Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో పర్యటిస్తోన్నాడు. భార్య ఉపాసన కొణిదెలతో కలిసి టూర్ ఎంజాయ్ చేస్తోన్నాడు. రాష్ట్రానికి తిరిగి వచ్చిన తరువాత తన నెక్స్ట్ ప్రాజెక్ట్‌లో పార్టిసిపేట్ చేస్తాడు. బుచ్చి బాబు సానా దర్శకత్వం వహించనున్న సినిమాకు ఇదివరకే సైన్ చేశాడు. దీని వర్కింగ్ టైటిల్ RC16. జాన్వీ కపూర్ హీరోయిన్.
రామ్ చరణ్ నటించిన తాజా సినిమా గేమ్ ఛేంజర్. ఎస్ శంకర్ దర్శకుడు. త్వరలో విడుదల కాబోతోందీ పాన్ ఇండియా మూవీ. కియారా అద్వానీ కథానాయిక. ఎస్ జే సూర్య, శ్రీకాంత్, జయరాం, అంజలి, సునీల్.. ఇతర ముఖ్యపాత్రల్లో నటించారు. 300 కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్‌తో తెరకెక్కింది. డిసెంబర్ 20వ తేదీన విడుదల కానుంది.

గేమ్ ఛేంజర్ సినిమా షూటింగ్ కూడా పూర్తి చేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకొంటోంది. ఈ మూవీ తరువాత బ్రేక్ తీసుకున్నాడు రామ్ చరణ్. ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో పాల్గొనడానికి మెల్‌బోర్న్ వెళ్లాడు. టాలీవుడ్ నుంచి రామ్ చరణ్ ఒక్కడికే ఇన్విటేషన్ లభించింది. బాలీవుడ్ సెలెబ్రిటీలు నోరా ఫతేహి, మలైకా అరోరా.. వంటి మరికొందరు దీనికి హాజరయ్యారు.
ఈ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఐసీసీ వరల్డ్ కప్ 2023ని డిస్‌ప్లేకు ఉంచింది క్రికెట్ ఆస్ట్రేలియా. బిగ్గెస్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ కావడం.. క్రికెట్ ప్రపంచంలో ది బెస్ట్ కప్ కావడం వల్ల దీన్ని ఇందులో ప్రదర్శనకు ఉంచింది. ఈ వరల్డ్ కప్ ట్రోఫీతో ఫొటోలకు పోజులిచ్చాడు రామ్ చరణ్. ఉపాసనతో కలిసి ఫొటోలు దిగాడు.
గత ఏడాది అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన వరల్డ్ కప్ 2023 ఫైనల్స్‌లో భారత్‌ను ఓడించింది ఆస్ట్రేలియా. ట్రోఫీని సొంతం చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లల్లో 240 పరుగులకు ఆలౌట్ అయింది. దీన్ని 43 ఓవర్లలోనే కొట్టి పడేసింది ఆస్ట్రేలియా. ఓపెనర్ ట్రావిస్ హెడ్ 137 పరుగులతో చెలరేగాడు.