న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

పాడె మోసి గురువు రుణం తీర్చుకున్నాడు: ఆచ్రేకర్ అంత్యక్రియల్లో సచిన్

Ramakant Achrekar no more: Sachin Tendulkar, Vinod Kambli attend childhood coachs last rites

హైదరాబాద్: క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ గురువు రమాకాంత్ అచ్రేకర్ అంతిమ యాత్ర గురువారం ముగిసింది. ముంబైలో జరిగిన అచ్రేకర్ అంతిమయాత్ర‌కి వినోద్ కాంబ్లీతో కలిసి సచిన్ టెండూల్కర్ హాజరయ్యాడు. స్వయంగా సచిన్ తన గురువు పాడెను మోశారు.

<strong>నల్ల రిబ్బన్లు ధరించి బరిలోకి దిగిన టీమిండియా.. ఎందుకంటే..!!</strong>నల్ల రిబ్బన్లు ధరించి బరిలోకి దిగిన టీమిండియా.. ఎందుకంటే..!!

ఆ సమయంలో సచిన్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. గత కొన్నాళ్లుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బుధవారం ముంబైలోని తన నివాసంలో మరణించిన సంగతి తెలిసిందే. ఆయన మరణవార్త తెలిసి సచిన్‌తో పాటు పలువురు మాజీ క్రికెటర్లు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలిపారు.

1932లో జన్మించిన అచ్రేకర్‌

1932లో జన్మించిన అచ్రేకర్‌

1932లో అచ్రేకర్‌ జన్మించారు. 1943లో క్రికెట్ కెరీర్‌ని ఆరంభించిన అచ్రేకర్.. 1945లో తొలిసారి న్యూ హింద్ స్పోర్ట్స్ క్లబ్ తరఫున ఆడాడు. ఆ తర్వాత యంగ్‌ మహారాష్ట్ర ఎలెవన్‌, గుల్‌ మోహర్‌ మిల్స్‌, ముంబయి పోర్ట్‌కు ప్రాతినిథ్యం వహించారు. 1963-64 మొయిన్‌ద్దౌలా టోర్నీలో ఆల్‌ ఇండియా స్టేట్‌ బ్యాంకు జట్టు తరఫున హైదరాబాద్‌పై ఒక ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌ ఆడారు.

మధ్యలోనే వదిలేసిన అచ్రేకర్

మధ్యలోనే వదిలేసిన అచ్రేకర్

అనంతరం క్రికెట్‌గా కెరీర్‌ని మధ్యలోనే వదిలేసిన అచ్రేకర్.. ముంబైలోని శివాజీ పార్క్‌లో క్రికెట్ శిక్షకుడిగా మారాడు. ఎంతో మంది క్రికెటర్లకు ఆయన పాఠాలు చెప్పారు. ఈ సమయంలో 11ఏళ్ల వయసులోనే సచిన్ టెండూల్కర్‌ అసాధారణ ప్రతిభని గుర్తించాడు.

ఎన్నో సరికొత్త రికార్డులు నెలకొల్పిన సచిన్

ఎన్నో సరికొత్త రికార్డులు నెలకొల్పిన సచిన్

ఆ తర్వాత భారత్ జట్టులోకి ప్రవేశించిన సచిన్.. 24 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌లో ఎన్నో సరికొత్త రికార్డులు నెలకొల్పడం అందరికీ తెలిసిందే. సచిన్‌తో పాటు వినోద్‌ కాంబ్లి, ప్రవీన్‌ ఆమ్రె, సమీర్‌ దిఘె, బల్విందర్‌ సింగ్‌ సంధు, అజిత్‌ అగార్కర్‌ వంటి క్రికెటర్లకు క్రికెటర్లను తీర్చిదిద్దారు.

ఆచ్రేకర్‌ మృతికి సంతాపంగా బ్లాక్ రిబ్బన్‌

ఆచ్రేకర్‌ మృతికి సంతాపంగా బ్లాక్ రిబ్బన్‌

గురువారం భారత్, ఆస్ట్రేలియా మధ్య సిడ్నీ వేదికగా ఆరంభమైన నాలుగో టెస్టులో రమాకాంత్ ఆచ్రేకర్‌ మృతికి సంతాపంగా టీమిండియా ఆటగాళ్లు ‘బ్లాక్ రిబ్బన్‌‌'ని చేతికి ధరించి మ్యాచ్ ఆడారు. మరోవైపు ఆసీస్‌ మాజీ క్రికెటర్‌ బిల్‌ వాట్సన్‌(87) ఇటీవల కన్నుమూశారు. ఆయన మరణానికి సంతాపంగా ఆసీస్ ఆటగాళ్లు కూడా నల్లబ్యాండ్లు ధరించారు.

Story first published: Thursday, January 3, 2019, 17:25 [IST]
Other articles published on Jan 3, 2019
Read in English: Ramakant Achrekar cremated
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X