ఓ మ్యాచ్ లో సెంచరీ బాదితే, ఆ క్రికెటర్ కు కచ్చితంగా తదుపరి మ్యాచ్ లో అవకాశం దక్కే ఛాన్స్ ఉంటుంది. కానీ ఓ ఆటగాడికి మాత్రం అలా జరగలేదు. అతడు సీనియర్ క్రికెటర్ కోసం తన స్థానాన్ని త్యాగం చేయాల్సి వచ్చింది. అదీనూ టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కోసం.
త్యాగం చేసింది ఎవరంటే
రంజీ ట్రోఫీలో భాగంగా జమ్మూకశ్మీర్- ముంబయి మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో ముంబయి జట్టు తరఫున ఓపెనర్ గా కెప్టెన్ రోహిత్ శర్మ బరిలోకి దిగాడు. అతడితో పాటు భారత యంగ్ బ్యాటర్ యశస్వి జైస్వాల్ ఈ జట్టుకే ప్రాతినిథ్యం వహించాడు. రహానె కెప్టెన్సీలో వీరిద్దరు బరిలోకి దిగారు.

ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో వీరిద్దరూ రాణించలేకపోయినప్పటికీ రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం పర్వాలేదనిపించారు. ఈ క్రమంలోనే రోహిత్ కోసం తన ఓపెనింగ్ స్థానాన్ని 17 ఏళ్ల దేశవాళీ క్రికెటర్ ఆయుష్ వదులుకోవాల్సి వచ్చింది. దీంతో బెంచ్‌కే పరిమితమయ్యాడు. అయితే తాజాగా ఈ విషయంపై మాట్లాడిన ఆయుష్.. రోహిత్ కోసం ఇష్టంతోనే స్థానం వదులుకున్నట్లు తెలిపాడు.
ఎన్నో విషయాను నేర్చుకుని...
"రోహిత్ శర్మ ఆటను చూస్తూ పెరిగాను. టీవీల్లో అతడి బ్యాటింగ్ ఎంజాయ్ చూశా. ఇప్పుడు డ్రెస్సింగ్ రూమ్‌ను షేర్ చేసుకున్నాడు. ఇది చాలా ఆనందంగా ఉంది. నా మెంటార్ తో ఉండటం ఓ ప్రత్యేకమైన అనుభూతి. ఎన్నో విషయాలను నేర్చుకుని ముందుకు వెళ్తాను" అని ఆయుష్ అన్నాడు.
ఆయుష్ కెరీర్ రికార్డ్స్
ఆయుష్ కెరీర్ లో ఇప్పటి వరకు 6 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లను ఆడాడు. గతేడాది అక్టోబర్ లో ముంబయి జట్టు తరఫున ఫస్ట్ క్లాస్ క్రికెట్ లోకి అరంగేట్రం చేశాడు. రెండు శతకాలు, ఓ అర్ధ శతకం, ఓ ట్రిపుల్ సెంచరీ కూడా ఉన్నాయి. విజయ్ హజారే ట్రోఫీలో 135.50 స్ట్రైక్ రేట్ తో, 65.42 యావరేజ్ తో 458 పరుగులు చేశాడు.