
సర్ఫరాజ్ డబుల్ సెంచరీ
ముంబై, సౌరాష్ట్ర మ్యాచ్‌లో సర్ఫరాజ్ ఖాన్ ముంబై తరఫున బరిలోకి దిగాడు. మూడో వికెట్ పడగానే ఐదో వికెట్‌గా సర్పరాజ్ ఖాన్ క్రీజులో వచ్చాడు. ఈ క్రమంలో వెటరన్ బ్యాటర్ అజింక్యా రహానేతో కలిసి నాలుగో వికెట్‌కు 252 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఈ క్రమంలో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. జట్టు స్కోర్ 296 పరుగుల వద్ద ఉండగా 129 పరుగులు చేసిన రహానే ఔటైనప్పటికీ సర్ఫరాజ్ ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు. డబుల్ సెంచరీ కూడా పూర్తి చేశాడు. సిక్సర్ బాది 250 పరుగులు పూర్తి చేసిన సర్ఫరాజ్‌ఖాన్ ట్రిపుల్ సెంచరీ చేసేలా కనిపించాడు. కానీ 275 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద మన్కడ్ బౌలింగ్‌లో లెగ్‌బైస్‌లో ఎల్బీగా ఔటయ్యాడు. మొత్తంగా 401 బంతులు ఎదుర్కొన్న సర్ఫరాజ్ ఇన్నింగ్స్‌లో 30 ఫోర్లు, 7 సిక్స్‌లు ఉన్నాయి.

ముంబై భారీ స్కోర్
సర్ఫరాజ్ ఖాన్ డబుల్ సెంచరీ, అజింక్యా రహానే సెంచరీ బాదడంతో తొలి ఇన్నింగ్స్‌లో ముంబై భారీ స్కోర్ సాధించింది. 7 వికెట్ల నష్టానికి 544 పరుగుల భారీ స్కోర్ వద్ద ముంబై తమ తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. ఆ జట్టు బ్యాటర్లలో సర్ఫరాజ్ ఖాన్ 275, రహానే 129, తనుష్ కోటియన్ 50, ఆదిత్యా తారే 22, సచిన్ యాదవ్ 19, కులకర్ణి 15, ములాని 12 పరుగులు చేశారు. సౌరాష్ట్ర బౌలర్లలో జానీ, జడేజా రెండేసి వికెట్లు, జయదేవ్ ఉనద్కత్, చేతన్ సకారియా, మన్కడ్ తలో వికెట్ తీశారు.

ఫుల్ ఖుషీగా ఢిల్లీ
సర్ఫరాజ్ ఖాన్ ఈ భారీ డబుల్ సెంచరీతో ఐపీఎల్ 2022 మెగా వేలంలో అతన్ని కొనుగోలు చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ ఫుల్ ఖుషీగా ఉంది. జట్టుతో పాటు అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రానున్న ఐపీఎల్‌లోనూ 22 ఏళ్ల సర్ఫరాజ్ ఖాన్ ఇలాగే చెలరేగాలని వారంతా ఆశిస్తున్నారు. ఐపీఎల్‌లోనూ సర్ఫరాజ్ ఖాన్ ఇలాగే ఆడితే ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఎదురుండదని చెప్పుకోవాలి. కాగా మెగా వేలంలో సర్ఫరాజ్ ఖాన్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ 20 లక్షల రూపాయల బేస్ ప్రైజ్‌కు దక్కించుకుంది. ఐపీఎల్‌లో గతంలో సర్ఫరాజ్ ఖాన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు ప్రాతినిధ్యం వహించాడు.


Click it and Unblock the Notifications












