Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

5 మ్యాచ్‌ల్లో 4 సెంచరీలు: సచిన్ రికార్డుకి చేరువలో, ఎవరీ పృథ్వీ షా

హైదరాబాద్: రంజీ టోర్నీలో ముంబై జట్టు యువ ఆటగాడు పృథ్వీ షా సంచలనాలు నమోదు చేస్తున్నాడు. త్వరలో టీమిండియాలో చోటు దక్కించుకున్న ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ తరహాలోనే చిన్న వయసులోనే సెంచరీల మోత మోగిస్తున్న పృథ్వీ షా.. ఐదు ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో నాలుగు సెంచరీలు సాధించాడు.

17 ఏళ్ల పృథ్వీ షా బుధవారం భువనేశ్వర్‌లో ఒడిశాతో జరిగిన రంజీ మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగాడు. ఓపెనర్‌గా బరిలోకి దిగిన పృథ్వీ షా 153 బంతుల్లో 105 పరుగులు చేసి బసంత్‌ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. ఒడిశాపై 68.63 స్ట్రయిక్ రేట్‌తో పరుగులు చేసిన షా.. 18 బౌండరీలు బాదాడు.

Prithvi Shaw slams fourth first-class ton in five matches

దీంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి ముంబై 6 వికెట్ల నష్టానికి 264 పరుగులు చేసింది. రంజీల్లో సచిన్ టెండూల్కర్ నెలకొల్పిన ఓ రికార్డుకు పృథ్వీ షా రెండు సెంచరీల దూరంలో ఉన్నాడు. 18 ఏళ్లు వచ్చే సరికి అత్యధిక సెంచరీలు సాధించిన భారత క్రికెటర్ల జాబితాలో సచిన్ (7) ముందు వరుసలో ఉండగా.. పృథ్వీ షా (5) సెంచరీలతో రెండో స్ధానంలో ఉన్నాడు.

దీంతో మరో రెండు సెంచరీలు సాధిస్తే పృథ్వీ షా సచిన్ రికార్డుని సమం చేస్తాడు. ఈ ఏడాది పృథ్వీ ఆడిన ఐదు ఫస్ట్‌ క్లాస్‌ మ్యాచుల్లో 4 సెంచరీలు (4, 120, 71, 44, 154, 31, 123, 5, 105) నమోదు చేశాడు. నాలుగు సెంచరీల్లో మొదటి మూడు రెండో ఇన్నింగ్స్‌లో చేసినవే. దులీప్‌ ట్రోఫీలో మరొక సెంచరీని సాధించాడు.

దీంతో మొత్తం ఐదు సెంచరీలు సాధించాడు. నవంబరు 9న పృథ్వీ 18వ పుట్టిన రోజు జరుపుకోనున్నాడు. ఇటీవల న్యూజిలాండ్‌తో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్‌లో బోర్డ్ ఎలెవన్ తరఫున ఓపెనర్‌గా బరిలో దిగిన పృథ్వీ షా... బౌల్ట్ లాంటి పేసర్లు దీటుగా ఎదుర్కొని 66 పరుగులు సాధించాడు. బంతి స్వింగ్ అవుతున్నా ఏ మాత్రం తడబడకుండా షా ఆడాడు. మ్యాచ్ అనంతరం షా వయసు 17 ఏళ్లేనని తెలుసుకున్న కివీస్ పేసర్ బౌల్ట్ అతడిని అభినందించాడు.

Prithvi Shaw slams fourth first-class ton in five matches

సచిన్ రికార్డుని బద్దలు కొట్టిన పృథ్వీ షా
దులీప్ ట్రోఫీ ఫైనల్లో సెంచరీ సాధించిన పిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించాడు. ఈ రికార్డు ఇంతకుముందు క్రికెట్ లెజెండ్ సచిన్‌ టెండూల్కర్‌ పేరిట ఉండడం విశేషం. దీంతో క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ తర్వాత ఈ ట్రోఫీ అరంగేట్రంలోనే సెంచరీ సాధించిన పిన్న వయస్కుడిగా షా అరుదైన ఘనత సాధించాడు.

ఈ ఏడాది ఆరంభంలో రంజీల్లోకి అడుగుపెట్టిన పృథ్వీ షా 17 ఏళ్ల 57 రోజుల వయసులో తాను ఆడిన తొలి రంజీ మ్యాచ్‌లోనే సెంచరీ సాధించాడు. హారిస్ షీల్డ్‌లో భాగంగా రిజ్వీ స్ప్రింగ్ ఫీల్డ్ స్కూల్ తరఫున బరిలో దిగిన షా 14 ఏళ్ల వయసులో సెయింట్ ఫ్రాన్సిస్ స్కూల్‌పై ఈ రికార్డు నెలకొల్పాడు. గతంలో సచిన్ కూడా ఇదే టోర్నీ ద్వారా వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే.

Story first published: Monday, November 13, 2017, 12:18 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+