Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Ranji Trophy : ప్చ్.. మళ్లీ నిరాశపరిచిన రోహిత్ శర్మ.. ఏందయ్య ఇది

రంజీ ట్రోఫీ ఎలైట్ మ్యాచ్‌లు ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ క్రికెట్‌లో ఫామ్‌ కోల్పోయి సతమతమవుతోన్న భారత స్టార్ క్రికెటర్లు ఈ రంజీ బరిలోకి దిగారు. కెప్టెన్ రోహిత్ శర్మ కూడా ఈ రంజీ బరిలో దిగిన సంగతి తెలిసిందే. అయితే పేలవ ఫామ్ తో ఇబ్బంది పడుతోన్న రోహిత్ మళ్లీ నిరాశపరిచాడు.

తాజాగా జమ్ముకశ్మీర్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబయి తరఫున బ్యాటింగ్ కు దిగిన హిట్ మ్యాన్ 19 బంతులు ఎదుర్కొని కేవలం మూడు పరుగులే చేసి ఔట్ అయ్యాడు. పేసర్ ఉమర్ నాజిర్ బౌలింగ్ లో పెవిలియన్ చేరాడు.

Ranji Trophy 2024 25 Rohit Sharma dismissed for 3 runs from 19 balls on return for Mumbai

ముంబయి జట్టు ఇదే: యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ, అజింక్య రహానె (కెప్టెన్), శ్రేయస్ అయ్యర్, హార్దిక్‌ తామోరె (వికెట్ కీపర్), శివమ్ దూబె, శార్దూల్ ఠాకూర్, షంసి ములాని, తనుష్ కొటియన్, మోహిత్ అవస్తి, కర్ష్‌ కొతారి

మరోవైపు సౌరాష్ట్రతో దిల్లీ జట్టు కూడా ఆడుతోంది. బ్యాటింగ్‌ ఎంచుకుంది. రిషభ్ పంత్‌ దిల్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఇక ఆస్ట్రేలియా పర్యటనలో పేలవ ప్రదర్శన చేసిన విరాట్ కోహ్లీ కూడా దిల్లీ టీమ్ కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. కానీ మెడ నొప్పి కారణంగా ఈ మ్యాచ్ ఆడట్లేదు. రవీంద్ర జడేజా సౌరాష్ట్ర తరఫున ఆడుతున్నాడు. శుభ్‌మన్‌ గిల్ పంజాబ్‌ తో బరిలోకి దిగాడు.

దిల్లీ జట్టు ఇదే: సనత్ సంగ్వాన్, యశ్‌ ధుల్, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), ఆయుశ్‌ బదోని (కెప్టెన్), అర్పిత్ రాణా, మయాంక్‌ గుసైన్, సుమిత్ మాథుర్, జాంటీ సిధు, శివమ్ శర్మ, హర్ష్ త్యాగి, నవ్‌దీప్ సైని

Story first published: Thursday, January 23, 2025, 10:40 [IST]
Other articles published on Jan 23, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+