For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

దురుసు: ఫోన్ విసిరేసిన క్రికెటర్, అవాక్కయిన అభిమానులు (వీడియో)

మ్యాచు సందర్భంగా సహనం కోల్పోయిన ఆర్పీ సింగ్ ఫ్యాన్స్ పట్ల దురుసుగా వ్యవహరించిన వీడియో నెట్లో హల్ చల్ చేస్తోంది.

ముంబై: రంజీ ట్రోఫీలో గుజరాత్ అద్భుత విజయం నమోదు చేసింది. ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియంలో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో 41 సార్లు చాంపియన్ అయిన ముంబై పైన ఐదు వికెట్ల తేడాతో గుజరాత్ గెలిచింది. గెలుపులో బౌలర్ ఆర్పీ సింగ్‌ది కీలకపాత్ర.

అయితే, చివరి రోజు మ్యాచులో సహనం కోల్పోయిన ఆర్పీ సింగ్ ఫ్యాన్స్ పట్ల దురుసుగా వ్యవహరించిన వీడియో నెట్లో హల్ చల్ చేస్తోంది.

వీడియో

Ranji Trophy Final: Gujarat's RP Singh Loses Cool With Fan On Boundary Line

అతను ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో అక్కడి ఫ్యాన్స్ పదేపదే సెల్ఫీ కోసం అడిగారు. దీంతో చిర్రెత్తుకొచ్చిన ఆర్పీ సింగ్ ఫోన్ తీసుకొని మైదానంలో పడేశాడు. అభిమాన ఆటగాడి నుంచి ఎదురైన ఘటనతో ఫ్యాన్స్ అవాక్కయ్యారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇదే మ్యాచ్ సందర్భంగా ఇంతకుముందు అభిమానులకు వేలి చూపించి వారిని అవమానించాడు.

కాగా, రంజీ ట్రోఫీ చరిత్రలో తొలిసారి గుజరాత్‌ ఛాంపియన్‌గా నిలిచింది. ఇండోర్‌లో శనివారం జరిగిన ఫైనల్‌లో ముంబై జట్టుపై అయిదు వికెట్ల తేడాతో గుజరాత్‌ విజయం సాధించింది. రంజీ ట్రోఫీ చరిత్రలో 41సార్లు టైటిల్‌ గెలిచిన ముంబైపై గుజరాత్‌ గెలవడం ద్వారా రికార్డ్ సృష్టించింది.

ఈ మ్యాచ్‌లో కీలక ఇన్నింగ్స్‌ ఆడిన పార్థివ్‌ పటేల్‌ గుజరాత్‌ను విజయపథం వైపు నడిపించాడు. పార్థివ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 90, రెండో ఇన్నింగ్స్‌లో 143 పరుగులతో రాణించాడు.

Story first published: Monday, November 13, 2017, 12:13 [IST]
Other articles published on Nov 13, 2017
Read in English:
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+