పుట్టినరోజు నాడు ట్రిపుల్ సెంచరీ: మూడో క్రికెటర్‌గా రికార్డు
హైదరాబాద్: శుక్రవారం ప్రారంభమైన రంజీ టోర్నమెంట్‌లో హిమాచల్ ప్రదేశ్ జట్టు ఓపెనర్ ప్రశాంత్ చోప్రా సరికొత్త రికార్డుని నెలొకల్పాడు. రంజీ మ్యాచ్ తొలిరోజు అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. పంజాప్‌పై అతడు ఈ రికార్డుని నమోదు చేశాడు.
శుక్రవారం ఆట ముగిసే సమయానికి ప్రశాంత్ చోప్రా 271 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. 289 బంతులెదుర్కొన్న ప్రశాంత్ 37 ఫోర్లు, ఓ సిక్సర్‌తో ఈ స్కోరు సాధించాడు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో ఓ భారత బ్యాట్స్‌మన్ ఒక్క రోజులో సాధించిన రెండో అత్యధిక స్కోరు ఇదే కావడం విశేషం.

6 పరుగుల తేడాతో రికార్డు మిస్
మహారాష్ట్రకు చెందిన బీబీ నింబాల్కర్ (277) పేరిట ఉన్న రంజీ రికార్డుకు ప్రశాంత్ చోప్రా కేవలం 6 పరుగుల తేడాతో మిస్సయ్యాడు. 1948/49లో జరిగిన రంజీ ట్రోఫీలో నింబాల్కర్ ఈ రికార్డుని నెలకొల్పాడు. ఛటేశ్వర్ పుజారా కూడా 2012/13లో జరిగిన రంజీ సీజన్‌లో సౌరాష్ట్ర తరుపున తొలి రోజు 261 పరుగులు నమోదు చేశాడు.

318 బంతుల్లో 40 ఫోర్లు, ఒక సిక్స్‌తో 300 పరుగులు
దీంతో తొలిరోజు ఆట ముగిసే సమయానికి హిమాచల్ ప్రదేశ్ 2 వికెట్లు కోల్పోయి 459 పరుగులు చేసింది. ఇక 271 పరుగుల నాటౌట్‌తో శనివారం బరిలోకి దిగిన ప్రశాంత్ చోప్రా రెండో రోజు కూడా అదే జోరుని ప్రదర్శించాడు. దీంతో అతడు 318 బంతుల్లో 40 ఫోర్లు, ఒక సిక్స్‌తో 300 పరుగులు నమోదు చేశాడు.

శనివారం 25వ పుట్టిన రోజుని జరుపుకున్న ప్రశాంత్
అయితే ఈరోజుకి ప్రశాంత్ చోప్రా జీవితంలో ఎంతో ప్రత్యేకత ఉంది. ఈరోజు ప్రశాంత్ 25వ పుట్టిన రోజు. 118.2వ ఓవర్లో పంజాబ్ బౌలర్ ప్రగత్ సింగ్ వేసిన బంతికి ప్రశాంత్ చోప్రా అవుటయ్యాడు. దీంతో 363 బంతుల్లో 44 ఫోర్లు, 2 సిక్సులతో 338 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ప్రశాంత్ పెవిలియన్‌కు చేరాడు. ప్రశాంత్ యావరేజి 93.11గా ఉండటం విశేషం.

పుట్టినరోజు నాడు ట్రిపుల్ సెంచరీ చేసిన మూడో క్రికెటర్
దీంతో ప్రపంచంలో పుట్టినరోజు నాడు ట్రిపుల్ సెంచరీ సాధించిన మూడో క్రికెటర్‌గా ప్రశాంత్ చోప్రా అరుదైన గుర్తింపు సాధించాడు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో ప్రశాంత్‌కిదే తొలి ట్రిపుల్ సెంచరీ. 1962లో ఇంగ్లాండ్‌కు చెందిన కొలిన్ కౌడ్రీ ఈ ఘనత సాధించగా, ఆ తర్వాత 1995లో రామన్ లాంబా ఈ ఘనత సాధించాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications