Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

పంకజ్ యాదవ్: భారత్ అండర్-19 జట్టులో పాల వ్యాపారి కుమారుడు

Ranchi: Son of milkman selected for India's under-19 squad

హైదరాబాద్: మహేంద్ర సింగ్ ధోని స్వస్థలమైన రాంచీ నుంచి చాన్నాళ్లకు ఓ యువ క్రికెటర్ జాతీయ మీడియా దృష్టిని ఆకర్షించాడు. సోమవారం అండర్-19 వరల్డ్ కప్ కోసం సెలక్టర్లు జట్టుని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ జట్టులో రాంచీ పట్టణానికి చెందిన ఓ పాల వ్యాపారి కొడుకు చోటు దక్కించుకున్నాడు.

ఆ యువ క్రికెటర్ పేరు పంకజ్ యాదవ్. రాంచీతో పాటు ఆ చుట్టు పక్కల జిల్లాల్లో ఎక్కడ మ్యాచ్ జరిగినా పంకజ్ యాదవ్ పేరు మోరుమ్రోగి పోవాల్సిందే. కుడిచేతి వాటం స్పిన్నర్ అయిన పంకజ్ యాదవ్ అండర్-19 వరల్డ్ కప్ జట్టులో చోటు దక్కించుకున్న తర్వాత పంకజ్ మీడియాతో మాట్లాడాడు.

క్రికెట్ అంటే తనకు ప్రాణం అని, వరల్డ్ కప్‌లో అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తా. టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని, ఆసీస్ క్రికెట్ లెజెండ్ షేన్ వార్న్ నాకు రోల్ మోడల్స్' అని చెప్పాడు. కాగా, వరల్డ్ కప్ జట్టులో తమ కుమారుడు చోటు దక్కించుకోవడంపై పంకజ్ యాదవ్ తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా పంకజ్ యాదవ్ తండ్రి చంద్రదేవ్ యాదవ్ మాట్లాడుతూ 'నా కుమారుడు ఎప్పుడు చదువులో రాణించాలని కోరుకునే వాడిని. కానీ వాడికి క్రికెట్ అంటే ప్రాణం. దీంతో ఆ దిశగా వాడిని ప్రోత్సహించాను. అతడి ఛాయిస్‌ను గౌరవించి మద్దతుగా నిలిచాం. ధోనికి పంకజ్‌ వీరాభిమాని. ఏదో ఒకరోజు ధోని అంతటివాడవుతాడు' అని అన్నాడు.

దేశవాళీ క్రికెట్‌లో అద్భుత ప్రదర్శన చేస్తోన్న ముంబై యువ బ్యాట్స్‌మన్ పృథ్వీ షా.. వచ్చే ఏడాది జరగనున్న అండర్‌-19 వరల్డ్‌కప్‌లో భారత జట్టుకు కెప్టెన్‌గా నియమితుడయ్యాడు. జనవరి 13 నుంచి ఫిబ్రవరి 3 వరకు న్యూజిలాండ్‌లో అండర్-19 వరల్డ్‌కప్‌ జరగనుంది.

దీంతో 15 మంది సభ్యులతో కూడిన అండర్‌-19 జట్టును జూనియర్‌ సెలెక్షన్‌ కమిటీ సభ్యులు ఆదివారం ఎంపిక చేశారు. ఈ వరల్డ్ కప్‌లో మొత్తం 16 జట్లు పాల్గొంటున్నాయి. పంజాబ్‌ బ్యాట్స్‌మన్‌ శుభ్‌మన్‌ గిల్‌కు వైస్‌ కెప్టెన్సీని బాధ్యతలు అప్పగించారు.

హార్విక్‌ దేశాయ్‌ను వికెట్‌ కీపర్‌గాను అతడికి బ్యాకప్‌గా ఆర్యన్‌ను సెలెక్టర్లు ఎంపిక చేశారు. న్యూజిలాండ్‌ బయల్దేరడానికి ముందు డిసెంబర్ 8 నుంచి 22 వరకు బెంగళూరులో సన్నాహక శిబిరాన్ని నిర్వహిస్తారు. కాగా, భారత్‌ గతంలో మూడుసార్లు (2000, 2008, 2012) అండర్‌-19 ప్రపంచ విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే.

భారత అండర్‌-19 జట్టు:
పృథ్వీ షా (కెప్టెన్‌), శుభమ్‌ గిల్‌ (వైస్‌ కెప్టెన్‌), మంజోత్‌ కల్రా, హిమాంశు రాణా, అభిషేక్‌ శర్మ, రియాన్‌ పరాగ్‌, ఆర్యన్‌ జుయాల్‌ (వికెట్‌కీపర్‌), హార్విక్‌ దేశాయ్‌ (వికెట్‌కీపర్‌), శివమ్‌ మావి, కమ్లేశ్‌ నాగర్‌కోటి, ఇషాన్‌ పోరెల్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌, అనుకుల్‌ రాయ్‌, శివ సింగ్‌, పంకజ్‌ యాదవ్‌

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Thursday, December 7, 2017, 7:20 [IST]
Other articles published on Dec 7, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+