Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Ranji Trophy Final: రంజీ ట్రోఫీ ఫైనల్.. అమీతుమీ తేల్చుకోనున్న విదర్భ, కేరళ

Ranji Trophy Final: రంజీ ట్రోఫీ సమరం తుది అంకానికి చేరుకుంది. నాగ్‌పూర్‌లోని విదర్భ క్రికెట్ స్టేడియంలో జరగనున్న రంజీ ట్రోఫీ ఫైనల్ లో తొలిసారి ఫైనల్ కు చేరిన కేరళ, రెండు సార్లు ఛాంపియన్ అయిన విదర్భ జట్లు తలపడుతున్నాయి. కేరళ తమ తొలి టైటిల్ ను గెలుచుకోవడానికి ప్రయత్నిస్తుండగా.. విదర్భ జట్టు ఈ సారీ ట్రోఫీని ఎలాగైనా గెలుచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. గుజరాత్ పై తొలి ఇన్నింగ్స్ లో రెండు పరుగుల ఆధిక్యంతో లక్కీగా కేరళ రంజీ ట్రోఫీ ఫైనల్ కు చేరుకుంది. ఈ క్రమంలో టైటిల్ పోరుకు చేరుకునేందుకు కేరళ జట్టు 68 ఏళ్ల నిరీక్షణకు ముగింపు పలికింది.

2017-18, 2018-19లో రెండు సార్లు టైటిలి గెలిచిన విదర్భ జట్టు ఫైనల్ చేరుకోవడం ఇది నాలుగో సారి. డిఫెండింగ్ ఛాంపియన్ ముంబైపై 80 పరుగుల తేడాతో సెమీస్ లో విజయం సాధించి ఫైనల్ కు చేరుకుంది. ముంబైని ఓడించిన ఉత్సాహంతో విదర్భ జట్టు పూర్తి ఆత్మ విశ్వాసంతో కనిపిస్తోంది. విదర్భ, కేరళ జట్ల మధ్య రంజీ ట్రోఫీ ఫైనల్ ఫిబ్రవరి 26 నుంచి మార్చి 2 వరకు జరగనుంది. ఐదు రోజుల్లో నాగ్‌పూర్ లో ఎంతో ప్రతిష్ఠాత్మక ట్రోఫీ కోసం రెండు జట్లు తలపడతాయి. విదర్భ తరఫున కరుణ్ నాయర్, యష్ రాథోడ్ స్టార్ పెర్ఫార్మర్లుగా ఉన్నారు. విదర్భ కెప్టెన్ అక్షయ్ వాడ్కర్ కూడా ఈ టోర్నమెంట్ లో మంచి బ్యాటింగ్ తో రాణించాడు. 60కి పైగా వికెట్లతో హర్ష్ దుబే విదర్భ తరఫున అత్యధిక వికెట్లు తీసుకున్న బౌలర్ గా నిలిచాడు.

Ranji Trophy Final Vidarbha vs Kerala A Battle for the Prestigious Title
Photo Credit: bcci

కేరళ సమిష్టి కృషితో ఫైనల్ వరకు వచ్చింది. కేరళ జట్టుకు చాలా వరకు అదృష్టం కూడా కలిసొచ్చింది. క్వార్టర్స్ మ్యాచ్ లో ఒక పరుగు ఆధిక్యంతో జమ్మూకశ్మీర్ ను, సెమీస్ రెండు పరుగుల ఆధిక్యంతో గుజరాత్ ను వెనక్కి నెట్టి ఫైనల్ కు చేరుకుంది. ఈ రెండు మ్యాచ్ లు డ్రాగానే ముగియగా.. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాలతో కేరళ ఫైనల్ కు చేరుకోవడం గమనార్హం. బ్యాటింగ్ సల్మాన్ నిజార్, మహ్మద్ అజారుద్దీన్, సచిన్, రోహన్ కున్నుమ్మల్.. బౌలింగ్ లో జలజ సక్సే, ఆదిత్య సర్వాటే లపై కేరళ ఆశలు పెట్టుకుంది.

Take a Poll

ఇరు జట్ల స్క్వాడ్ లు:

విదర్భ జట్టు: అథర్వ తైదే, ధ్రువ్ షోరే, పార్థ్ రేఖడే, డానిష్ మాలేవార్, కరుణ్ నాయర్, యశ్ రాథోడ్, అక్షయ్ వాడ్కర్(w/c), హర్ష్ దూబే, నచికేత్ భూటే, దర్శన్ నల్కండే, యశ్ ఠాకూర్, అక్షయ్ వాఖారే, అక్షయ్ థాకరే, అక్షయ్ కాత్ కర్నేవార్, అక్షయ్ కాత్ కర్నేవార్, అమన్ మొఖడే, మందార్ మహాలే, యష్ కదమ్, ప్రఫుల్ హింగే, ఉమేష్ యాదవ్

కేరళ జట్టు: అక్షయ్ చంద్రన్, రోహన్ కున్నుమ్మల్, వరుణ్ నయనార్, సచిన్ బేబీ(C), జలజ్ సక్సేనా, మహ్మద్ అజారుద్దీన్(w), సల్మాన్ నిజార్, అహ్మద్ ఇమ్రాన్, ఆదిత్య సర్వాటే, ఎండీ నిధీష్, నెడుమాన్‌కుజ్జి బాసిల్ థంపి, విష్ణు వినోద్, బాబా అపరాజిత్, ఫాజిల్ ఫనూస్, వత్సల్ గోవింద్, షౌన్ రోజర్, వైశాఖ్ చంద్రన్, కృష్ణా ప్రసాద్, ఆనంద్ కృష్ణన్, కేఎం ఆసిఫ్.

Story first published: Wednesday, February 26, 2025, 9:57 [IST]
Other articles published on Feb 26, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+