Ranji Trophy 2022: షకీబుల్ గని ప్రపంచ రికార్డు.. అరంగేంట్ర మ్యాచ్‌లోనే ట్రిపుల్ సెంచరీ

కోల్‌కతా: రంజీ ట్రోఫీలో బిహార్ బ్యాటర్ షకీబుల్ గని ప్రపంచ రికార్డు సృష్టించాడు. అరంగేంట్ర మ్యాచ్‌లోనే ట్రిపుల్ సెంచరీతో విశ్వరూపం చూపించాడు. ఈ క్రమంలో 56 ఫోర్లు, 2 సిక్సులతో విధ్వంసం సృష్టించాడు. తన విధ్వంసకర ఆట తీరుతో పట్ట పగలే మిజోరాం బౌలర్లకు చుక్కలు చూపించాడు. వరుస బౌండరలీతో మైదానాన్ని హోరెత్తించాడు. దీంతో షకీబుల్‌ను ఔట్ చేయలేక మిజోరాం బౌలర్లు గ్రౌండ్‌లోనే తలపట్టుకున్నంత పని అయింది.

ప్రపంచ రికార్డు
కోల్‌కతాలోని జాదవ్‌పూర్ యూనివర్శిటీ క్యాంపస్ 2వ గ్రౌండ్‌లో గ్రూప్ మ్యాచ్‌ల్లో బిహార్, మిజోరాం మధ్య జరిగిన మ్యాచ్‌తో 22 ఏళ్ల షకీబుల్ గని ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లోకి అరంగేంట్రం చేశాడు. ఈ క్రమంలో 71 పరుగుల వద్ద బిహార్ మూడో వికెట్ కోల్పోయాక ఐదో స్థానంలో క్రీజులోకి వచ్చాడు. ఆరంభం నుంచే ధాటిగా ఆడిన షకీబుల్ మిజోరాం బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు. వరుసగా బౌండరీలు బాదుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. ఈ క్రమంలో సెంచరీ, డబుల్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇక 387 బంతుల్లో ట్రిపుల్ సెంచరీ కూడా చేశాడు. దీంతో క్రికెట్ చరిత్రలోనే ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో అరంగేంట్రం చేసిన మ్యాచ్‌లోనే ట్రిపుల్ సెంచరీ చేసిన తొలి ఆటగాడిగా షకీబుల్ గని ప్రపంచ రికార్డు సృష్టించాడు. మొత్తంగా ఈ మ్యాచ్‌లో 405 బంతులు ఎదుర్కొన్న గని 56 ఫోర్లు, 2 సిక్స్‌లతో 341 పరుగులతో విశ్వరూపం చూపించాడు.
రికార్డు బద్దలు
ఈ క్రమంలో ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో అరంగేంట్ర మ్యాచ్‌లో ఎక్కువ పరుగులు చేసిన మధ్యప్రదేశ్‌కు చెందిన అజయ్ రోహెరా రికార్డును కూడా షకీబుల్ గని బద్దలు కొట్టాడు. 2018/19 రంజీ ట్రోఫీ సీజన్‌లో హైదరాబాద్‌పై అజయ్ రోహెరా 267 పరుగులు చేసి ఇప్పటివరకు అరంగేంట్ర మ్యాచ్‌లో ఎక్కువ పరుగులు చేసిన బ్యాటర్‌గా ఉన్నాడు. కానీ తాజాగా ఆ రికార్డును షకీబుల్ గని బ్రేక్ చేశాడు. అంతేకాకుండా ఈ క్రమంలో నాలుగో వికెట్‌కు బాబుల్ కుమార్‌తో కలిసి రికార్డు స్థాయిలో 399 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని కూడా నెలకొల్పాడు.
బాబుల్ కుమార్ డబుల్ సెంచరీ
ఇదే మ్యాచ్‌లో మిజోరాంపై షకీబుల్ గనికి తోడుగా మరో బిహార్ ఆటగాడు బాబుల్ కుమార్ డబుల్ సెంచరీతో చెలరేగాడు. మొత్తంగా 398 బంతుల్లో బాబుల్ కుమార్ 229 పరుగులతో అజేయంగా నిలిచాడు. అతని ఇన్నింగ్స్‌లో 27 ఫోర్లు, ఒక సిక్సు ఉన్నాయి. వీరిద్దరికి తోడు చివర్లో వికెట్ కీపర్ బిపిన్ సౌరభ్ 39 బంతుల్లోనే అజేయ హాఫ్ సెంచరీ చేసి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. అతని ఇన్నింగ్స్‌లో 4 ఫోర్లు, 3 సిక్సులు ఉన్నాయి.
భారీ స్కోర్ చేసిన బిహార్
షకీబుల్ గని ట్రిపుల్ సెంచరీ, బాబుల్ కుమార్ డబుల్ సెంచరీతో చెలరేగడంతో తొలి ఇన్నింగ్స్‌లో బిహార్ 5 వికెట్ల నష్టానికి 686 పరుగులు చేసింది. షకీబుల్ గని 341, బాబుల్ కుమార్ 229* పరుగులతో విశ్వరూపం చూపించగా, బిపిన్ సౌరభ్ 50* పరుగులతో రాణించాడు. మిగతా వారిలో ఓపెనర్ యశస్వి 38, లఖన్ రాజా 25 పరుగులు చేశాడు. మంగల్, సచిన్ కుమార్ డకౌట్ అయ్యారు. మిజోరాం బౌలర్లలో ఇక్బాల్ అబ్దుల్లా 2, కోహ్లీ, రెమ్రుతడిక రాల్తే, లాల్బియాక్వేలా తలో వికెట్ తీశారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications