న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

రంజీ ట్రోఫీ: ముంబైతో మ్యాచ్, మైదానంలోకి హార్ధిక్ పాండ్యా

Ranji Trophy 2018: Hardik Pandya named in Baroda squad for game against Mumbai

హైదరాబాద్: గాయం కారణంగా ఆస్ట్రేలియాతో ప్రస్తుతం జరుగుతోన్న నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌కు దూరమైన టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా మళ్లీ క్రికెట్ మైదానంలోకి అడుగుపెడుతున్నాడు. గ్రూప్-ఏలో భాగంగా ముంబైతో డిసెంబర్ 14న జరిగే రంజీట్రోఫీ మ్యాచ్‌ కోసం బరోడా జట్టు అతన్ని జట్టులోకి ఎంపిక చేసింది.

<strong>కోహ్లీదే అగ్రస్థానం, తొలి న్యూజిలాండ్ క్రికెటర్‌గా కేన్ విలియమ్సన్</strong>కోహ్లీదే అగ్రస్థానం, తొలి న్యూజిలాండ్ క్రికెటర్‌గా కేన్ విలియమ్సన్

ఈ మేరకు బరోడా ఇన్‌చార్జ్ కార్యదర్శి స్నేహల్ పారిక్ సోమవారం పాండ్యా ఎంపికను ధృవీకరించారు. దుబాయి వేదికగా జరిగిన ఆసియాకప్ టోర్నీలో పాండ్యా వెన్నుకు గాయం కావడంతో తీవ్రమైన నొప్పితో కుప్పకూలగా అతడిని స్ట్రెచర్‌పై బయటకు తరలించిన సంగతి తెలిసిందే.

ఆసీస్ పర్యటనకు దూరమైన పాండ్యా

ఆసీస్ పర్యటనకు దూరమైన పాండ్యా

ఈ నేపథ్యంలో పాండ్యాను ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపిక చేయలేదు. అనంతరం వైద్యుల చికిత్సతో కోలుకున్న హార్దిక్ పాండ్యా బీసీసీఐ సూచన మేరకు తన ఫిట్‌నెస్‌ను మరితంగా మెరుగుపరుచుకునేందుకు బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీకి వెళ్లాడు. తాజాగా పాండ్యా ఫిట్‌నెస్ సాధించడంతో దేశవాళీ క్రికెట్‌తో మళ్లీ బరిలోకి దిగనున్నాడు.

 బరోడా జట్టులో పాండ్యా

బరోడా జట్టులో పాండ్యా

బరోడా ప్రకటించిన 15 మంది జట్టు సభ్యుల్లో హార్ధిక్ పాండ్యాతో పాటు మాజీ ఆల్ రౌండర్ యూసఫ్ పఠాన్ కూడా ఉన్నాడు. ఈ జట్టుకు కెప్టెన్‌గా కేదార్ దేవధర్ వ్యవహారించనున్నాడు. ఈ సీజన్‌లో బరోడా జట్టు మొత్తం ఐదు గేమ్‌లు ఆడగా ఇందులో మూడు గేములను డ్రా చేసుకుంది.

13 పాయింట్లతో ఐదో స్థానంలో బరోడా జట్టు

13 పాయింట్లతో ఐదో స్థానంలో బరోడా జట్టు

మరో గేమ్‌లో విజయం సాధించగా, మరో ఓటమిపాలైంది. గ్రూప్-ఏ, బీ స్టాండింగ్స్‌లో బరోడా జట్టు 13 పాయింట్లతో ఐదో స్థానంలో కొనసాగుతోంది. రంజీ క్రికెట్‌లో 41 సార్లు ఛాంపియన్స్‌గా నిలిచిన ముంబై జట్టు 5 పాయింట్లతో 16వ స్థానంలో కొనసాగుతోంది.

 బరోడా జట్టు:

బరోడా జట్టు:

Kedar Devdhar (Captain), Aditya Waghmode, Vishnu Solanki (Vice Captain), Yusuf Pathan, Swapnil Singh, Bhargav Bhatt, Soeb Tai, Rishi Arothe, Lukman Meriwala, Shivalik Sharma, Mitesh Patel (wicket-keeper), Dhiren Mistry, Soyeb Soparia, Pratyush Kumar and Hardik Pandya.

Story first published: Tuesday, December 11, 2018, 16:28 [IST]
Other articles published on Dec 11, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X