Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Ranji Trophy Pracitce Session : 'HR 26 EX 0018'.. వైరల్ గా కోహ్లీ లగ్జరీ కార్

టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ రంజీ మ్యాచ్ ఆడేందుకు సిద్ధమైన సంగతి తెలిసిందే. తాజాగా అతడు దిల్లీ జట్టుతో కలిసి ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టేశాడు. అరుణ్ జెట్లీ స్టేడియం వేదికగా దిల్లీ టీమ్ ప్లేయర్లతో కలిసి రన్నింగ్, ఫీల్డింగ్ సాధన చేశాడు. అయితే ఈ ప్రాక్టీస్ మ్యాచ్ కు కోహ్లీ ఓ లగ్జరీ కార్ లో వచ్చాడు. స్టేడియానికి ఓ విలాసవంతమైన కారులో చేరుకున్నాడు.

కోహ్లీ స్టేడియానికి చేరుకోగానే అతడిని మీడియా ప్రతినిధులతో పాటు అభిమానులు చుట్టుముట్టారు. తమ కెమెరాలతో విరాట్ ను క్లిక్ మనిపించారు. అయితే ఇదే సమయంలో చాలా మందిని కోహ్లీ లగ్జరీ కారుకు ఉన్న ఫ్యాన్సీ నెంబర్ ప్లేట్ అందరి దృష్టిని ఆకర్షించింది. విరాట్ బ్లాక్ కలర్ Porsche Cayenne SUV కారులో వచ్చాడు. దానికి రిజిస్ట్రేషన్ ప్లేట్ నెం.'HR 26 EX 0018'గా ఉంది. ఇందులో 18 నెంబర్ హైలైట్ గా నిలిచింది. ఎందుకంటే కోహ్లీ జెర్సీ నెంబర్ కూడా 18 నెంబరే కావడం విశేషం.

Ranji trophy 2025 Virat Kohli s Porsche car number goes viral in practise session ahead of Delhi vs Railways match

విరాట్ కోహ్లీ గ్యారేజ్ లో ఇంకా ఎన్నో లగ్జరీ కార్లు కూడా ఉన్నాయి. అవన్నీ కూడా దాదాపుగా 18 సిరీస్ ఉన్న రిజిస్ట్రేషన్ తోనే ఉండటం విశేషం. ఇంకా అతడి దగ్గర ఉన్న ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ వోగ్, బెంట్లీ ఫ్లైయింగ్ స్పర్ కార్లకు 1818 సిరీస్ ఉంటుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో కోహ్లీ కారుతో పాటు అతడు ప్రాక్టీస్ చేస్తోన్న వీడియోలు కూడా సోష‌ల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. దీంతో విరాట్ ఫ్యాన్స్ ఆ వీడియోలను తెగ షేర్ చేస్తూ పండగ చేసుకుంటున్నారు.

దాదాపు 13 ఏళ్ల తర్వాత విరాట్ కోహ్లీ రంజీల్లోకి అడుగుపెట్టబోతున్నాడు. చివరిసారిగా 2012లో ఉత్తర్‌ప్రదేశ్‌పై రంజీ మ్యాచ్‌ ఆడాడు. జనవరి 30 నుంచి రైల్వేస్‌తో జరగబోయే మ్యాచ్‌లో దిల్లీ తరఫున ఆడనున్నాడు. ఇప్పటికే కోహ్లీ పేరును దిల్లీ జట్టు ప్రకటించింది. ఆయుష్ బదోని నాయకత్వంలో దిల్లీ జట్టు బరిలోకి దిగనుంది.

Story first published: Tuesday, January 28, 2025, 14:51 [IST]
Other articles published on Jan 28, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+