For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Ranji Trophy: హైదరాబాద్ 565.. ఆంధ్ర 303

రంజీ ట్రోఫీలో భాగంగా గ్రూప్ -బిలో హిమాచల్‌ ప్రదేశ్‌తో జరుగుతోన్నమ్యాచ్‌లో హైదరాబాద్‌ జట్టు భారీ స్కోరు సాధించింది. ఉప్పల్‌ స్టేడియం వేదికగా సాగుతోన్న ఈ మ్యాచ్‌లో హైదరాబాద్‌ తొలి ఇన్నింగ్స్‌లో 168.5 ఓవర్లలో 565 పరుగులకు ఆలౌట్ అయింది.

బ్యాటర్‌ తన్మయ్‌ అగర్వాల్‌ (327 బంతుల్లో 177; 19×4) భారీ శతకంతో మెరిశాడు. కొడిమెల హిమతేజ ( 106 బంతుల్లో 76; 5×4, 5×6) హాఫ్ సెంచరీతో మెరిశాడు. చివర్లో టెయిలెండర్లు రక్షణ్‌రెడ్డి (135 బంతుల్లో 42 నాటౌట్‌; 2×4), శరణు నిశాంత్‌ (93 బంతుల్లో 71; 10×4, 1×6) మంచిగా రాణించారు. పదో వికెట్‌కు 114 పరుగులు జోడించారు. అనంతరం హిమాచల్‌ప్రదేశ్‌ రెండో రోజు ఆట(జనవరి 24) పూర్తయ్యే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 9 ఓవర్లకు ఒక వికెట్‌ కోల్పోయి 33 పరుగులు చేసింది.

Ranji Trophy Day 2 Highlights Hyderabad 565 all out vs Himachal Pradesh and Andhra 303 all out vs Pondicherry

ఆంధ్ర 303

గ్రూప్ - బిలోని మరో మ్యాచ్ లో ఆంధ్ర జట్టు గౌరవప్రదమైన స్కోరు సాధించింది. పుదుచ్చేరితో జరుగుతున్న ఈ మ్యాచ్ లో ఆంధ్ర తొలి ఇన్నింగ్స్‌లో 111.5 ఓవర్లలో 303 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఆల్ రౌండర్ శశికాంత్‌ (99 నాటౌట్‌; 216 బంతుల్లో 11×4, 1×6) త్రుటిలో శతకాన్ని చేజార్చుకున్నాడు.

ఇక రెండో రోజు ఆట (జనవరి 24) ముగిసే సమయానికి పుదుచ్చేరి మొదటి ఇన్నింగ్స్‌లో 63 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 209 పరుగులు చేసింది. మోహిత్‌ కాలె ( 127 బంతుల్లో 60; 5×4), కెప్టెన్‌ అరుణ్‌ కార్తీక్‌ ( 95 బంతుల్లో 54 బ్యాటింగ్‌; 6×4) హాఫ్ సెంచరీలతో మెరిశారు. ఆంధ్ర బౌలర్‌ పృథ్వీరాజ్‌ (4/50) పుదుచ్చేరిని గట్టిగానే అడ్డుకున్నాడు.

Story first published: Saturday, January 25, 2025, 7:47 [IST]
Other articles published on Jan 25, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+