దేశవాళీ క్రికెట్ రంజీ ట్రోఫీలో స్టార్ బ్యాటర్ కోహ్లీ మినహా.. టీమిండియా స్టార్ క్రికెటర్లు బరిలోకి ఆడుతున్న సంగతి తెలిసిందే. కెప్టెన్ రోహిత్ శర్మ, శుభమన్ గిల్, పంత్, యశస్వి జైశ్వాల్, జడేజా సహా పలువురు ఆడుతున్నారు. అయితే విరాట్ కోహ్లీ.. ఈ రంజీ బరిలో ఎప్పడెప్పుడు దిగుతాడా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే అతడు రైల్వేస్ తో జరిగే మ్యాచ్ కు అందుబాటులో ఉంటాడని దిల్లీ క్రికెట్ సంఘం చెబుతోంది. అందుకు తగినట్లుగానే ఏర్పాట్లనూ చేస్తోంది. ఈ క్రమంలోనే క్రికెట్ ప్రియుల కోసం ఓ ఆఫర్ కూడా ప్రకటించింది.
ఫ్రీ ఎంట్రీ - భారీ భద్రత
అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా రైల్వేస్ జట్టుతో దిల్లీ టీమ్ తలపడనుంది. అయితే తొలి మ్యాచ్ లో ఘోర ఓటమిని అందుకున్న దిల్లీ.. ఇప్పుడు కోహ్లీ రాకపైనే ఆశలు పెట్టుకుంది. ఎందుకంటే మొదటి మ్యాచ్ లో ఆ జట్టు కెప్టెన్ ఆయుష్ బదోని ఒక్కడే పర్వాలేదనిపించాడు. రిషభ్ పంత్ విఫలమయ్యాడు. దీంతో ఇప్పుడు విరాట్ కోసం అంతా ఎదురుచూస్తున్నారు.

అందుకే అతడిని చూసేందుకు ఫ్యాన్స్ భారీ ఎత్తున వస్తారని దిల్లీ సంఘం డీడీసీఏ భావిస్తోంది. దాదాపుగా 10వేల మందికిపైగా ప్రేక్షకులు వస్తారని అనుకుంటోంది. దీంతో భద్రతను పటిష్టం చేస్తుంది. నార్త్ ఎండ్, ఓల్డ్ క్లబ్ హౌస్‌ను కూడా ఓపెన్ చేయబోతుందట. అదనపు సీటింగ్‌ను సిద్ధం చేయనుందని సమాచారం అందింది. టికెట్ల అవసరం లేకుండానే ప్రతి ఒక్కరికీ ఫ్రీ ఎంట్రీ ఇవ్వనుందట.
గిల్ సెంచరీ, జడేజా 12 వికెట్లు
ఇప్పటి వరకు ప్రస్తుత రంజీ సీజన్ లో బరిలోకి దిగిన టీమిండియా స్టార్స్ లో గిల్ ఒక్కడే విఫలమైనా తిరిగి పుంజుకుని ఆడాడు. సెంచరీతో చెలరేగాడు. జడేజా అయితే తన తొలి మ్యాచ్ లోనే 12 వికెట్లతో అదరగొట్టాడు. మిగతా వారంతా నిరాశపరిచారు.