భారత్-పాక్ మ్యాచ్ ఫిక్సయిందా, కోహ్లీ మాటేమిటి, ఇక్కడే డౌట్: కేంద్రమంత్రి సంచలనం
వదోదర: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో భారత్‌పై పాకిస్తాన్ ఇటీవల విజయం సాధించింది. దీనిపై కేంద్రమంత్రి రామ్‌దాస్ అథవాలే సంచలన వ్యాఖ్యలు చేశారు.
గత నెల 18వ జరిగిన ఈ ఫైనల్ మ్యాచ్ ఫిక్స్ అయిందేమనని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. గుజరాత్‌లో పర్యటిస్తున్న ఆయన మీడియాతో మాట్లాడారు.

విస్మయానికి గురి చేసింది
ఈ మ్యాచ్‌లో భారత్ ఘోర పరాజయం తనను విస్మయానికి గురి చేసిందన్నారు. తనతో పాటు ప్రతి అభిమానికీ ఫిక్సింగ్ పైన అనుమానాలున్నాయని చెప్పారు.

సమగ్ర దర్యాఫ్తు జరపాలి
దీనిపై సమగ్ర దర్యాఫ్తు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఒక మ్యాచ్ లో పాకిస్థాన్‌ను 180 పరుగుల తేడాతో ఓడించిన జట్టు, ఇంకో మ్యాచ్‌లో 124 పరుగుల తేడాతో ఓడిపోవడం ఎంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తోందన్నారు. ఇదెలా సాధ్యమని, మ్యాచ్ ఫిక్సయిందా? దీనిపై వాస్తవాలు వెలికితీయాలని డిమాండ్ చేశారు.

యువరాజ్, కోహ్లీలకు ఏమయినట్లు?
యువరాజ్ సింగ్ గతంలో ఎన్నో పరుగులు సాధించాడని, విరాట్ కోహ్లీ తరుచూ సెంచరీలు చేస్తుంటాడని, కానీ వీరిద్దరు పాకిస్తాన్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ఓడిపోవడానికే ఆడినట్లుగా ఉందన్నారు. కోచ్ అనిల్ కుంబ్లే అక్కడే ఉన్నాడని, గతంలో ఎన్నో పరుగులు చేసిన కోహ్లీకు ఆ రోజు ఏమైనట్లు అని, అందుకే మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందనే అనుమానం కలుగుతోందన్నారు. ఆటగాళ్లు మనల్ని మోసం చేశారని, పాక్ వంటి ప్రత్యర్థి ముందు మోకరిల్లారన్నారు.

క్రికెట్లో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు కావాలని...
మరోవైపు, భారత జాతీయ క్రికెట్ జట్టులో ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన క్రీడాకారులకు రిజర్వేషన్ కల్పించాలని రాందాస్ అభిప్రాయపడ్డారు. కనీసం 25 శాతం రిజర్వేషన్ కల్పిస్తే ఆయా వర్గాలకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందన్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications