129ఏళ్ల రికార్డ్ బద్దలుకొట్టిన బెంగాల్ జట్టు.. మొట్టమొదటిసారి టాప్-9 ప్లేయర్ల హాఫ్ సెంచరీలు

రంజీ ట్రోఫీ - 2022 క్వార్టర్ ఫైనల్లో జార్ఖండ్‌తో జరిగిన మ్యాచ్‌లో బెంగాల్ జట్టు అద్భుతమైన రికార్డు నెలకొల్పింది. అభిమన్యు ఈశ్వరన్ కెప్టెన్సీ వహిస్తున్న ఈ జట్టు క్వార్టర్ ఫైనల్‌లో తొలి ఇన్నింగ్స్‌లో 773/7భారీ స్కోరు సాధించింది. ఇక ఈ జట్టు తరఫున నంబర్ 9వ స్థానంలో బరిలోకి దిగిన ప్లేయర్ ఆకాష్ దీప్ యాభై పరుగుల మార్కును చేరుకోవడంతో ఒక ఇన్నింగ్స్‌లో తొమ్మిది మంది బ్యాటర్లు యాభైకి పైగా స్కోర్లు చేసిన మొదటి ఫస్ట్-క్లాస్ జట్టుగా చరిత్రపుటల్లో బెంగాల్ రికార్డ్ నెలకొల్పింది. ఇక ఈ మ్యాచ్‌లో ఆకాశ్ దీప్ 18బంతుల్లోనే అజేయంగా 53పరుగులు చేయడం గమనార్హం. ఇక జట్టులోని సుదీప్ ఘరామి, అనుస్తుప్ మజుందార్ సెంచరీలతో చెలరేగగా.. బ్యాటింగ్ చేసిన మిగిలిన ఏడుగురు హాఫ్ సెంచరీలు చేసి బెంగాల్‌కు భారీ స్కోరు అందించారు.
టాప్ 9 బ్యాటర్లందరూ చెలరేగడంతో..
అంతకుముందు ఆస్ట్రేలియన్ ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 129 ఏళ్ల క్రితం నాటి రికార్డును తాజాగా బెంగాల్ అధిగమించింది. ఇకపోతే టాప్-9లో ఉన్న బ్యాటర్లందరూ ఒక ఇన్నింగ్స్‌లో 50+ పరుగులు చేయడం కూడా ఇదే తొలిసారి. ఈ మ్యాచ్‌లో ఓపెనింగ్ ద్వయం అభిషేక్ రామన్ (61), అభిమన్యు ఈశ్వరన్ (65) 132 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేయగా.. ఘరామి (186), మజుందార్ (117)లు తర్వాత సెంచరీలతో ఆకట్టుకున్నారు. ఇక వెటరన్ బ్యాటర్ మనోజ్ తివారీ 173 బంతుల్లో 73 పరుగులు చేయగా.. వికెట్ కీపర్-బ్యాటర్ అభిషేక్ పోరెల్ (68), షాబాజ్ అహ్మద్ (78), సయన్ మొండల్ (53*), ఆకాశ్ దీప్ (53*) హాఫ్ సెంచరీలు బాదారు.
ఆకాష్ దీప్.. ఇదేం బ్యాటింగ్ రా నాయనా
ఇకపోతే ఈ మ్యాచ్‌లో ఆకాశ్ దీప్ ఆటే హైలెట్ అని చెప్పుకోవాలి. అతను 9వ స్థానంలో బ్యాటింగ్ దిగి ఎడాపెడా సిక్సులు బాదుతూ జార్ఖండ్ జట్టును బెంబేలెత్తించాడు. అతను తాను ఎదుర్కొన్న 18 బంతుల్లో 0,0,6,0,6,0,6,6,1,6,1,6,0,1,6,0,2,6తో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అతను ఏకంగా 8సిక్సులు కొట్టడం విశేషం. టెస్ట్ మ్యాచ్‌లో ఇంత భారీ హిట్టింగ్, అది కూడా 9వ స్థానంలోని బ్యాటర్ నమోదు చేయడం నిజంగా గ్రేట్ అని చెప్పాలి. ఇక ఆకాశ్ దీప్ 294.44స్ట్రైక్ రేట్ మెయింటెన్ చేశాడు. ఇకపోతే ఫస్ట్ క్లాస్ స్థాయిలో ఇది అతని మొట్టమొదటి 50 ప్లస్ స్కోరు కావడం విశేషం.
జార్ఖండ్ 138పరుగులకే 5వికెట్లు కోల్పోయింది
ఇక బెంగళూరులో జరుగుతున్న ఈ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో జార్ఖండ్ టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్‌కు దిగిన బెంగాల్ జట్టు అత్యధ్బుతంగా ఆడి 773పరుగులకు 7వికెట్లు కోల్పోయి డిక్లేర్ చేసింది. ఇక మూడో రోజు బ్యాటింగ్ దిగిన జార్ఖండ్ జట్టు 5వికెట్లు కోల్పోయేసరికి 138పరుగులు చేసింది. ఇక ఇతర క్వార్టర్ ఫైనల్ గేమ్‌లలో, ముంబై ఉత్తరాఖండ్‌తో తలపడుతుండగా.., కర్ణాటక ఉత్తరప్రదేశ్‌తో, పంజాబ్ మధ్యప్రదేశ్‌తో తలపడుతున్నాయి. జూన్ 14-18 మధ్య సెమీ-ఫైనల్స్ మ్యాచ్‌లు జరుగుతాయి. రంజీ ట్రోఫీ ఫైనల్ జూన్ 22-26 మధ్య బెంగళూరులోని చిన్నస్వే స్టేడియంలో జరగనుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications