Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

రంజీ ట్రోఫీ ఫైనల్..హైఓల్టేజ్: సెంచరీల మీద సెంచరీలు

బెంగళూరు: బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియం వేదికగా ముంబై-మధ్య ప్రదేశ్ మధ్య రంజీ ఫైనల్ మ్యాచ్ రసవత్తరంగా సాగుతోంది. ముంబైకి ధీటుగా సత్తా చాటుతోంది మధ్య ప్రదేశ్. భారీ స్కోర్ దిశగా పయనిస్తోంది. శుక్రవారం మధ్యాహ్నం టీ విరామ సమయానికి తొలి ఇన్నింగ్‌లో రెండు వికెట్ల నష్టానికి 301 పరుగులు చేసింది. ఓపెనర్ యశ్ దుబే 122 పరుగులు, టాప్ ఆర్డర్ బ్యాటర్ రజత్ పటిదార్ 48 పరుగులతో ఆడుతున్నారు.

374 పరుగులకు..

తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై.. తొలి ఇన్నింగ్‌లో 374 పరుగులకు ఆలౌట్ అయింది. కేప్టెన్ పృథ్వీ షా-47, యశస్వి జైస్వాల్-78, అర్మాన్ జాఫర్-26, సువేద్ పార్కర్-18, సర్ఫరాజ్ ఖాన్-134, హార్దిక్ తమోరె-24, షామ్స్ ములాని-12, తనుష్ కొటియాన్-15, ధవల్ కులకర్ణి-1, తుషార్ దేశ్‌పాండే-6 చేశారు. మోహిత్ అవస్థి-7 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. మధ్యప్రదేశ్ బౌలర్లు అనుభవ్ అగర్వాల్-3 వికెట్లు తీసుకున్నాడు. సారాంశ్ జైన్-2, గౌరవ్ యాదవ్-4, కుమార్ కార్తికేయ ఒక వికెట్ పడగొట్టారు.

సత్తాచాటుతున్న మధ్యప్రదేశ్..

తొలి ఇన్నింగ్ ఆరంభించిన మధ్య ప్రదేశ్.. ముంబైకి ధీటుగా రాణిస్తోంది. మధ్యప్రదేశ్ ఇన్నింగ్‌లో రెండు సెంచరీలు నమోదయ్యాయి. ఓపెనర్ యశ్ దుబే 122 పరుగులతో క్రీజ్‌లో ఉన్నాడు. వన్ డౌన్ బ్యాటర్ శుభం శర్మ 116 పరుగులు చేశాడు. మరో ఓపెనర్ హిమాంశు మంత్రి 31 పరుగులు చేసి, అవుట్ అయిన తరువాత క్రీజ్‌లోకి వచ్చిన శుభం శర్మ భారీ షాట్లతో చెలరేగాడు. ఒక సిక్సర్, 15 ఫోర్లతో 116 పరుగులు చేశాడు. అవస్థి బౌలింగ్‌లో వికెట్ కీపర్ తమోరెకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.

రజత్ కూడా..

ఈ రంజీ టోర్నమెంట్‌లో శుభం శర్మకు ఇది నాలుగో సెంచరీ. క్వార్టర్ ఫైనల్‌లో 102 పరుగులు చేశాడు. ఇప్పుడు ఫైనల్‌లో మళ్లీ మూడంకెల స్కోర్‌ను అందుకున్నాడు. అతని స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన రజత్ పటిదార్ కూడా క్రీజ్‌లో పాతుకు పోయాడు. అర్దసెంచరీ పూర్తి చేసుకున్నాడు. 49 బంతుల్లో 10 ఫోర్లతో 52 పరుగులతో ఆడుతున్నాడు. రజత్ పటిదార్.. క్రీజ్‌లోకి వచ్చినప్పుడు ప్రేక్షకులు ఆర్సీబీ.. ఆర్సీబీ అంటూ నినాదాలు చేశారు. అతను ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున ఆడుతున్న విషయం తెలిసిందే.

ప్రభావం చూపని ముంబై బౌలర్లు..

ముంబై బౌలర్లు ఏ మాత్రం రాణించలేకపోతున్నారు. ధవల్ కులకర్ణి, షామ్స్ ములాని, తనుష్ కొటియాన్ వికెట్లను పడగొట్టలేకపోతున్నారు. వికెట్ లెస్‌గా మారారు. తుషార్ దేశ్‌పాండే, మోహిత్ అవస్తి ఒక్కో వికెట్ తీసుకున్నారంతే. హిమాంశు మంత్రిని తుషార్ దేశ్‌పాండే ఎల్బీడబ్ల్యూగా బలి తీసుకున్నాడు. సెంచరీ హీరో శుభం శర్మ ఇన్నింగ్‌కు మోహిత్ అవస్తి శుభం కార్డు వేశాడు. అతన్ని పెవిలియన్ దారి పట్టించాడు. అతని బౌలింగ్‌లో తమోరెకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.

ముంబై ఇన్నింగ్‌లో..

ముంబై ఇన్నింగ్‌లో..

అంతకుముందు ముంబై ఇన్నింగ్‌లో సర్ఫరాజ్ ఖాన్ సెంచరీ చేసిన విషయం తెలిసిందే. వరుసగా వికెట్లు పడుతున్న సమయంలో వచ్చిన సర్ఫరాజ్ క్రీజ్‌లోకి పాతుకు పోయాడు. పరిస్థితులకు అనుగుణంగా ఆడాడు. ప్రారంభంలో కుదురుకోవడానికి ఎక్కువ బంతులను తీసుకున్న అతను.. ఆ తరువాత ధాటిగా ఆడాడు. 134 పరుగులు చేసి, గౌరవ్ యాదవ్ బౌలింగ్‌లో శ్రీవాస్తవకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు సర్ఫరాజ్ ఖాన్.

Story first published: Friday, June 24, 2022, 16:11 [IST]
Other articles published on Jun 24, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+