చివరి మ్యాచ్‌లో సెంచరీతో ముగించిన గంభీర్

న్యూఢిల్లీ: ఏ క్రికెటర్‌కైనా ఇంతకంటే గొప్ప ముగింపు ఏముంటుంది. భారత వెటరన్ ఓపెనర్ గౌతం గంభీర్ తన వీడ్కోలు మ్యాచ్‌లో చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడాడు. కెరీర్ ఆఖరి మ్యాచ్‌లో టీమిండియా మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ సెంచరీ కొట్టాడు. ఆంధ్రతో గ్రూప్-బి రంజీ మ్యాచ్‌లో (185 బంతుల్లో 10 ఫోర్లతో 112) సెంచరీతో చెలరేగి రాణించడంతో.. ఓవర్‌నైట్ స్కోరు 190/1తో మూడో రోజైన శనివారం తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఢిల్లీ ఆట చివరకు 7 వికెట్ల నష్టానికి 409 పరుగులు చేసింది.

మరో 8 పరుగులు జోడించి సెంచరీ పూర్తి
ఓవర్‌నైట్ బ్యాట్స్‌మన్ గంభీర్ మరో 8 పరుగులు జోడించి సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కెప్టెన్ ధ్రువ్ షోరె (98) రెండు పరుగులతో సెంచరీ మిస్ చేసుకున్నాడు. వైభవ్ 33, జాంటీ సిద్దూ 30, లలిత్ యాదవ్ 29 రన్స్ చేశారు. ప్రస్తుతం ఢిల్లీ 19 పరుగుల ఆధిక్యంలో ఉంది. అంతకుముందు తొలి ఇన్నింగ్స్‌లో ఆంధ్ర 390 పరుగులు చేసింది. ఆటకు ఆదివారమే చివరి రోజు కావడంతో మ్యాచ్ డ్రా అయ్యే అవకాశం ఉంది.

37 ఏళ్ల గంభీర్ చాలా ప్రశాంతంగా
మ్యాచ్‌లో ఇంకో రోజు ఆట మాత్రమే ఉన్నందున.. గంభీర్.. మళ్లీ బ్యాటింగ్‌కు వచ్చే అవకాశం తక్కువే. శనివారం ఆటను కొనసాగించిన ఢిల్లీ బ్యాటింగ్‌లో పెద్దగా ఇబ్బందిపడలేదు. మైదానంలో అభిమానుల హర్షధ్వానాల మధ్య అడుగుపెట్టిన 37 ఏళ్ల గంభీర్ చాలా ప్రశాంతంగా కనిపించాడు. మంచి ఫుట్‌వర్క్‌తో బ్యాటింగ్ చేశాడు. ఓవర్‌నైట్ స్కోరు 92తో ఇన్నింగ్స్ కొనసాగించిన అతడు సింగిల్‌తో రోజును ఆరంభించాడు. ఆ తర్వాత 94 వద్ద ఓ బౌండరీ బాదాడు.

105 వద్ద ఔటయ్యే ప్రమాదాన్ని తప్పించుకుని
అయ్యప్ప బౌలింగ్‌లో డబుల్‌తో కెరీర్లో 43వ ఫస్ట్‌క్లాస్ సెంచరీ అందుకున్నాడు. మైదానంలో ఆటగాళ్ల అభినందనలు అందుకున్నాక తిరిగి పరుగుల సాధనపై దృష్టిసారించాడు. భారీ ఇన్నింగ్స్ ఆడతాడేమో అనిపించింది. ఐతే.. అప్పటివరకు నియంత్రణలో కనిపించిన అతడిని ఆంధ్ర లెఫ్టార్మ్ బౌలర్ మనీష్ తన స్పిన్‌తో ఇబ్బందిపెట్టాడు. అతడి బౌలింగ్‌లో 105 వద్ద ఔటయ్యే ప్రమాదాన్ని గంభీర్ తప్పించుకున్నాడు.

112 పరుగుల వద్ద వికెట్ కీపర్‌కు క్యాచ్ ఇచ్చి
ఐతే.. 112 పరుగుల వద్ద మరో స్పిన్నర్ షోయబ్ బౌలింగ్‌లో వికెట్ కీపర్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. వశిష్ఠ్ (12), భాటి (1) క్రీజులో ఉన్నారు. తొలి ఇన్నింగ్స్‌లో ఆంధ్ర 390 పరుగులు చేసింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications