టీమిండియా మహిళా కోచ్‌గా రమేశ్‌ పొవార్‌.. ఇక మిథాలీరాజ్ కెరీర్ ముగిసినట్లేనా?

ముంబై: టీమిండియా మహిళా క్రికెట్​ జట్టు ప్రధాన కోచ్​గా మాజీ స్పిన్నర్​ రమేశ్​ పొవార్​ మరోసారి నియమితుడయ్యాడు. ఈ విషయాన్ని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ట్విటర్ వేదికగా వెల్లడించింది. ఈ పదవికి ప్రస్తుత హెడ్​కోచ్ డబ్ల్యూవీ రామన్​తో పాటు మాజీ వికెట్​ కీపర్​ అజయ్​ రాత్రా, మమతా మబెన్​, దేవికా వైద్య, మాజీ చీఫ్​ సెలక్టర్​ హేమలతా సహా మరో ముగ్గురు పోటీపడ్డారు. వీరిని మాజీ క్రికెటర్ మదన్ లాల్ నేతృత్వంలోని క్రికెట్ అడ్వైజరీ కమిటీ(సీఏసీ) ఇంటర్వ్యూ చేసి పొవార్‌ను ఎంపిక చేసింది.

మిథాలీతో గొడవ..

మిథాలీతో గొడవ..

2018 లోనూ భారత మహిళా క్రికెట్​ జట్టుకు కోచ్​గా పనిచేసిన పొవార్.. సీనియర్ ప్లేయర్ మిథాలీరాజ్‌తో గొడవపడి వేటుకు గురయ్యాడు. పొవార్ అనాలోచిత నిర్ణయాల కారణంగా భారత మహిళల జట్టు టీ20 ప్రపంచకప్ గెలుచుకునే సువర్ణవకాశాన్ని కోల్పోయింది. ఇంగ్లండ్‌తో జరిగిన నాటి సెమీఫైనల్‌ మ్యాచ్‌లో ఉద్దేశపూర్వకంగానే పొవార్ సీనియర్ ప్లేయర్ అయిన మిథాలీ రాజ్‌ను తప్పించారు. దాంతో ఆ మ్యాచ్‌లో భారత్ ఓటమిపాలైంది. ఇక తనను జట్టు నుంచి తప్పించడంపై మిథాలీ ట్విటర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేసింది. బీసీసీఐకి పొవార్‌పై మెయిల్ ద్వారా ఫిర్యాదు కూడా చేసింది.

మిథాలీ ఫిర్యాదుతో..

మిథాలీ ఫిర్యాదుతో..

మహిళా టీ20 ప్రపంచకప్‌ సెమీస్‌లో తనను అర్థాంతరంగా తప్పించడం వెనుక కోచ్‌ రమేశ్‌ పవార్‌, మాజీ కెప్టెన్‌, పరిపాలకుల కమిటీ (సీఓఏ) మెంబర్‌ డయానా ఎడుల్జీల హస్తం ఉందని అప్పట్లో మిథాలీ రాజ్‌ ఆరోపించింది. తమ అధికారం అడ్డం పెట్టుకొని తనను తొక్కేయడానికి ప్రయత్నించారని బీసీసీఐకి రాసిన లేఖలో పేర్కొంది. ‘నాకు వ్యతిరేకంగా డయానా తన అధికారాన్ని ఉపయోగించింది.

నా 20 ఏళ్ల క్రికెట్‌ కెరీర్‌లో తొలి సారి నేను చాలా బాధపడ్డాను. అవమానానికి గురయ్యాను. అధికారంలో ఉండి నన్ను నాశనం చేయాలని, నా ఆత్మవిశ్వాసంపై దెబ్బకొట్టాలని ప్రయత్నించారు. నేను క్రికెట్‌ ఆడకుండా కొంతమంది కుట్రపన్నారు. ఈ విషయంలో కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌పై నాకెలాంటి వ్యతిరేకత లేదు. నన్ను జట్టు నుంచి తొలగించాలని చెప్పిన కోచ్‌ నిర్ణయానికి ఆమె మద్దతు ఇవ్వడమే ఎంతో బాధించింది. క్షోభకు గురిచేసింది. దేశం కోసం ప్రపంచకప్‌ గెలవాలనుకున్నా. కానీ మేం ఓ బంగారంలాంటి అవకాశం కోల్పోయాం.'అని మిథాలీ ఆవేదన వ్యక్తం చేసింది.

మళ్లీ కోచ్‌గా చాన్స్..

మళ్లీ కోచ్‌గా చాన్స్..

మిథాలీ ఫిర్యాదుతో కోచ్ పొవార్‌పై బీసీసీఐ వేటు వేసింది. అతను మరోసారి కోచ్‌ పదవికి దరఖాస్తు చేసుకున్నా.. పక్కనపెట్టేసింది. డబ్ల్యూవీ రామన్‌‌ను కోచ్‌గా నియమించింది. డబ్ల్యూవీ రామన్ గడువు ముగియడంతో మరోసారి బీసీసీఐ దరఖాస్తులు ఆహ్వానించగా.. 35 మంది పోటీ పడ్డారు. అందులో 8 మందిని షార్ట్ లిస్ట్ చేసిన బీసీసీఐ సీఏసీ.. వారికి తాజాగా ఇంటర్యూలు నిర్వహించి పొవార్‌కు మళ్లీ అవకాశం ఇచ్చింది.

కెరీర్​లో 2 టెస్టులు ఆడిన పొవార్ 6వికెట్లు తీశాడు. 31 వన్డేల్లో 34 వికెట్లు పడగొట్టాడు. ఇక 27 ఐపీఎల్​ మ్యాచుల్లో 13 వికెట్లు తీశాడు. అయితే పొవార్ మరోసారి కోచ్‌గా నియమితులవ్వడంతో మిథాలీ కెరీర్ ముగిసినట్లేనని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. సుదీర్ఘకాలంగా ఆడుతున్న మిథాలీ టీ20లకు గుడ్‌బై చెప్పి వన్డేలు మాత్రమే ఆడుతుంది.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Thursday, May 13, 2021, 18:52 [IST]
Other articles published on May 13, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X