందు రౌండ్ సిక్స్ లో జమ్ముతో జరిగిన మ్యాచ్ లో హాఫ్ సెంచరీ, సెంచరీతో చెలరేగిన అతడు.. ఇప్పుడు మేఘాలయతో జరుగుతోన్న మ్యాచ్ లో హ్యాట్రిక్ వికెట్లు సెన్సేషన్ క్రియేట్ చేశాడు.

ఆమెనే బలం..
మరి ఇంతటి గొప్ప ప్రదర్శన చేస్తోన్న శార్దూల్ ఠాకూర్ బలం, బ్యాక్ బోన్ ఎవరో తెలుసా? అతడి భార్య మిథాలీనే. శార్దూల్ కష్టసమయాల్లో ఉన్న ప్రతీసారి అతడికి అండగా నిలుస్తుంది. అతడిలో ఆత్మవిశ్వాసం పెంచుతుంటుంది. మిథాలీ అతడికి ఓ మంచి స్నేహితురాలు మాత్రమే కాదు అతడికి అతిపెద్ద బలం కూడా. వీరిద్దరు చిన్నప్పటి నుంచి స్కూల్ ఫ్రెండ్స్. 2021లో ఎంగేజ్ మెంట్ చేసుకున్న ఈ జంట 2023లో పెళ్లి చేసుకున్నారు.

అప్పుడు కార్పపేట్ కంపెనీలో.. ఇప్పుడు బేకరీలో
మిథాలీ 1992లో ఓ హై క్లాస్ ఫ్యామిలీలో జన్మించింది. మిథాలీ తండ్రి ఓ పెద్ బిజినెస్ మెన్. ఈమె ముంబయిలోని టాప్ స్కూల్స్, కాలేజెస్ లో చదివింది. సోషల్ మీడియాలో ఈమెకు క్రేజ్ ఎక్కువ. వేల సంఖ్యలో ఫాలోవర్స్ ఉన్నారు. ఈమె ప్రస్తుతం ఓ బేకరీని నడుపుతోంది. ఇది థానేలో చాలా ఫేమస్ బేకరి. 2020లో దీన్ని ప్రారంభించింది. తన బ్యాకరీలో రకరకాల కేక్స్, కుకీస్, బ్రెడ్, బన్స్ వంటివి సేల్ చేస్తుంటుంది. ఆమె నెట్ వర్త్ 2-3 కోట్లు ఉంటుందని అంచనా. అంతకుముందు ఓ కార్పరేట్ కంపెనీలో సెక్రటరీగా పని చేసింది.

Story first published: Friday, January 31, 2025, 16:45 [IST]
Other articles published on Jan 31, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+