రమీజ్ రాజా జోస్యం.. కోహ్లీని బాబర్ అజామ్ అధిగమించగలడు!!

ఇస్లామాబాద్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని పాకిస్థాన్ మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ బాబర్ అజామ్ పరుగుల్లో అధిగమించగలడని ఆ దేశ మాజీ క్రికెటర్, కామెంటేటర్ రమీజ్ రాజా జోస్యం చెప్పాడు. కోహ్లీని అధిగమించే అన్ని లక్షణాలు ఉన్నాయి, అంతేకాదు కోహ్లీ కంటే గొప్ప ఆటగాడిగా అయ్యే సామర్థ్యం అజామ్‌లో ఉంది అని రమీజ్ రాజా అన్నాడు. ఐసీసీ టీ20 బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్‌లో అజామ్ అగ్రస్థానంలో ఉండగా.. వన్డేలలో3, టెస్టులలో 5 వ స్థానంలో ఉన్నాడు. 2015లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన అజామ్.. గత రెండేళ్లుగా మూడు ఫార్మాట్లలో పరుగుల వరద పారిస్తున్నాడు.

ఎదిగేందుకు మంచి అవకాశం
బాబర్ అజామ్ బ్యాటింగ్ గురించి పాక్ దిగ్గజ క్రికెటర్, ప్రముఖ వ్యాఖ్యత రమీజ్ రాజా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... 'బాబర్ అజామ్‌కి ఇప్పుడు ఎదిగేందుకు మంచి అవకాశం. అతని చుట్టూ మెరుగైన వాతావరణం ఉంచుతూ.. సరైన ప్రోత్సాహం ఇవ్వాలి. లేకపోతే అతను తన సామర్థ్యం మేరకు రాణించలేడు. ఇప్పటికే బాబర్ అజామ్ సాధించిన పరుగులు, గెలిపించిన మ్యాచ్‌లను పరిశీలిస్తే.. అంతర్జాతీయ క్రికెట్‌లో విరాట్ కోహ్లీని అధిగమించగల సామర్థ్యం అతనికి ఉందనిపిస్తోంది' అని అన్నాడు.

కోహ్లీని అధిగమించగలడు
'కోహ్లీని అధిగమించే అన్ని లక్షణాలు అజామ్‌లో ఉన్నాయి. కోహ్లీ కంటే గొప్ప ఆటగాడిగా అయ్యే సామర్థ్యం అజామ్‌లో ఉంది. అయితే కోహ్లీని దాటాలంటే అజామ్ ఆటను మరింత మెరుగుపరుచుకోవాలి. పరుగులు చేస్తూ జట్టుకు విజయాలు అందించాలి. అజామ్ బ్యాటింగ్‌కు దిగిన ప్రతీ సందర్భంలోనూ తన మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి. అంతేకాకుండా సానుకూల ధోరణి అలవరుచుకోవాలి. అలసత్వాన్ని ఎప్పుడు దరిచేరనీయకూడదు. అటువంటప్పుడే ఒక గొప్ప క్రికెటర్‌గా అతడు రూపాంతరం చెందుతాడు' అని రమీజ్ పేర్కొన్నాడు.

కోహ్లీతో ఇప్పుడే పోలిక సరికాదు
'సుదీర్ఘకాలం ఆటను శాసించాలంటే అజామ్ చాలా ఓర్పుతో ఆటపై ఇంకా ఫోకస్ చేయాలి. అజామ్ పూర్తి స్థాయి ప్రదర్శన బయటకు రావాలంటే ఆకర్షణీయంగా ఉండే వాతావారణం అవసరం. అప్పటివరకూ అజామ్‌లోని పూర్తిస్థాయి బ్యాటింగ్ బయటకు వస్తుందని నేను అనుకోవడం లేదు. తనను కోహ్లీతో పోల్చడంపై ఒకానొక సందర్భంలో అజామ్ మాట్లాడుతూ.. ఒక లెజెండ్ హోదాను సాధించాలని ఉందన్నాడు. కోహ్లీ తరహాలో గ్రేట్ బ్యాట్స్‌మన్‌గా ఎదగాలని ఉందన్నాడు. కోహ్లీతో ఇప్పుడే పోలిక సరికాదు. ఇప్పటికే దేశం కోసం కోహ్లీ ఎంతో సాధించాడు, అతనితో అప్పుడే పోలిక వద్దు' అని రమీజ్ సూచించాడు.

టీ20ల్లో దూకుడు
2015లో పాకిస్థాన్ జట్టులోకి వచ్చిన బాబర్ అజామ్ ఇప్పటి వరకూ 26 టెస్టులాడి 45.12 సగటుతో 1,850 పరుగులు చేశాడు. ఇందులో 5 సెంచరీలు, 13 అర్ధ సెంచరీలు ఉన్నాయి. 74 వన్డేల్లో 54.18 సగటుతో 3,359 పరుగులు చేసాడు. వన్డేల్లో 11 శతకాలు, 15 అర్ధ శతకాలు సాధించాడు. ఇక 38 టీ20లు ఆడి 50.72 సగటుతో 1,471 పరుగులు చేశాడు. ప్రస్తుతం బాబర్ అజామ్ వయసు 25 ఏళ్లు కాగా.. ఈ వయసులో కోహ్లీ గణాంకాలు ఇలా లేవు.

70 సెంచరీలు
2008లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి వచ్చిన విరాట్ కోహ్లీ ఇప్పటి వరకూ 86 టెస్టులాడి 53.63 సగటుతో 7,240 పరుగులు చేశాడు. ఇందులో 27 సెంచరీలు, 7 డబుల్ సెంచరీలు, 22 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 248 వన్డేల్లో 59.34 సగటుతో 11,867 పరుగులు చేసాడు. ఇందులో 43 సెంచరీలు, 58 అర్ధ శతకాలు ఉన్నాయి. ఇక 81 టీ20లలో 50.8 సగటుతో 2,794 పరుగులు చేశాడు. మొత్తంగా అంతర్జాతీయ క్రికెట్‌లో 70 సెంచరీలు చేసిన కోహ్లీ.. 21,901 పరుగులు చేశాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications