నేడే ఇంటర్వ్యూలు: మహిళల జట్టు కోచ్ ఎవరో, రేసులో ఉన్నది వీరే?

హైదరాబాద్: భారత మహిళల క్రికెట్ జట్టు కోచ్ ఎంపిక కోసం బీసీసీఐ గురువారం ఇంటర్వ్యూలు నిర్వహించనుంది. కోచ్ పదవికి మొత్తం 28 మంది కోచ్ పదవికి దరఖాస్తు చేసుకోగా.. బీసీసీఐ పది మందిని ఇంటర్వ్యూలకు ఎంపిక చేసింది. వీరిని కోచ్ పదవి కోసం ఏర్పాటు చేసిన మాజీ క్రికెటర్లు కపిల్ దేవ్, అన్షుమన్ గైక్వాడ్, శాంత రామస్వామిలతో కూడిన అడ్‌హాక్ ప్యానెల్ ఇంటర్వ్యూ చేస్తుంది.
ఈ తుది జాబితాలో గ్యారీ కిర్‌స్టెన్, హెర్షల్ గిబ్స్, డబ్ల్యూవీ రామన్, ట్రెంట్ జాన్సన్, మార్క్ కోల్స్, దిమిత్రి మాస్కరేనస్, వెంకటేశ్ ప్రసాద్, మనోజ్ ప్రభాకర్, బ్రాడ్ హాగ్‌లతో పాటు కొన్ని నెలల పాటు మహిళల జట్టుకు తాత్కాలిక కోచ్‌గా పనిచేసిన రమేశ్ పొవార్‌లు ఇంటర్వ్యూకు హాజరవనున్నారు. దేశీయ క్రికెటర్లు మాత్రం వ్యక్తిగతంగా హాజరుకానున్నారు.

విదేశీ అభ్యర్థులను స్కైప్ ద్వారా
ఇక, విదేశీ అభ్యర్థులు స్కైప్ ద్వారా అడ్‌హాక్ ప్యానెల్ ముందు తమ ప్రజెంటేషన్‌ను ఇవ్వనున్నారు. వీరిలో గ్యారీ కిర్‌స్టెన్‌కే ఎక్కువ అవకాశాలున్నాయని బోర్డు అధికారులు అంటున్నారు. గ్యారీ కిర్‌స్టెన్ కోచ్‌గా ఉన్నపుడే టీమిండియా టెస్టుల్లో తొలిసారి నంబర్‌వన్ అయింది. అంతేకాదు 2011 వన్డే వరల్డ్‌కప్‌ను కూడా గెలిచింది.

కొత్త కోచ్ నియామకం కోసం బీసీసీఐ
మొదటి నుంచి టీమిండియాకు నూతన కోచ్ అవసరం లేదంటూ క్రికెట్ పరిపాలకుల కమిటీ (సీఓఏ)లో సభ్యురాలైన డయానా ఎడుల్జీ వాదిస్తున్నప్పటకీ... చైర్మన్ వినోద్ రాయ్ మాత్రం రమేశ్ పొవార్ పదవి కాలాన్ని పొడిగించేందుకు సుముఖత వ్యక్తం చేయలేదు. దీంతో భారత మహిళల క్రికెట్ కొత్త కోచ్ నియామకం కోసం బీసీసీఐ దరఖాస్తులను ఆహ్వానించింది.

గ్యారీ కిర్‌స్టెన్‌కే ఎక్కువ అవకాశాలు?
గ్యారీ కిర్‌స్టెన్‌కే ఎక్కువ అవకాశాలున్నాయని బోర్డు అధికారులు అంటున్నారు. వివాదరహితుడిగా పేరొందడం, నైపుణ్యం, కోచింగ్‌లో అనుభవరీత్యా కోచ్ పదవి కిర్‌స్టెన్‌నే వరించే అవకాశం ఎక్కువగా ఉంది. ఇక రమేశ్ పొవార్ దరఖాస్తు చేసుకున్నప్పటికీ అతడిని మరలా కోచ్‌గా నియమించేందుకు బీసీసీఐ సుముఖంగా లేదు.

వెంకటేశ్ ప్రసాద్, మనోజ్ ప్రభాకర్‌ల మధ్య తీవ్ర పోటీ
అయితే, టీ20 కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, వైస్ కెప్టెన్ స్మృతి మంధాన మద్దతు ఉండటం పొవార్‌కు కలిసొచ్చే అంశం. ఈ మద్దతు ఏ మేరకు పనిచేస్తుందో చూడాలి మరి. మరోవైపు దక్షిణాఫ్రికా మాజీ ఓపెనర్ హెర్షల్ గిబ్స్‌కు కూడా కోచ్ అయ్యే రేసులో ఉన్నాడు. స్వదేశీ కోచ్‌నే తీసుకోవాలనే ఆలోచనలో ఉంటే మాత్రం వెంకటేశ్ ప్రసాద్, మనోజ్ ప్రభాకర్‌ల మధ్య తీవ్ర పోటీ ఉండే అవకాశం ఉంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications