హైదరాబాద్: రంజీ ట్రోఫీలో భాగంగా గ్రూప్ డి మ్యాచ్‌లో హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన క్రికెటర్ పంకజ్ జైశ్వాల్ చరిత్ర సృష్టించాడు. గోవా, హిమాచల్‌ప్రదేశ్ జట్ల మధ్య సోమవారం ధర్మశాల వేదికగా రంజీ మ్యాచ్ ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో జైశ్వాల్ 16 బంతుల్లోనే హాఫ్ సెంచరీని సాధించాడు.
తద్వారా భారత్‌లో ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో అత్యంత వేగంగా హాఫ్ సెంచరీని నమోదు చేసిన రెండో ఆటగాడిగా పంకజ్ జైశ్వాల్ రికార్డు సృష్టించాడు. తొలి ఇన్నింగ్స్‌లో పంకజ్ జైశ్వాల్ 20 బంతుల్లో 7 సిక్సులు, 4 ఫోర్ల సాయంతో 63 పరుగులు చేశాడు. దీంతో పంకజ్ స్ట్రయిక్ రేట్ 315గా ఉంది.

కాగా, ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 2015లో జమ్మూ కాశ్మీర్‌కు చెందిన బన్‌దీప్ సింగ్ 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీని సాధించాడు. త్రిపురపై జరిగిన మ్యాచ్‌లో బన్‌దీప్ ఈ ఘనతను సాధించాడు. ఇక భారత్ తరుపున అత్యంత వేగంగా సెంచరీ సాధించిన ఆటగాళ్ల జాబితాలో యువరాజ్ ముందున్నాడు.
ఇంగ్లాండ్‌తో జరిగిన ఐసీసీ వరల్డ్ టీ20 మ్యాచ్‌లో 12 బంతుల్లో యువీ హాఫ్ సెంచరీని సాధించాడు. ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్‌లో హిమాచల్ ప్రదేశ్ తన తొలి ఇన్నింగ్స్‌ను 625/7 వద్ద డిక్లేర్ చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన గోవా తొలి ఇన్నింగ్స్‌లో 255 పరుగులకే కుప్పకూలింది. ప్రస్తుతం గోవా రెండో ఇన్నింగ్స్ ఆడుతోంది.