50 సెంచరీలు.. అరుదైన మైలురాయిని అందుకున్న పుజారా!!

రాజ్‌కోట్: టీమిండియా టెస్ట్ బ్యాట్స్‌మన్ 'నయా వాల్' ఛటేశ్వర్ పుజారా కొత్త ఏడాదిని ఘనంగా ఆరంభించాడు. శనివారం కర్ణాటకతో ఆరంభమైన రంజీ ట్రోఫీ మ్యాచ్‌లో సౌరాష్ట్ర ఆటగాడు పుజారా (162 బ్యాటింగ్; 17 ఫోర్లు, సిక్స్) అజేయ సెంచరీ సాధించాడు. దీంతో ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో 50 సెంచరీలు పూర్తి చేసుకున్న తొమ్మిదో భారత క్రికెటర్‌గా రికార్డుల్లోకి ఎక్కాడు.
ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో 50 సెంచరీలు పూర్తి చేసుకున్న జాబితాలో దిగ్గజ ఆటగాళ్లు సునీల్ గావస్కర్ (81), సచిన్ టెండూల్కర్ (81)లు ముందు వరసలో ఉన్నారు. రాహుల్ ద్రవిడ్ (68), విజయ్ హజారే (60), వసీమ్ జాఫర్ (57), దిలీప్ వెంగ్‌సర్కార్ (55), వీవీఎస్ లక్ష్మణ్ (55), మొహమ్మద్ అజహరుద్దీన్ (54)లు తర్వాతి స్థానాల్లో ఉన్నారు. తాజా సెంచరీతో పుజారా అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సౌరాష్ట్రకు పుజారా అండగా నిలబడ్డాడు. పుజారా సెంచరీతో చెలరేగడంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి సౌరాష్ట్ర తమ తొలి ఇన్నింగ్స్‌లో 2 వికెట్లు కోల్పోయి 296 పరుగుల భారీ స్కోర్ చేసింది. తొలి రోజు ఆటముగిసే సమయానికి పుజారతో పాటు జాక్సన్ (99 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. ప్రస్తుత భారత క్రికెటర్లలో పుజారా ఒక్కడే 50 శతకాల జాబితాలో చోటుదక్కించుకున్నాడు.
తాజాగా శ్రీలంకతో మూడు టీ20ల సిరీస్‌ను విజయవంతంగా ముగించిన టీమిండియా.. ఆస్ట్రేలియాతో జరగనున్న మూడు వన్డేల పోరుకు సిద్ధమవుతోంది. మంగళవారం ముంబైలోని వాంఖేడే స్టేడియంలో తొలి వన్డే జరుగనుంది. ఈ సిరీస్ అనంతరం ఈనెల 24న ప్రారంభమయ్యే ఆరు వారాల సుదీర్ఘ పర్యటనలో న్యూజిలాండ్‌తో టీమిండియా ఐదు టీ20లు, మూడు వన్డేలు, రెండు టెస్టులు ఆడుతుంది. న్యూజిలాండ్ పర్యటన కోసం భారత జట్లను సెలెక్షన్ కమిటీ ఆదివారం ఎంపిక చేయనుంది. టెస్టు జట్టులో పుజారాకు చోటు ఖాయం.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications