Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

రంజీ ట్రోఫీ: ఢిల్లీ జట్టు కెప్టెన్‌గా ధ్రువ్ షోరే, డిప్యూటీగా నితీష్ రాణా

Ranji Trophy: Dhruv Shorey named Delhi captain, Nitish Rana deputy

హైదరాబాద్: వచ్చే వారం ప్రారంభమయ్యే రంజీ సీజన్‌లో ఢిల్లీ జట్టుకు కెప్టెన్‌గా కుడిచేతి వాటం బ్యాట్స్‌మన్ ధ్రువ్ షోరే నాయకత్వం వహించనున్నాడు. డిప్యూటీ కెప్టెన్‌గా నితీష్ రాణా వ్యవహరించనున్నాడు. మొదటి రెండు మ్యాచ్‌లకు జట్టుని బుధవారం ఢిల్లీ & డిస్ట్రిక్ క్రికెట్ అసోసియేషన్(డీడీసీఏ) ప్రకటించింది.

ఈ రంజీ సీజన్‌లో భాగంగా ఢిల్లీ జట్టు తన తొలి మ్యాచ్‌ని కేరళతో తలపడనుంది. భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఇశాంత్ శర్మ, శిఖర్ ధావన్, రిషబ్ పంత్‌లను మొదటి రెండు మ్యాచ్‌లకు జట్టులోకి తీసుకోలేదు. కాగా, ఇటీవలే ముగిసిన విజయ్ హజారే, సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీలో ధ్రువ్ ఢిల్లీ జట్టుకు నాయకత్వం వహించిన సంగతి తెలిసిందే.

అతుల్ వాసన్ నేతృత్వంలోని ఢిల్లీ సెలక్షన్ కమిటీ ప్రాణు విజయ్రన్, సారంగ్ రావత్, క్షితిజ్ శర్మ, కరణ్ డాగర్ నలుగురు ఆటగాళ్లను స్టాండ్‌బైలుగా ప్రకటించింది.

ఢిల్లీ జట్టు:
ధ్రువ్ షోరే (సి), నితీష్ రానా (విసి), కునాల్ చందేలా, అనుజ్ రావత్ (డబ్ల్యుకె), జోంటి సిద్దూ, లలిత్ యాదవ్, శివం శర్మ, వికాస్ మిశ్రా, తేజస్ బరోకా, ప్రదీప్ సంగ్వాన్, నవదీప్ సైని, పవన్ సుయూర్, కున్వర్ హల్ , శివంక్ వశిష్ట్.

Story first published: Wednesday, December 4, 2019, 19:33 [IST]
Other articles published on Dec 4, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+