Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Ranji Trophy 2025 : విరాట్ కోహ్లీ కీలక నిర్ణయం!!

టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ కీలక ప్రకటన చేశాడు!. ప్రతిష్టాత్మక దేశవాళీ టోర్నీ బరిలో దిగబోతున్నట్లు తెలిపాడు. చివరగా 2012లో రంజీ మ్యాచ్‌ ఆడిన విరాట్.. మళ్లీ 13 ఏళ్ల తర్వాత రంజీ ట్రోఫీ ఆడేందుకు సిద్ధమవుతున్నట్లు పేర్కొన్నాడు.

జనవరి 23 నుంచి దిల్లీ, సౌరాష్ట్ర మధ్య మ్యాచ్‌ జరగనుంది. అయితే ఈ మ్యాచ్‌కు మెడ నొప్పి కారణంగా కోహ్లీ అందుబాటులో ఉండట్లేదు. ఆ తర్వాత జనవరి 30 నుంచి రైల్వేస్‌తో జరగనున్న చివరి లీగ్‌ మ్యాచ్‌ కు అందుబాటులో ఉండనున్నాడు. ఈ విషయాన్నివిరాట్.. దిల్లీ క్రికెట్‌ అసోసియేషన్‌కు చెప్పినట్లు... ఆ జట్టు ప్రధాన కోచ్ శరణ్‌దీప్ సింగ్ తెలిపారు.

Ranji Trophy 2025 virat kohli set to play delhi ranji trophy match vs railways

కాగా, అంతర్జాతీయ మ్యాచ్‌లు లేని సమయంలో ప్లేయర్స్ కచ్చితంగా దేశవాళీ క్రికెట్ లో పాల్గొనాలని రీసెంట్ గానే బీసీసీఐ ఆదేశించిన విషయం తెలిసిందే. స్టార్ ఆటగాళ్లకు కూడా మినహాయింపులేమీ ఉండవని చెప్పింది. దీంతో కెప్టెన్ రోహిత్ శర్మతో (ముంబయి) పాటు రిషబ్ పంత్ (దిల్లీ), రవీంద్ర జడేజా (సౌరాష్ట్ర), శుభ్‌మన్ గిల్ (పంజాబ్), యశస్వి జైస్వాల్ (ముంబయి) వంటి ప్లేయర్లు ఈ సారి రంజీ ఆడుతున్నారు.

ఇకపోతే రేపటి నుంచి (జనవరి 22) నుంచి టీమిండియా ఇంగ్లాండ్ తో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ ఆడనుంది. కోహ్లీతో పాటు రోహిత్, జడేజా టీ20లకు రిటైర్మెంట్‌ ప్రకటించిన నేపథ్యంలో ఈ సిరీస్ కు ఎంపిక కాలేదు. సూర్యకుమార్‌ యాదవ్‌ టీమిండియా సారథిగా వ్యవహరిస్తాడు. వైస్‌ కెప్టెన్‌ గా అక్షర్‌ పటేల్‌ను తీసుకున్నారు. ఎంపిక చేశారు.ఈ సిరీస్‌తో స్టార్‌ పేసర్‌ మహ్మద్‌ షమీ రీఎంట్రీ ఇవ్వనున్నాడు.

Story first published: Tuesday, January 21, 2025, 8:38 [IST]
Other articles published on Jan 21, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+