Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఫామ్‌లోకి పృథ్వీ షా: బరోడాపై సెంచరీ, మూడో ఓపెనర్‌గా అవకాశం!

Ranji Trophy 2019-20: Prithvi Shaw hits 1st hundred since comeback from doping ban


హైదరాబాద్: నిషేధం తర్వాత దేశవాళీ క్రికెట్‌లో పృథ్వీ షా తన అరంగేట్రాన్ని ఘనంగా చాటాడు. డోప్ టెస్టులో విఫలం కావడంతో బీసీసీఐ పృథ్వీ షాపై ఎనిమిది నెలల సస్పెన్షన్‌ విధించిన సంగతి తెలిసిందే. నిషేధం ముగియడంతో ఇటీవలే ప్రారంభమైన రంజీ మ్యాచ్‌లో ముంబై జట్టు తరుపున చోటు దక్కించుకున్నాడు.

బరోడాతో జరిగిన తొలి ఇన్నింగ్స్‌లో 62 బంతుల్లో 66 పరుగులు చేసిన పృథ్వీ షా, రెండో ఇన్నింగ్స్‌లో కేవలం 84 బంతుల్లో సెంచరీ సాధించాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో పృథ్వీ షాకు ఇది 9వ సెంచరీ కావడం విశేషం. బరోడా బౌలింగ్‌ను సమర్ధవంతగా ఎదుర్కొన్న పృథ్వీ షా ఇన్నింగ్స్‌లో 12 బౌండరీలు, నాలుగు సిక్సర్లు ఉన్నాయి.

మూడో రోజు లంచ్ విరామానికి

మూడో రోజు లంచ్ విరామానికి

దీంతో మూడో రోజు లంచ్ విరామానికి పృథ్వీ షా 122 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఈ సెంచరీతో వచ్చే ఏడాది న్యూజిలాండ్‌తో జరగనున్న టెస్టు సిరిస్‌లో మూడో టెస్టు ఓపెనర్‌గా తాను ఉన్నట్లు సెలక్టర్లు తెలియజేశాడు. బరోడా తొలి ఇన్నింగ్స్‌లో 307 పరుగులకే ఆలౌట్ కావడంతో ముంబై 124 పరుగుల ఆధిక్యం సాధించింది.

ఒకే ఒక్క వికెట్ కోల్పోయిన ముంబై

ఒకే ఒక్క వికెట్ కోల్పోయిన ముంబై

మూడో రోజైన మంగళవారం తొలి సెషన్‌లో ముంబై ఒకే ఒక్క వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత పృథ్వీ షా సెంచరీతో చెలరేగడంతో లంచ్ విరామానికి 314 పరుగుల ఆధిక్యంలోనికి దూసుకెళ్లింది. ఇటీవలే తన 20వ పుట్టినరోజు నాడు తన ట్విట్టర్‌లో ప్రపంచ క్రికెట్‌లో కొత్త పృథ్వీ షాను చూస్తారని ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే.

ముస్తాక్ అలీ ట్రోఫీలో సైతం

ముస్తాక్ అలీ ట్రోఫీలో సైతం

రంజీ ట్రోఫీకి ముందు జరిగిన సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో సైతం పృథ్వీ షా మెరుపులు మెరిపించాడు. గతేడాది వెస్టిండిస్‌తో జరిగిన టెస్టు సిరిస్‌లో అంతర్జాతీయ టెస్టు అరంగేట్రం చేసిన పృథ్వీ షా తన తొలి టెస్టులోనే సెంచరీ సాధించాడు. ఇక, రెండో టెస్టులో హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. ఆ తర్వాత ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపికయ్యాడు.

గతేడాది ఆసీస్ పర్యటనలో గాయపడ్డ షా

గతేడాది ఆసీస్ పర్యటనలో గాయపడ్డ షా

అయితే, ఆసీస్ పర్యటనలో భాగంగా జరిగిన వార్మప్ మ్యాచ్‌లో పృథ్వీ షా కాలికి గాయమైంది. దీంతో అతడు ఆ సిరిస్ నుంచి అర్ధాంతరంగా తప్పుకుని స్వదేశానికి తిరిగొచ్చాడు. దీంతో అతడి స్థానంలో టెస్టు జట్టులో చోటు దక్కించుకున్న మయాంక్ అగర్వాల్ రాణించడంతో భారత టెస్టు జట్టులో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు.

మయాంక్ అగర్వాల్ సెంచరీలు

మయాంక్ అగర్వాల్ సెంచరీలు

ఇటీవలే దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్‌లతో ముగిసిన టెస్టు సిరిస్‌ల్లో మయాంక్ అగర్వాల్ సెంచరీలతో చెలరేగడంతో టెస్టు జట్టులో తన స్థానానికి ఢోకా లేకపోయింది. ఇక, దక్షిణాఫ్రికా సిరిస్‌తో రోహిత్ శర్మను ఓపెనర్‌గా జట్టు మేనేజ్‌మెంట్ పరీక్షించగా అతడు కూడా విజయవంతమయ్యాడు. దీంతో పృథ్వీ షాని మూడో ఓపెనర్‌గా టీమిండియా రిజర్వ్‌లో పెట్టుకునే అవకాశం కలిగింది.

Story first published: Wednesday, December 11, 2019, 15:57 [IST]
Other articles published on Dec 11, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+