Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఐపీఎల్ ఫైనల్‌కు ముందు వేడుకలో అలరించనున్న సెలబ్రిటీలు

Ranbir Kapoor to host TV show before IPL final

హైదరాబాద్: బీసీసీఐ ఐపీఎల్ ఆరంభ వేడుకలు ఘనంగా నిర్వహించింది. కార్యక్రమంలో నృత్య ప్రదర్శనకు వస్తానన్న కళాకారులు మొహం చాటేసినా.. ప్రత్యామ్నాయాలతో అంగరంగ వైభవంగా కనుల పండుగగా కార్యక్రమం నిర్వహించింది. ఇదే పంథాలో ముగింపు వేడుకలు నిర్వహిస్తదేమో అని చూశాయి మీడియా వర్గాలు. బీసీసీఐ వైఖరి అందుకు సిద్ధంగా కనిపించకపోవడంపతో మీడియా ప్రసార హక్కులు కొనుగోలు చేసిన స్టార్ నెట్ వర్క్‌యే ముగింపు వేడుకలు నిర్వహించేందుకు పూనుకుంది.

వచ్చే సీజన్ వరకు టోర్నీ మధుర జ్ఞాపకాలను అభిమానులు గుర్తించుకునేలా సెలబ్రిటీలతో ఓ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రోగ్రాంను నిర్వహించనుంది. అట్టహాసంగా నిర్వహించే ప్రోగ్రాంలో బాలీవుడ్ న‌టీన‌టులు రణ్‌బీర్ కపూర్, సల్మాన్ ఖాన్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, కరీనా కపూర్, సోనమ్ కపూర్‌లతో పాటు తదితరులు పాల్గొని ప్రత్యేక షోలు, నృత్య ప్రదర్శనలతో అభిమానులను అలరించనున్నారు. ఫైనల్ మ్యాచ్ ఆరంభానికి ముందు ఐదు గంటల పాటు వీరంతా సందడి చేస్తారు. ఇందులో రెండు గంటల పాటు సాగే ఒక షోకు రణ్‌బీర్ కపూర్ వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నాడు.

స్టార్‌నెట్‌వర్క్ ఎంటర్‌టైన్‌మెంట్ ఛానెల్‌లో.. క్రికెట్ ఫైనల్స్.. పార్టీ తో బంతి హై అనే టైటిల్‌తో వినోద కార్యక్రమాన్ని ప్రసారం చేయనుంది. ఇది ఒక మంచి ఎంటర్‌టైన్‌మెంట్ ప్యాకేజీ.. అని స్టార్ ప్రతినిధి ఒకరు తెలిపారు.

ఇంతకుముందు లేని విధంగా ప్రాంతీయ భాషల్లోనూ కామెంటరీ మొదలుపెట్టిన ఐపీఎల్.. మరాఠీ, మలయాళం, హిందీ, ఇంగ్లీష్, తమిళ్, తెలుగు, బెంగాలీ, కన్నడ భాషలలో కామెంటరీని నిర్వహిస్తోంది. ఇంకా బీసీసీఐ నియమించిన ఏడుగురు సెలక్టర్లలో ఇద్దరు మాత్రమే ఇండియన్స్. సునీల్ గవాస్కర్, సంజయ్ మంజ్రేకర్ మినహాయించి మిగిలిన ఐదుగురు సైమన్ డల్, గ్రేమ్ స్మిత్, మైఖేల్ స్లేటర్, మాథ్యూ హేడెన్, మేఖేల్ క్లార్క్.

Story first published: Monday, May 21, 2018, 15:13 [IST]
Other articles published on May 21, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+