Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Ranji Trophy: 12th ఫెయిల్ డైరక్టర్ కొడుకు సెంచరీల మోత

ఐపీఎస్‌ అధికారి మనోజ్‌ కుమార్‌ శర్మ నిజజీవిత ఆధారంగా బాలీవుడ్‌లో తెరకెక్కిన సినిమా '12th ఫెయిల్'. విక్రాంత్ మాస్సే,మేధా శంకర్ ప్రధానపాత్రల్లో నటించిన ఈ చిత్రానికి విధు వినోద్ చోప్రా దర్శకత్వం వహించాడు. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి విశేషాదరణ లభించింది. ఫిల్మ్‌ఫేర్‌ అవార్డ్స్‌ -2024లో ఉత్తమ చిత్రంతో సహా ఏకంగా అయిదు అవార్డులను సొంతం చేసుకుంది. ఉత్తమ దర్శకుడిగా విధు వినోద్‌ చోప్రా, ఉత్తమ నటుడు (క్రిటిక్స్‌) విక్రాంత్‌ మాస్సే, ఉత్తమ ఎడిటింగ్‌, ఉత్తమ స్క్రీన్‌ప్లే అవార్డులను గెలుచుకుంది.

అయితే డైరెక్టర్ విధు వినోద్ చోప్రా కుమారుడు అగ్నిదేవ్ చోప్రా వార్తల్లోకెక్కాడు. రంజీ ట్రోఫీలో ఈ సీజన్‌లో మిజోరం తరఫున బరిలోకి దిగిన అగ్నిదేవ్ వరుస శతకాలతో హోరెత్తిస్తున్నాడు. తండ్రి సినిమాల్లో సూపర్ హిట్‌లు సాధిస్తుంటే కొడుకు మైదానాల్లో సెంచరీలు బాదుతుండటం విశేషం. అగ్నిదేవ్ ఈ ఏడాదే ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు.

Ranji Trophy: 12th Fail Director Vidhu Vinod Chopras son Agni Dev Chopra Scores Centuries

ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో ఇప్పటివరకు నాలుగు మ్యాచ్‌లు ఆడిన అగ్నిదేవ్ 767 పరుగులు చేశాడు. ఇందులో అయిదు సెంచరీలు, ఒక్క హాఫ్ సెంచరీ ఉంది. 95 సగటుతో 111 స్ట్రైక్‌రేటుతో పరుగులు సాధిస్తూ ప్రశంసలు పొందుతున్నాడు. సిక్కింతో జరిగిన తొలి మ్యాచ్‌లో 166, 92 పరుగులు చేశాడు. రెండో ఇన్నింగ్స్‌లో త్రుటిలో శతకాన్ని చేజార్చుకున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో మిజోరం జట్టులో మరే ఇతర బ్యాటర్ 20 పరుగుల కంటే ఎక్కువ స్కోరు చేయలేకపోవడం గమనార్హం.

అనంతరం నాగాలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 164, 15 పరుగులు, అరుణాచల్ ప్రదేశ్‌పై 114, 10 పరుగులు, మేఘూలయపై 105, 101 పరుగులతో అగ్నిదేవ్ సత్తాచాటాడు. గతంలో అతడు ముంబయి అండర్ 19, అండర్ 23 జట్లతో ఆడాడు. కానీ గొప్ప ప్రదర్శనలు చేయలేకపోయాడు. ఆ తర్వాత రంజీ ట్రోఫీలో మిజోరం తరఫున బరిలోకి దిగాడు. అయితే సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో 150కు పైగా స్ట్రైక్‌రేటుతో పరుగులు చేసినప్పటికీ అతడికి ఐపీఎల్ వేలానికి షార్ట్ లిస్ట్ కాలేదు.

Story first published: Thursday, February 1, 2024, 11:05 [IST]
Other articles published on Feb 1, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+