
హైదరాబాద్: ఫైనల్లోకి ప్రవేశించడానికి ఢిల్లీకి పదేళ్లు పట్టింది. గౌతమ్ గంభీర్ సారథిగా వ్యవహరిస్తోన్న ఢిల్లీ జట్టు రంజీ ట్రోఫీ ఫైనల్లో ప్రవేశించింది. సెమీస్‌లో ఆ జట్టు ఇన్నింగ్స్ 26 పరుగుల తేడాతో బెంగాల్‌ను చిత్తు చేసింది. ఓవర్‌నైట్ స్కోరు 271/3తో మంగళవారం మూడోరోజు తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగించింది. 398 పరుగులకు ఆలౌటైన ఢిల్లీ జట్టు మూడో రోజుతో బ్యాటింగ్‌ను ముగించింది.
హిమ్మత్‌సింగ్ (60), మనన్‌శర్మ (34) రాణించారు. మహ్మద్ షమి (6/122) ఆకట్టుకున్నాడు. బదులుగా రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన బెంగాల్‌ను నవదీప్ సైని (4/35), ఖిజ్రోలియా (4/40) కుప్పకూల్చారు. వీరి ధాటికి ఆ జట్టు 86 పరుగులకే కుప్పకూలింది. బెంగాల్ తొలి ఇన్నింగ్స్‌లో 286 పరుగులకు ఆలౌటైంది.
కర్ణాటకతో విదర్భ తలపడుతున్న మ్యాచ్‌లో కర్ణాటక ఓడిపోతుంది. కర్ణాటకతో సెమీస్‌లో విదర్భ తలమునకలై పోరాడుతోంది. రెండో ఇన్నింగ్స్‌లో 62 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన విదర్భను గణేశ్ సతీష్ (71 బ్యాటింగ్), వసీం జాఫర్ (33) ఆదుకున్నారు. ఈ జోడీ నాలుగో వికెట్‌కు 88 పరుగులు జత చేసింది. జాఫర్ ఔటైనా.. వాంఖడే (49)తో కలిసి సతీష్ ఇన్నింగ్స్‌ను నడిపించాడు. ఆట ఆఖరికి ఆ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 4 వికెట్లకు 195 పరుగులు చేసింది. సతీష్‌తో పాటు వాద్కర్ (19) క్రీజులో ఉన్నాడు.
ఇప్పటికే విదర్భ 79 పరుగుల ఆధిక్యంలో ఉంది. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 294/8తో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన కర్ణాటక.. 301 పరుగుకు ఆలౌటైంది. కరుణ్ నాయర్ 153 పరుగులు చేసి ఔటయ్యాడు. విదర్భ తొలి ఇన్నింగ్స్‌లో 185 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.