For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

రెచ్చగొట్టిన పాండే: తదుపరి బంతిని సిక్స్ బాదిన పుజారా (వీడియో )

Manish Pandey Tries To Sledge Cheteshwar Pujara | Oneindia Telugu
Ranji Trophy 2018-19: Manish Pandey tries to sledge Cheteshwar Pujara; latter hits a six to give a fitting response

హైదరాబాద్: బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో కర్ణాటక-సౌరాష్ట్ర జట్ల మధ్య జరుగుతోన్న రంజీ మ్యాచ్‌లో కర్ణాటక బ్యాట్స్‌మన్ మనీష్ పాండే స్లెడ్జింగ్‌కు పాల్పడ్డాడు. ఈ క్రమంలో క్రీజులో ఉన్న సౌరాష్ట్ర బ్యాట్స్‌‌మన్ పుజారాను మనీష్ పాండే రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు.

స్లిప్‌లో నిలబడిన పాండే.. బౌలర్ శ్రేయస్ గోపాల్‌ను ఎంకరేజ్ చేస్తూ "ఒక్క చెత్త షాట్ చాలు.. అతడు ఔటవుతాడంటూ" పుజారాను స్లెడ్జింగ్ చేసేందుకు ప్రయత్నించాడు. పాండే వ్యాఖ్యలకు పుజారా తన బ్యాట్‌తో బదులిచ్చాడు. తదుపరి బంతిని సిక్స్‌గా మలిచి పాండే నోరు మూయించాడు.

ఈ ఘటన ఇన్నింగ్స్ 47వ ఓవర్లో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. నిజానికి అంతకు ముందే అంపైర్ పుణ్యమా అని పుజారా బతికిపోయాడు. పుజారా ఒక్క పరుగు వద్ద ఉండగా.. బంతి బ్యాట్ అంచును తాకుతూ కీపర్ చేతుల్లోకి వెళ్లింది.

అయితే, అంపైర్ దానిని నాటౌట్‌ గా ప్రకటించాడు. దీంతో వచ్చిన లైఫ్‌ను సద్వినియోగం చేసుకున్న పుజారా నిదానంగా ఆడుతూ క్రీజులో పాతుకుపోయే ప్రయత్నం చేశాడు. ఈ మ్యాచ్‌లో పుజారా 45 పరుగుల వద్ద ఔటయ్యాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కర్ణాటక 275 పరుగులు చేసి ఆలౌటైంది.

అనంతరం సౌరాష్ట్ర 66.3 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 227 పరుగులు చేసింది. కర్ణాటక ఇన్నింగ్స్‌లో మనీష్ పాండే (62), శ్రేయస్ గోపాల్ (87), శరత్ (83 నాటౌట్) రాణించారు.

Story first published: Saturday, January 26, 2019, 8:48 [IST]
Other articles published on Jan 26, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+