
హైదరాబాద్: తాడిని తన్నే వాడుంటే వాడి తలను వాడున్నట్లు 41సార్లు రంజీ ట్రోఫీని గెలుచుకున్న ముంబైకి ఈ సారి అదే పరిస్థితి ఎదురైంది. ప్రతిసారి ట్రోఫీని గెలుచుకుంటున్న ముంబై కర్ణాటక దెబ్బకు క్వార్టర్ ఫైనల్‌లోనే తోక ముడవక తప్పలేదు. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో కర్ణాటక అదరగొట్టింది. కర్ణాటక ఇన్నింగ్స్ 20 పరుగుల తేడాతో ముంబైని చిత్తు చేసి సెమీఫైనల్లో దూసుకెళ్లింది. ఓవర్‌నైట్ స్కోరు 120/3తో ఆదివారం నాలుగోరోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ముంబైని సూర్యకుమార్ యాదవ్ (108) సెంచరీతో నడిపించాడు.

శతకం అనంతరం సూర్యకుమార్ ఔటైనా.. సిద్దేశ్ లాడ్ (31), శివమ్ దూబె (71) పోరాడారు. అయితే గౌతమ్ (6/104) క్రమం తప్పకుండా వికెట్లు తీసి ముంబై కథని ముగించాడు. అయినా ఇన్నింగ్స్ ఓటమి నుంచి తప్పించుకోవడానికి ఆ జట్టు తీవ్రంగా ప్రయత్నించింది. చివరికి 377 పరుగులకు ఆలౌటై మ్యాచ్‌ను నీరుగార్చింది. గౌతమ్‌తో పాటు వినయ్‌కుమార్ (2/44) రాణించాడు. ముంబయి తొలి ఇన్నింగ్స్‌లో 173 పరుగులకే ఆలౌట్ కాగా.. కర్ణాటక 570 పరుగుల భారీ స్కోరు చేసింది.
ఇతర క్వార్టర్స్ (సంక్షిప్త స్కోర్లు): * మధ్యప్రదేశ్ తొలి ఇన్నింగ్స్: 338; దిల్లీ తొలి ఇన్నింగ్స్: 405; మధ్యప్రదేశ్ రెండో ఇన్నింగ్స్: 283 ఆలౌట్ (హర్‌ప్రీత్‌సింగ్ 78; వికాశ్ మిశ్ర 4/59, తోకస్ 3/64) దిల్లీ రెండో ఇన్నింగ్స్: 8/0; * బెంగాల్ తొలి ఇన్నింగ్స్: 354; గుజరాత్ తొలి ఇన్నింగ్స్: 224; బెంగాల్ రెండో ఇన్నింగ్స్: 483/4 (వృతిక్ ఛటర్జీ 213 బ్యాటింగ్, మనోజ్ తివారి 59) * విదర్భ తొలి ఇన్నింగ్స్: 246; కేరళ తొలి ఇన్నింగ్స్: 176; విదర్భ రెండో ఇన్నింగ్స్: 431/6 (ఫజల్ 119, వసీం జాఫర్ 58, గణేశ్ సతీష్ 65, అపూర్వ్ వాంఖడె 107)
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.