న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆస్ట్రేలియా పర్యటనకు ముందు షమీకి బీసీసీఐ షరతులు

Ranji Trophy 2018-19: BCCI tells Bengals Mohammed Shami to bowl only 15-17 overs an innings to reduce workload

హైదరాబాద్: మరి కొద్ది రోజుల్లో ఆరంభం కానున్న ఆస్ట్రేలియా పర్యటనకు ముందు భారత ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ షరతులు ఉంచింది భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ). మొహ్మద్ షమీ ప్రస్తుతం జరుగుతోన్ రంజీ ట్రోఫీలో బెంగాల్ తరఫున ఆడుతున్నాడు. ఈ క్రమంలో కేరళతో ఆ జట్టు మంగళవారం నుంచి కోల్‌కతా వేదికగా మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్‌లో మొహమ్మద్ షమీని ఇన్నింగ్స్‌కు 15 ఓవర్లకి మించి బౌలింగ్ చేయించవద్దంటూ బెంగాల్ జట్టుకు బీసీసీఐ ఆదేశాలు జారీ చేసింది.

దీంతో.. మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి షమీ మొత్తం 30 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేసే అవకాశం ఉంది. ఆస్ట్రేలియా పర్యటనకి అలసిపోకుండా ఉండేందుకే బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. నాలుగు టెస్టుల సిరీస్‌లో భాగంగా భారత్ జట్టు డిసెంబరు 6 నుంచి ఆస్ట్రేలియా జట్టుతో తలపడనుంది.

ఈ క్రమంలో ఆస్ట్రేలియా గడ్డపై షమీ భారత్ ప్రధాన అస్త్రంగా భావిస్తున్న బీసీసీఐ.. అతడికి రంజీల ద్వారా ప్రాక్టీస్‌కి అవకాశం కల్పిస్తూనే తగినంత విశ్రాంతిని కూడా ఇవ్వాలని యోచిస్తోంది. ఈ ఏడాది టెస్టుల్లో నిలకడగా రాణిస్తున్న మొహ్మద్ షమీ.. 2018లో అత్యధిక టెస్టు వికెట్లు తీసిన భారత బౌలర్‌గా కొనసాగుతున్నాడు. దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్, వెస్టిండీస్‌పై ఈ ఏడాది మొత్తం 9 టెస్టులాడిన ఈ పేసర్ ఇప్పటికే 33 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు.

ఆస్ట్రేలియా గడ్డపై నవంబరు 21 నుంచి 3 టీ20లు, 4 టెస్టులు, 3 వన్డేల సుదీర్ఘ సిరీస్‌ని ఆడనున్న భారత్ జట్టు ఇప్పటికే అక్కడికి చేరుకుంది.

Story first published: Sunday, November 18, 2018, 9:46 [IST]
Other articles published on Nov 18, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X