Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Ranji Trophy Final Day 3: మరో 6పరుగులు చేసి క్రీజులో నిలబడితే చాలు.. మధ్యప్రదేశ్‌దే రంజీ ట్రోఫీ

Ranji Trophy Final: With Yash and Shubham scoring centuries, Madhya Pradesh is on the verge of victory

బెంగళూరులోని ఎం.చిన్నస్వామి స్టేడియం వేదికగా ముంబై వర్సెస్ మధ్య ప్రదేశ్ మధ్య జరుగుతున్న రంజీ ఫైనల్ మ్యాచ్ మధ్యప్రదేశ్ వైపు సాగుతోంది. ముంబైకి దీటుగా సత్తా చాటిన మధ్యప్రదేశ్.. గెలుపునకు మరో మెట్టుదూరంలో ఉంది. పట్టుదలగా పోరాడుతున్న మధ్యప్రదేశ్ బ్యాటర్లు.. ఇన్నింగ్స్‌ను భారీ స్కోర్ దిశగా తీసుకెళ్తున్నారు. శుక్రవారం ఆట ముగిసే టైంకు 3వికెట్లు కోల్పోయి 368పరుగులకు మధ్యప్రదేశ్ టీం చేరుకుంది. ఇక ముంబై తొలి ఇన్నింగ్స్‌లో 374పరుగులు చేయగా.. ముంబైని అధిగమించడానికి 6పరుగుల దూరంలో మధ్యప్రదేశ్ ఉంది.

 సెంచరీలతో కదం తొక్కిన యశ్ దుబే, శుభమ్ శర్మ

సెంచరీలతో కదం తొక్కిన యశ్ దుబే, శుభమ్ శర్మ

మధ్య ప్రదేశ్ ఇన్నింగ్స్‌లో ఓపెనర్ యశ్ దుబే (133పరుగులు 336బంతుల్లో 14ఫోర్లు), శుభమ్ శర్మ (116పరుగులు 215బంతుల్లో 15ఫోర్లు, 1సిక్సర్) సెంచరీలతో రాణించారు. ఇక క్రీజులో రజత్ పాటిదర్ (67పరుగులు 106బంతుల్లో 13ఫోర్లు), కెప్టెన్ ఆదిత్య శ్రీవత్సవ (11పరుగులు 33బంతుల్లో) కొనసాగుతున్నారు. ముంబై బౌలర్లలో తుషార్ దేశ్‌పాండే, మోహిత్ అవస్తి, సామ్స్ ముల్తానీ తలా ఒక వికెట్ తీశారు.

తొలి ఇన్నింగ్స్‌లో లీడ్ సాధిస్తే..

తొలి ఇన్నింగ్స్‌లో లీడ్ సాధిస్తే..

రంజీ ట్రోఫీ నిబంధనల ప్రకారం తొలి ఇన్నింగ్స్‌లో లీడ్ సాధించిన జట్టుకు మ్యాచ్ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. రెండో ఇన్నింగ్స్ పూర్తికాక మ్యాచ్ డ్రాగా ముగిస్తే.. తొలి ఇన్నింగ్స్‌లో లీడ్ సాధించిన జట్టు విజేతగా నిలుస్తుంది. ఈ క్రమంలో కేవలం 3వికెట్లు మాత్రమే కోల్పోయి 368పరుగులు చేసిన మధ్యప్రదేశ్ లీడ్ సాధించడానికి మరో 6పరుగుల దూరంలో ఉంది. ఇక లీడ్ సాధించిన తర్వాత మధ్యప్రదేశ్ బ్యాటర్లు పరుగులు ఎక్కువ చేయకున్నా ఎంత ఎక్కువ సేపు క్రీజులో నిలబడి ఓవర్లు ఆడితే అంతా గెలుపు అవకాశాలుంటాయి. ఇక మరో రెండు రోజులు మాత్రమే ఆట మిగిలి ఉండడంతో ఒక్కరోజు పూర్తిగా నిలబడ్డా మధ్యప్రదేశ్ దాదాపు 90శాతం గెలిచే అవకాశాలుంటాయి.

 తుది జట్లు

తుది జట్లు

మధ్యప్రదేశ్ : యష్ దూబే , హిమాన్షు మంత్రి (వికెట్ కీపర్), శుభమ్ S శర్మ, రజత్ పాటిదార్, ఆదిత్య శ్రీవాస్తవ (కెప్టెన్), అక్షత్ రఘువంశీ, పార్థ్ సహాని, సరాంశ్ జైన్, కుమార్ కార్తికేయ, అనుభవ్ అగర్వాల్, గౌరవ్ యాదవ్

ముంబై : పృథ్వీ షా (కెప్టెన్), యశస్వి జైస్వాల్, అర్మాన్ జాఫర్, సువేద్ పర్కర్, సర్ఫరాజ్ ఖాన్, హార్దిక్ తమోర్ (వికెట్ కీపర్), షామ్స్ ములానీ, తనుష్ కోటియన్, ధవల్ కులకర్ణి, తుషార్ దేశ్‌పాండే, మోహిత్ అవస్తీ

Story first published: Friday, June 24, 2022, 18:16 [IST]
Other articles published on Jun 24, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+