Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

రంజీ బరిలోకి టీమిండియా స్టార్!.. కోహ్లీ,రోహిత్ మాత్రం కాదు!!

దేశవాళీలో స్టార్లు బరిలో దిగాలి.. బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీలో భారత్‌ ఓటమి తర్వాత వినిపిస్తోన్న సలహాలివీ. రీసెంట్ గా జరిగిన రివ్యూ మీటింగ్ లోనూ బీసీసీఐ స్టార్ ప్లేయర్స్ కు ఇదే విషయాన్ని చెప్పినట్లు తెలిసిందే. ఇదే సమయంలో బీజీటీ సిరీస్‌లో ఆడిన కొంతమంది భారత ఆటగాళ్లు ఇప్పటికే దేశవాళీ బాట పట్టడం ప్రారంభించారు.

ఈ క్రమంలోనే స్టార్ ఆటగాడైన కెప్టెన్ రోహిత్ శర్మ కూడా రంజీ ట్రోఫీలోని ముంబయి జట్టుతో కలిశాడు. అతడు మ్యాచులు ఆడుతాడా లేదా అనేది క్లారిటీ లేనప్పటికీ, తాజాగా ప్రాక్టీస్ మ్యాచ్ మాత్రం ఆడాడు. ఇక కోహ్లీ గురించి ఇప్పటికైతే ఎలాంటి సమాచారం లేదు. అయితే ఇప్పుడు మరో స్టార్ ప్లేయర్ దేశవాళీ క్రికెట్ కోసం రెడీ అయినట్లు తెలిసింది.

Ranji trophy 2025 Shubman Gill to Play in Punjabs Upcoming Ranji Match against karnataka

అతడే యంగ్ స్టార్ శుభమన్ గిల్. గిల్ కూడా రీసెంట్ గా ముగిసిన ఆస్ట్రేలియా పర్యటనలో పరుగులు చేయడానికి కష్టపడ్డాడు. మెల్ బోర్న్ టెస్ట్ లో టీమ్ మేనేజ్ మెంట్ అతడిని పక్కకు పెట్టి మిడిలార్డర్ లో కేఎల్ రాహుల్ ను ఆడించింది. దీంతో గిల్ కూడా ఇప్పుడు ఫామ్ ను అందిపుచ్చుకునే విషయమై ప్రయత్నాలు మొదలుపెట్టాడు.

ఈ క్రమంలోనే గిల్.. రంజీ ట్రోఫీ బరిలోకి దిగబోతున్నట్లు పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ కు చెందిన ఓ ప్రతినిధి తెలిపారు. గిల్ పంజాబ్ జట్టు తరఫున మ్యాచులు ఆడేందుకు అందుబాటులో ఉంటాడని పేర్కొన్నారు. "అవును గిల్ అందుబాటులో ఉంటాడు. జనవరి 23న రంజీలో పంజాబ్ జట్టు తరఫున కర్ణాటకపై మ్యాచ్ ఆడనున్నాడు" అని సదరు ప్రతినిధి తెలిపారు.

కాగా, ఇంగ్లాండ్ త్వరలోనే (జనవరి 22) జరగబోయే టీ20 సిరీస్ కు శుభమన్ గిల్ ను ఎంపిక చేయలేదు బీసీసీఐ. దీంతో గిల్ ఆ సమయాన్ని.. రంజీ ట్రోఫీ ద్వారా తన నైపుణ్యాలను పదును పెట్టుకోవడానికి ఉపయోగించుకోనున్నాడు.

Story first published: Tuesday, January 14, 2025, 16:43 [IST]
Other articles published on Jan 14, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+