Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

రంజీ ట్రోఫీలో విషాదం! - గుండెపోటుతో ముంబయి మాజీ కెప్టెన్ మృతి

భారత క్రికెట్ లో విషాదం చోటు చేసుకుంది. దిగ్గజ క్రికెటర్ సునీల్ గావస్కర్ క్లోజ్ ఫ్రెండ్, ముంబయి మాజీ కెప్టెన్ మిలింద్ రేగే (76) కన్నుమూశారు. గుండె పోటుతో తుదిశ్వాస విడిచారు. ఆయన మరణం పట్ల పలువురు క్రికెట్ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.

ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తూ..
మిలింద్, తన క్రికెట్ కెరీర్ లో ఆఫ్ స్పిన్నర్ గా రాణించారు. 70ల్లో ముంబయి తరఫున 52 ఫస్ట్ క్లాస్ క్రికెట్ మ్యాచులు ఆడిన ఆయన 126 వికెట్లు తీశారు. 2006లో ముంబయిలో నిర్వహించిన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఆర్గనైజింగ్ కమిటీలోనూ భాగస్వామ్యం అయ్యారు. క్రికెట్ లో రిటైర్ అయ్యాక మిలింద్ సెలక్టర్ గా, మెంటార్ గానూ సేవలు అందించారు. ఎంతో మంది క్రికెటర్లు స్ఫూర్తిగా నిలుస్తూ వారు ఉన్నత స్థాయికి ఎదిగేలా తీర్చిదిద్దారు. ముఖ్యంగా ముంబయి క్రికెట్ అసోసియేషన్ లో ఎన్నో సేవలు అందించారు. మేనేజింగ్ కమిటీ మెంబర్, సెలక్టర్, కామెంటేటర్, ఆ తర్వాత అడ్వైజర్ గానూ నియమితులయ్యారు.

Ranji trophy 2025 Ex Mumbai captain Milind Rege 76 passed away with cardiac arrest

నల్ల బ్యాండ్స్ కట్టుకుని..
నాగ్ పూర్ వేదికగా ముంబయి - విదర్భ రంజీ సెమీ పైనల్ మ్యాచ్ లో ఆటగాళ్లంతా మిలింద్ మృతికి సంతాపం తెలిపారు. బ్లాక్ ఆర్మ్ బ్యాండ్స్ కట్టుకుని, కాసేపు మౌనం పాటిస్తూ నివాళులు అర్పించారు. "మిలింద్ సార్ చనిపోవడం నన్ను ఎంతగానో బాధించింది. ముంబయి క్రికెట్ లో ఆయన నిజమైన స్టార్. ప్లేయర్, సెలక్టర్, మెంటార్ గా ఆయన అందించిన సేవలు విలువ కట్టలేనివి. ఎంతో మంది క్రికెటర్లను తీర్చిదిద్దారు. ఆయన ఇచ్చిన మద్దతు, ప్రోత్సాహం ఎప్పటికీ మర్చిపోలేనిది. ఆయన లెగసీ అలానే కొనసాగుతూ ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తుంది. ఆయన నాకు ఎప్పుడూ అండగానే నిలిచారు. ఎప్పటికీ ఆయనకు రుణపడి ఉంటాను. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను." అని ముంబయి కెప్టెన్ అజింక్యా రహానె పేర్కొన్నాడు.
Story first published: Wednesday, February 19, 2025, 12:26 [IST]
Other articles published on Feb 19, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+