
హైదరాబాద్: అనుకోని రీతిలో విదర్భ జట్టు దూసుకుపోతుంది. చరిత్రను తిరగరాసేందుకు తొలి అడుగేసిన విదర్భ రికార్డులు బద్దలయ్యేలా తన సత్తా చూపిస్తామంటోంది. ఇదిలా ఉంటే తన గతాన్ని గుర్తు చేసుకోమని సవాల్ విసురుతూ సిద్ధమవుతోంది ఢిల్లీ జట్టు.
యాబై ఏళ్ల రంజీ చరిత్రలో ఎప్పుడూ క్వార్టర్స్ దాటని విదర్భ ఈసారి అంచనాలను తారుమారు చేస్తూ ఫైనల్‌కు దూసుకెళ్లింది. మరోవైపు బలహీనతలను ఒక్కొక్కటిగా అధిగమిస్తూ ఢిల్లీ.. దశాబ్దం తర్వాత తుది పోరుకు చేరుకుంది. శుక్రవారం మొదలయ్యే రంజీ ట్రోఫీ టైటిల్ ఫైట్‌లో అండర్‌డాగ్ విదర్భ, ఏడుసార్లు చాంపియన్ అయిన ఢిల్లీతో తలపడనుంది.
ఇరు జట్లూ ఓటమి లేకుండా ఫైనల్ వరకు వచ్చాయి. ఈ రెండు జట్లూ గతంలో ఐదుసార్లు తలపడితే ఒక్కసారి మాత్రమే విదర్భ నెగ్గగలిగింది. ముఖ్యంగా మీడియం పేసర్ రజనీష్ గుర్బానీ విదర్భకు మ్యాచ్ విన్నర్‌గా మారాడు. సెమీస్‌లో కర్ణాటకతో మ్యాచ్‌లో విదర్భ తొలి ఇన్నింగ్స్‌లో 116 పరుగులు వెనుకబడింది. అయినా గుర్బానీ సంచలన బౌలింగ్‌తో ఒంటి చేత్తో తన జట్టును గెలిపించుకున్నాడు.
ఢిల్లీ వెటరన్ గంభీర్ ఫుల్‌ఫామ్‌లో ఉండడంతో ఈ మ్యాచ్‌లో అతనికి, గుర్బానీకీ మధ్య పోరు ఎలా నడుస్తుందో అనేది ఆసక్తిని రేకెత్తిస్తోంది. మధ్యప్రదేశ్‌తో క్వార్టర్స్‌లో నాలుగో ఇన్నింగ్స్‌లో 95 పరుగులు చేసిన గౌతమ్ గంభీర్. బెంగాల్‌తో సెమీస్‌లో శతకం బాదాడు. యువ ప్లేయర్లు కూడా సరైన సమయంలో జట్టుకు అండగా నిలుస్తున్నారు. పేసర్ ఇషాంత్ జాతీయ జట్టుకు ఎంపికవడంతో నవదీప్ సైనీ, వికాస్ మిశ్రా ఢిల్లీ బౌలింగ్ బాధ్యతలను తలకెత్తుకున్నారు.
Squads: Vidarbha: Faiz Fazal (captain), Sanjay Ramaswamy, Wasim Jaffer, Ganesh Sathish, Apoorv Wankhede, Vinod Wadkar (wk), Aditya Sarwate, Akshay Wakhare, SiddeshNeral, Rajneesh Gurbani, Karn Sharma, Shalabh Srivastava, Siddhesh Wath (wk), Akshay Karnewar, Suniket Bingewar, Ravikumar Thakur, Aditya Thakare. Delhi: Rishabh Pant (captain/wk), Gautam Gambhir, Kunal Chandela, Dhruv Shorey, Nitish Rana, Himmat Singh, Manan Sharma, Vikas Mishra, Vikas Tokas, Navdeep Saini, Kulwant Khejroliya, Akash Sudan, Shivam Sharma, Unmukt Chand, Milind Kumar.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.