రంజీ ట్రోఫీ 2024-25 సీజన్‌ను హైదరాబాద్ జట్టు ఓటమితో ఆరంభించింది. సికింద్రాబాద్ జింఖానా మైదానంలో గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో 126 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఎలైట్ గ్రూప్-బీలో ఉన్న హైదరాబాద్ ఛేదనలో దారుణంగా విఫలమైంది. 296 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్ 170 పరుగులకే కుప్పకూలింది.
అభిరత్ రెడ్డి (51; 59 బంతుల్లో, 7 ఫోర్లు, 1 సిక్సర్) టాప్ స్కోరర్. గుజరాత్ బౌలర్లలో ప్రియజిత్ సింగ్ జడేజా, రింకేశ్ చెరో మూడు వికెట్లు, సిద్ధార్థ్, అర్జాన్ తలో రెండు వికెట్లు తీశారు. ఛేదనతొ నాలుగో రోజు ఆట ఆరంభించిన హైదరాబాద్ ఆదిలోనే రెండు వికెట్లు కోల్పోయింది. ఓపెనర్ తన్మయ్ అగర్వాల్ ఒక్క పరుగుకు, కెప్టెన్ రాహుల్ సింగ్ గోల్డెన్ డకౌట్‌గా వెనుదిరిగారు. ఈ దశలో బ్యాటింగ్‌కు వచ్చిన అభిరత్-రోహిత్ రాయుడు (26; 93 బంతుల్లో, 3 ఫోర్లు) ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశారు.

వీరిద్దరు మూడో వికెట్‌కు 64 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అయితే గుజరాత్ బౌలర్లు పుంజుకుని క్రమం తప్పకుండా వికెట్లు పడగొట్టి హైదరాబాద్‌ను ఒత్తిడిలోకి నెట్టారు. హిమతేజ (29; 55 బంతుల్లో, 4 ఫోర్లు, 1 సిక్సర్), ఛామా మిలింద్ (28; 45 బంతుల్లో, 3 ఫోర్లు, 1 సిక్సర్) పోరాటం ఓటమి అంతరాన్ని మాత్రమే తగ్గించింది.
కాగా, తొలి ఇన్నింగ్స్‌లో గుజరాత్ 343 పరుగులు చేసింది. మనన్ హింగ్రాజియా (181) భారీ శతకం సాధించాడు. ఉర్విల్ పటేల్ (60) అర్ధశతకం బాదాడు. త్యాగరాజన్, మిలింద్ చెరో మూడు వికెట్లు, రక్షణ్, నిశాంత్ తలో రెండు వికెట్లు తీశారు. మొదటి ఇన్నింగ్స్‌లో హైదరాబాద్ 248 పరుగులు చేసింది. హిమతేజ (66), మిలింద్ (60), రాహుల్ సింగ్ (56) హాఫ్‌సెంచరీలు చేశారు.
గుజరాత్ బౌలర్లలో నాగ్వాస్వాల్లా మూడు, రింకేశ్, చింతన్ చెరో రెండు వికెట్లు తీశారు. గుజరాత్ రెండో ఇన్నింగ్స్‌లో 201 పరుగులకు ఆలౌటైంది. ఉమంగ్ కుమార్ (85) పరుగులు చేశాడు. అనికేత్ రెడ్డి అయిదు వికెట్లతో చెలరేగాడు. ఛేదనలో హైదరాబాద్ 170 పరుగులకు కుప్పకూలింది.