Ranji Trophy Final Mumbai Vs MP: ఆట అటూఇటూ.. మొదటి రోజు ఇరు జట్ల ఉడుంపట్టు..!

భారత దేశవాళీ క్రికెట్లో పేరెన్నికదగ్గ టోర్నమెంట్ రంజీ ట్రోఫీ. ఇక ఆ రంజీ టోర్నమెంట్లో ముంబై జట్టు ఇప్పటివరకు 41సార్లు విజేతగా నిలిచి ఈ టోర్నీలో ఆల్ టైం ఫేవరెట్ జట్టుగా నిలిచింది. ఇక ఆ జట్టు మొత్తంగా 46 సార్లు ఫైనల్ చేరింది. మరోవైపు మధ్యప్రదేశ్ జట్టు మాత్రం ఒక్కసారి కూడా రంజీ టైటిల్ గెలవలేదు. ఇక 23ఏళ్ల క్రితం ఒక్కసారి ఆ జట్టు ఫైనల్ చేరినా.. ట్రోఫీ గెలవలేక రన్నరప్‌గా మిగిలిపోయింది. ఇక ఈసారి రంజీ ట్రోఫీ 2021 - 22లో ఈ రెండు జట్లు ఫైనల్లో తలపడుతున్నాయి. 42వ సారి రంజీ ట్రోఫీ గెలిచి తమకు ఎదురులేదని చూపించాలని ముంబై తాపత్రాయపడుతుండగా.. ఒక్కసారి అయినా రంజీ ట్రోఫీ గెలిచి తమ చిరకాల కల నెరవేర్చుకోవాలని మధ్యప్రదేశ్ మొండి పట్టుదలతో కన్పిస్తుంది.
ఈ క్రమంలో బుధవారం బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరుగుతున్న ఫైనల్ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచిన ముంబై బ్యాటింగ్‌కు దిగింది. మొదటి రోజు ఆట ముగిసే టైంకు 90ఓవర్లకు 5వికెట్లు కోల్పోయి 248పరుగులు చేసింది. ఇక కెప్టెన్ పృథ్వీ షా (47 పరుగులు 79బంతుల్లో 5ఫోర్లు 1సిక్సర్), యశస్వి జైశ్వాల్ (78పరుగులు 163బంతుల్లో 7ఫోర్లు 1సిక్సర్) రాణించారు.

మంచి శుభారంభం దక్కినా..
ఇక ముంబై ఇన్నింగ్స్‌లో ఓపెనర్లు పృథ్వీ షా, యశస్వి జైశ్వాల్ శుభారంభాన్ని అందించారు. వీరిద్దరు అడపాదడపా బౌండరీలు బాదారు. ఇక 27ఓవర్ల పాటు వికెట్ చేజార్చుకోకుండా అత్యంత జాగ్రత్తగా ఆడారు. తొలి వికెట్‌కు వీరిద్దరు 87పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. ఇక మధ్యప్రదేశ్ బౌలర్ అనుభవ్ అగర్వాల్ ఈ జోడీని విడదీశాడు. తన అద్భుతమైన బంతితో పృథ్వీ షాను బౌల్డ్ చేశాడు. ఇక అర్మన్ జాఫర్ (26పరుగులు 56బంతుల్లో) కాసేపు క్రీజులో తచ్చాడినా అతన్ని కార్తీకేయ పెవిలియన్‌కు పంపించాడు. సువేద్ పార్కర్ (18పరుగులు 30బంతుల్లో) ఎక్కువ సేపు క్రీజులో నిలబడలేకపోయాడు. క్రీజులోకి ఫామ్‌లో ఉన్న సర్ఫరాజ్ ఖాన్ దిగాడు. అలాగే మరో ఎండ్‌లో ఫామ్‌లో ఉన్న యశస్వి జైశ్వాల్ కూడా కుదురుగా ఆడడంతో కాసేపు ముంబై భారీ స్కోరు దిశగా వెళ్తుందనిపించింది.

క్రీజులో సర్ఫరాజ్ ఖాన్, సామ్స్ ముల్తానీ
ఇక మరోసారి సెంచరీ చేస్తాడనుకుంటున్న టైంలో యశస్వి జైశ్వాల్‌ను అనుభవ్ అగర్వాల్ బుట్టలో వేశాడు. అతను 78పరుగుల వద్ద క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. ఇక హార్దిక థామోర్ (24పరుగులు 44బంతుల్లో) పెద్ద ఇన్నింగ్స్ ఆడలేకపోయాడు. ఇక డే ముగిసేదాకా క్రీజులో సర్ఫరాజ్ ఖాన్ (47పరగులు 79బంతుల్లో 5ఫోర్లు, 1సిక్సర్ నాటౌట్), సామ్స్ ముల్తానీ (12పరుగులు 43బంతుల్లో నాటౌట్) అత్యంత డిఫెన్సివ్‌గా ఆడుతున్నారు. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో లీడ్ సంపాదించాలనేది ముంబై ప్రణాళిక. తద్వారా మ్యాచ్ డ్రా అయినా గెలుపు తమ సొంతమవుతుందని ఆ ప్రకారం ఇన్నింగ్స్ నిర్మించేందుకు బాగా కష్టపడుతుంది. ఇక రేపు మరో 150 నుంచి 200పరుగులు చేస్తే ముంబై సైడ్ మ్యాచ్ ఎడ్జ్ ఉండే అవకాశముంటుంది.

తుది జట్లు
మధ్యప్రదేశ్ : యష్ దూబే, హిమాన్షు మంత్రి (వికెట్ కీపర్), శుభమ్ S శర్మ, రజత్ పాటిదార్, ఆదిత్య శ్రీవాస్తవ (కెప్టెన్), అక్షత్ రఘువంశీ, పార్థ్ సహాని, సరాంశ్ జైన్, కుమార్ కార్తికేయ, అనుభవ్ అగర్వాల్, గౌరవ్ యాదవ్
ముంబై : పృథ్వీ షా (కెప్టెన్), యశస్వి జైస్వాల్, అర్మాన్ జాఫర్, సువేద్ పర్కర్, సర్ఫరాజ్ ఖాన్, హార్దిక్ తమోర్ (వికెట్ కీపర్), షామ్స్ ములానీ, తనుష్ కోటియన్, ధవల్ కులకర్ణి, తుషార్ దేశ్‌పాండే, మోహిత్ అవస్తీ
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications