విరాట్ కోహ్లీ రంజీ మ్యాచ్ ఆడుతాడా లేదా అనే సస్పెన్స్‌కు ఎట్టకేలకు తెరపడింది. దాదాపు 13 ఏళ్ల తర్వాత రంజీ బరిలోకి దిగబోతున్నాడు. తాజాగా అతడు దిల్లీ రంజీ జట్టుతో కలిశాడు. టీమ్ లోని ఇతర ఆటగాళ్లతో కలిసి ప్రాక్టీస్ చేస్తూ కనిపించాడు. వాళ్లతో కలిసి సర్కిల్ క్రికెట్ ఆడాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి.
కోహ్లీ ప్రాతినిధ్యం వహిస్తోన్న దిల్లీ జట్టు.. ఈ నెల 30 నుంచి రైల్వేస్ టీమ్ తో మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్ కోసం దిల్లీ జట్టు అరుణ్ జైట్లీ స్టేడియంలో ప్రాక్టీస్ సెషన్ నిర్వహించింది. ఇందులో కోహ్లీ కూడా భాగమై ఆటగాళ్లతో కలిసి రన్నింగ్, ఫీల్డింగ్ సాధన చేశాడు. అలానే దిల్లీ ప్లేయర్లతో కలిసి ఫుట్‌బాల్ కూడా ఆడాడు.

ఇక ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో కోహ్లీ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. దీన్ని చూస్తుంటే పాత రోజులు గుర్తొస్తున్నాయని కామెంట్లు చేస్తున్నారు. యంగ్ విరాట్‌ను మళ్లీ చూస్తున్నట్లుగా ఉందని, కింగ్ మళ్లీ తన పాత డెన్‌లోకి వచ్చినట్లుగా ఉందని కూడా పోస్ట్ లు పెడుతున్నారు.
ఎలా ఆడతాడో
మరో రెండు రోజుల్లో ప్రారంభం కానున్న ఈ రంజీ మ్యాచ్‌లో కోహ్లీ ఎలా ఆడుతాడన్నది ప్రస్తుతం క్రికెట్ అభిమానుల్లో ఆసక్తిగా మారింది. ఎందుకంటే న్యుజిలాండ్ సిరీస్ తో పాటు బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో ఆశించిన స్థాయిలో రాణించలేక దారుణంగా విఫలమయ్యాడు విరాట్. ఆస్ట్రేలియా పర్యటనలో మొత్తం తొమ్మిది ఇన్నింగ్స్‌లలో కేవలం 190 పరుగులు చేశాడు. ఈ సిరీస్‌లో ఓటమి నేపథ్యంలో టీమిండియా స్టార్ ప్లేయర్లు కచ్చితంగా దేశవాళీ క్రికెట్ ఆడాలని బీసీసీఐ నిబంధన పెట్టింది.
VIRAT KOHLI WITH DELHI TEAM...!!!! 🇮🇳 [Daya Sagar] pic.twitter.com/tX8VXBgJgQ
— Johns. (@CricCrazyJohns) January 28, 2025