For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Ranji Trophy Final: ఆర్సీబీ హీరో రజత్ పాటిదార్ సెంచరీతో తొలిసారి రంజీ ట్రోఫీ అందుకోనున్న మధ్యప్రదేశ్..!

Ranji Trophy Final: Rajat Patidar Century Helps to Madhyapradesh almost Winning The Ranji Trophy

రంజీ ట్రోఫీ ఫైనల్లో తొలి ఇన్నింగ్స్‌లో 162పరుగుల ఆధిక్యం సాధించిన మధ్యప్రదేశ్.. విజేతగా నిలవడానికి ఒక్క మెట్టు దూరంలో ఉంది. ఐపీఎల్లో ఆర్సీబీ హీరో అయిన మధ్యప్రదేశ్ స్టార్ బ్యాటర్ రజత్ పాటిదార్ (122పరుగులు 219బంతుల్లో 20ఫోర్లు) నాలుగో రోజు అద్భుతమైన సెంచరీ సాధించడంతో మధ్యప్రదేశ్ విజయానికి బాటలు పడ్డాయి. ముంబై బౌలింగ్‌‌ను రజత్ పాటిదర్ సమర్థంగా ఎదుర్కొని తన జట్టును విజయపు గీతను సురక్షితంగా దాటించగలిగాడు. క్రీజులో కుదురుకున్న రజత్.. లీడ్ వీలయినంత ఎక్కువ పెంచాలనే ఉద్దేశంతో చాలా చక్కగా ఆడాడు. ఈ క్రమంలో తుషార్ దేశ్‌పాండే బౌలింగ్లో సెంచరీ అనంతరం బౌల్డ్ అయ్యాడు.

 లీడ్ సాధించి.. విజయం వైపు వచ్చి

లీడ్ సాధించి.. విజయం వైపు వచ్చి

ఇక ఓవర్ నైట్ స్కోరు 368తో బరిలోకి దిగిన మధ్యప్రదేశ్.. మరో 7పరుగులు చేసి లీడ్ సాధించి మ్యాచ్‌లో విజయం వైపు రావడానికి ఎంతో టైం పట్టలేదు. క్రీజులో ఓవర్ నైట్ స్కోరుతో అడుగుపెట్టిన రజత్ పాటిదర్ (67పరుగులు), కెప్టెన్ ఆదిత్య శ్రీవత్సవ (11పరుగులు) కాసేపు ముంబై బౌలర్లను ప్రతిఘటించి లీడ్‌లోకి తీసుకొచ్చారు. నాలుగో వికెట్ భాగస్వామ్యానికి 60పరుగులు జోడించిన వీరు స్కోరును 400 వందలు దాటించారు. ఇక 25పరుగుల వద్ద శ్రీవత్సవ ఔటయ్యాడు. ఆ తర్వాత అక్షత్ రఘువంశీ (9), పార్థ్ సహనీ (11) ఎక్కువ సేపు క్రీజులో నిలబడలేకపోయారు.

రజత్ పాటిదార్, జైన్ కలిసి..

రజత్ పాటిదార్, జైన్ కలిసి..

ఇక 7వికెట్‌కు సరాన్స్ జైన్ (57పరుగులు 97బంతుల్లో 7ఫోర్లు)తో కలిసి రజత్ పాటిదార్ 53పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశాడు. ఈ క్రమంలో సెంచరీని కూడా పూర్తి చేసుకున్నాడు. రజత్ ఔటయినప్పటికీ జైన్ కాసేపు క్రీజులో ప్రతిఘటించేలా పోరాడాడు. అనుభవ్ అగర్వాల్ (8), కుమార్ కార్తీకేయ (9) త్వరత్వరగా ఔటయ్యారు. ఇక చివరి వికెట్‌గా జైన్ కూడా ఔటవ్వడంతో స్కోరు 536పరుగుల వద్ద ముగిసింది. ఫలితంగా 162పరుగుల భారీ ఆధిక్యాన్ని మధ్యప్రదేశ్ సాధించగలిగింది. ముంబై బౌలర్లలో సామ్స్ ముల్తానీ 5వికెట్ల హాల్ అందుకున్నాడు. తుషార్ దేశ్ పాండే 3, మోహిత్ అవస్థీ 2వికెట్లు పడగొట్టారు.

దూకుడుగా రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ముంబై

దూకుడుగా రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ముంబై

ఇక నాలుగో రోజు చివర్లో రెండో ఇన్నింగ్స్ బ్యాటింగ్‌కు దిగిన ముంబై కాస్త దూకుడుగా ఆడింది. ఎలాగైనా సరే 162పరుగల ఆధిక్యాన్ని అధిగమించి.. మరో 150పరుగుల లీడ్ ఇచ్చి బౌలింగ్ దిగాలనే ప్లాన్లో ఉన్నట్లు కన్పిస్తోంది. ఓపెనర్ యశస్వి గాయం వల్ల బరిలోకి దిగలేదు. దీంతో వికెట్ కీపర్ తామోర్, కేప్టెన్ పృథ్వీ షా ఇన్నింగ్స్‌ను ప్రారంభించారు. టీ20 తరహాలో వాళ్లు ఆడారు. అయితే వారి ఎటాకింగ్ ఎక్కువసేపు కొనసాగలేదు. తామోర్‌ (25పరగులు 32బంతుల్లో)ను కుమార్ కార్తికేయ పెవిలియన్‌కు పంపించాడు. ఆ తర్వాత కేప్టెన్ పృథ్వీ షా (44పరుగులు 52బంతుల్లో)ను గౌరవ్ యాదవ్ ఔట్ చేశాడు. అయినా కాస్త దూకుడుగానే ముంబై ఆడుతుంది. ఇక నాలుగో రోజు ఆట ముగిసే టైంకు 22ఓవర్లలో 113పరుగులు చేసింది. క్రీజులో అర్మన్ జాఫర్ (30), సువేద్ పార్కర్ (9) ఉన్నారు. మరో 49పరుగులు ఇంకా వెనకబడే ఉంది.

 మధ్యప్రదేశ్‌దే విజయం ఎలాగంటే..

మధ్యప్రదేశ్‌దే విజయం ఎలాగంటే..

రంజీ ట్రోఫీ నిబంధనల ప్రకారం తొలి ఇన్నింగ్స్‌లో లీడ్ సాధించిన జట్టుకు మ్యాచ్ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. రెండో ఇన్నింగ్స్ పూర్తికాక మ్యాచ్ డ్రాగా ముగిస్తే.. తొలి ఇన్నింగ్స్‌లో లీడ్ సాధించిన జట్టు విజేతగా నిలుస్తుంది. ఈ క్రమంలో కేవలం మధ్యప్రదేశ్ 162పరుగుల లీడ్ సాధించడంతో మ్యాచ్ డ్రా అయితే ఆ జట్టు విజేతగా నిలుస్తుంది. ఇక ఆ జట్టు విజయానికి కూతవేటు దూరంలో ఉంది. ముంబై గెలుపు అవకాశాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఒక వేళ ముంబై గెలవాలంటే... ఇంకా మిగిలిన ఒక్కరోజులో ఆధిక్యాన్ని అధిగమించాలి.. మళ్లీ టార్గెట్ సెట్ చేయాలి.. అలాగే మధ్యప్రదేశ్‌ను టార్గెట్ కంటే తక్కువలో మిగిలిన ఓవర్లలో ఆలౌట్ చేయాలి. ఇదంతా అయ్యే పని కాదు. కాబట్టి మధ్యప్రదేశ్ తొలిసారి రంజీ ట్రోఫీ అందుకోబోతుంది. ఇది ఖాయం.

 స్కోరు సమ్మరీ

స్కోరు సమ్మరీ

ముంబై ఫస్ట్ ఇన్నింగ్స్ - 374

మధ్యప్రదేశ్ ఫస్ట్ ఇన్నింగ్స్ - 536

ముంబై సెకండ్ ఇన్నింగ్స్ - 113/2 (నాలుగో రోజు ఆట ముగిసే టైంకు)

Story first published: Saturday, June 25, 2022, 19:30 [IST]
Other articles published on Jun 25, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+