For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Ranji Trophy 2022: ఓ డ‌బుల్ సెంచ‌రీ, రెండు సెంచ‌రీలు.. టోర్నీ చ‌రిత్ర‌లోనే జార్ఖండ్ భారీ స్కోర్

Ranji Trophy 2022: Jharkhand score 880 runs. The fourth highest score in tournament history

రంజీ ట్రోఫీ 2022లో జార్ఖండ్ జ‌ట్టు చ‌రిత్ర సృష్టించింది. ఫ్రీక్వార్ట‌ర్ ఫైన‌ల్స్‌లో నాగాలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో రికార్డు సృష్టించింది. ఈ మ్యాచ్‌లో జార్ఖండ్ జ‌ట్టు తొలి ఇన్నింగ్స్‌లో రికార్డు స్థాయిలో 880 ప‌రుగుల భారీ స్కోర్ సాధించింది. రంజీ టోర్నీ చ‌రిత్రలో ఇది నాల్గో అత్య‌ధిక స్కోర్ కావ‌డం గ‌మ‌నార్హం. జార్ఖండ్ ఇన్నింగ్స్‌లో 3 సెంచ‌రీలు, 3 హాఫ్ సెంచ‌రీలు న‌మోద‌య్యాయి. ఇందులో ఓ భారీ డ‌బుల్ సెంచ‌రీ, ఓ భారీ సెంచ‌రీ ఉన్నాయి.

అలాగే 11వ నంబ‌ర్‌లో వ‌చ్చిన బ్యాట‌ర్ కూడా 85 ప‌రుగుల భారీ ఇన్నింగ్స్ ఆడ‌డం గ‌మ‌నార్హం. జార్ఖండ్ జ‌ట్టులో కుమార్‌ కుశాగ్రా డ‌బుల్ సెంచ‌రీతో విశ్వ‌రూపం చూపించాడు. 270 బంతుల్లోనే 266 ప‌రుగుల‌తో విరుచుకుప‌డ్డాడు. కుశాగ్రా ఈ విధ్వంస‌క‌ర ఇన్నింగ్స్‌లో 37 ఫోర్లు, 2 సిక్సులు ఉన్నాయి.

మిగ‌తా వారిలో నదీమ్ 177 (22 ఫోర్లు, 2సిక్సర్లు), విరాట్‌ సింగ్ 107 (13 ఫోర్లు) సెంచ‌రీల‌తో చెల‌రేగారు. కుమార్‌ సూరజ్ 69 (11 ఫోర్లు, సిక్స్‌), అంకుల్‌ రాయ్ 59 ( 7 ఫోర్లు), రాహుల్‌ శుక్లా 85 నాటౌట్ ( 7 ఫోర్లు, 6 సిక్సర్లు)లు అర్ధ సెంచరీలతో రాణించారు. రాహుల్ శుక్లా 11వ నెంబ‌ర్‌లో వ‌చ్చి 85 ప‌రుగులు చేయ‌డం గ‌మ‌నార్హం. మొత్తంగా జార్ఖండ్ 880 ప‌రుగుల‌కు ఆలౌటైంది. అనంత‌రం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన నాగాలాండ్ మూడో రోజు ఆట ముగిసే స‌మ‌యానికి 4 వికెట్ల న‌ష్టానికి 130 ప‌రుగులు చేసింది.

Rishabh Pant First Indian Wicketkeeper To Win “Man Of The Series” In Test | Oneindia Telugu

కాగా రంజీ టోర్నీలో అత్య‌ధిక స్కోర్ సాధించిన రికార్డు హైద‌రాబాద్ జ‌ట్టు పేరు మీద‌నే ఉంది. 1993-94 సీజ‌న‌ల్లో ఆంధ్రా జ‌ట్టుపై హైద‌రాబాద్ జ‌ట్టు 944/6 డిక్లేర్డ్ ప‌రుగుల భారీ స్కోర్ సాధించింది. ఆ త‌ర్వాత రెండో అత్య‌ధిక స్కోర్ త‌మిళ‌నాడు పేరు మీద ఉంది. 1988-89 సీజ‌న్‌లో త‌మిళ‌నాడు జ‌ట్టు గోవాపై 912-6 డిక్లేర్డ్ ప‌రుగుల భారీ స్కోర్ సాధించింది. ఇక మూడో అత్య‌ధిక స్కోర్ మ‌ధ్య‌ప్ర‌దేశ్ పేరు మీద ఉంది. మ‌ధ్యప్ర‌దేశ్ జ‌ట్టు 1945-46 సీజ‌న్లో క‌ర్ణాట‌క‌పై 912-8 డిక్లేర్డ్ స్కోర్ చేసింది.

Story first published: Tuesday, March 15, 2022, 7:58 [IST]
Other articles published on Mar 15, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+